వచ్చే ఏడాదిలోగా ఇందులో ఇన్వెస్ట్ చేస్తే 49% శాతం లాభాలు!
ఆయా సంస్థల ఇటీవల ప్రదర్శన, త్రైమాసిక ఫలితాలు, కంపెనీ డీల్స్ వంటి ఆధారంగా బ్రోకరేజీ సంస్థలు కొనుగోలు చేయవచ్చునని సూచన చేస్తుంటాయి. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ ఓ రెండు సంస్థలను సూచిస్తోంది. HDF ఇన్ఫ్రా ఇంజినీరింగ్, భారత్ ఫోర్జ్ కంపెనీలు వచ్చే ఏడాది కాలంలో వరుసగా 49 శాతం, 12 శాతం రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది. ఈ రెండు స్టాక్స్‌ను ఎందుకు కొనుగోలు చేయాలో ఈ బ్రోకరేజీ సంస్థ కారణాలు కూడా చెబుతోంది. స్టాక్ మార్కెట్, ఫండ్స్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. కాబట్టి పెట్టుబడులకు సంబంధించి ఆచితూచి వ్యవహరించాలి.

HG ఇన్ఫ్రా టార్గెట్ ధర రూ.800
HG ఇన్ఫ్రా షేర్ ధర ప్రస్తుతం రూ.540 వద్ద ఉంది. ఈ స్టాక్ వచ్చే ఏడాది కాలంలో 49 శాతం లాభపడి రూ.800కు చేరుకోవచ్చునని బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ చెబుతోంది. ఈ బ్రోకరేజీ సంస్థ ప్రకారం HG ఇన్ఫ్రా సబ్ కాంట్రాక్టింగ్ ద్వారా జర్నీని ప్రారంభించింది. క్రమంగా ఎదిగి ఇప్పుడు దేశీయ ప్రముఖ ఈపీసీ ప్లేయర్‌గా నిలిచింది. 2012, 2017లలో 75 శాతం, 50 శాతం కలిగి ఉన్న సబ్-కాంట్రాక్టింగ్, ఇప్పుడు 25 శాతం కంటే తక్కువగా ఉంది. HG ఇన్ఫ్రా తన ప్రీ-క్వాలిఫికేషన్‌ను ఏడాది క్రితం ఉన్న రూ.15 బిలియన్ డాలర్ల నుండి ఇప్పుడు రూ.28 బిలియన్ డాలర్లకు పెంచుకుంది. ఈ బ్రోకరేజీ సంస్థ ప్రకారం రోడ్ సెక్టార్‌లో మధ్యకాలిక వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. FY21-FY25 మధ్య రోడ్డు రంగంలో పెట్టుబడులు భారీగా ఉంటాయని అంచనాలు ఉన్నాయి. FY16-FY21తో పోలిస్తే వచ్చే అయిదేళ్ల కాలంలో పెట్టుబడులు 1.6X పెట్టుబడులు ఉంటాయని అంచనా. నీరు, రైల్వేలు, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా వివిధ అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దీర్ఘకాలంలో ఈ రంగం మరింత పుంజుకుంటుందని వెల్లడించింది.

భారత్ ఫోర్జ్ స్టాక్ టార్గెట్ రూ.928
భారత్ ఫోర్జ్ షేర్ ధర ప్రస్తుతం రూ.815 వద్ద ఉంది. ఈ స్టాక్ వచ్చే ఏడాది కాలంలో 12 శాతం వరకు ఎగిసి రూ.928కి చేరుకోవచ్చునని ఎంకే గ్లోబల్ తెలిపింది. భారత్ ఫోర్జ్ పైన తమ సానుకూల దృక్పథం ఆటోమోటివ్ ఫోర్జింగ్‍లో డైవర్సిఫికేషన్, కోర్ సెగ్మెంట్‌లో మంచి రికవరీ కలిసి వస్తుందని చెబుతోంది. రక్షణ, రైల్వే, ఏరోస్పేస్, ఈ-మొబిలిటీ, లైట్ వెయిటింగ్ సొల్యూషన్స్ మీడియం టర్మ్ పని తీరుకు అద్దం పడతాయని తెలిపింది. Q2FY22లో ఈ సంస్థ వరుసగా ఆదాయ వృద్ధిని నమోదు చేయవచ్చునని తెలిపింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఆదాయం క్యూ1లో రూ.1.5 బిలియన్ డాలర్లుగా ఉండగా, Q4FY21లో రూ.450 మిలియన్ డాలర్లుగా ఉంది. రాబోయే త్రైమాసికాల్లోను ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తోంది.

పూర్తి అవగాహనతో పెట్టుబడి
షేర్ మార్కెట్ లేదా స్టాక్స్‌లో లేదా ఫండ్స్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్న పని. కాబట్టి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవాలి. అలాగే, స్టాక్ మార్కెట్ గురించి, స్టాక్స్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఈ కథనం ఆధారంగా పెట్టుబడి కంటే పూర్తి అవగాహనతో ఇన్వెస్ట్ చేయడం మంచిది.


Click it and Unblock the Notifications