ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు ప్రభుదాస్ లీలాధర్, ఆజ్‌కోన్ గ్లోబల్ రెండు స్టాక్స్ కొనుగోలుకు రికమండ్ చేస్తున్నాయి. బర్గర్ కింగ్, సీమెన్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ పొందవచ్చునని సజెస్ట్ చేస్తున్నాయి. బర్గర్ కింగ్ 57 శాతం రిటర్న్స్, సీమెన్స్ లిమిటెడ్ 18 శాతం రిటర్న్స్ ఇవ్వవచ్చునని అంచనా వేస్తున్నాయి. గత ఏడాదిన్నరగా అంటే కరోనా మహమ్మారి అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్ల పైన చిన్న చిన్న ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టి సారించారు.
రిటైల్ ఇన్వెస్టర్లు పెరగడంతో పాటు వీరి పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో భారీగా పతనమయ్యాయి. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వారు మంచి రిటర్న్స్ పొందారు. ఇప్పుడు సూచీలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. 2020 మార్చిలో 27,000 దిగువన ఉన్న సెన్సెక్స్ ఇప్పుడు 58,000 క్రాస్ చేసింది.
ఈ సెకండ్ వేవ్ తర్వాత 47,000 దిగువ నుండి 11,000కు పైగా ఎగిసింది. సూచీలు ప్రస్తుతం టాప్ గెర్‌లో ఉండటంతో దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేసినప్పటికీ, స్వల్పకాలానికి మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవాలి. ఈ నేపథ్యంలో పై రెండు బ్రోకరింగ్ సంస్థలు రెండు స్టాక్స్‌ను సజెస్ట్ చేస్తున్నాయి.

బర్గర్ కింగ్ 57 శాతం రిటర్న్స్
ప్రభుదాస్ లీలాధర్ ఇటీవల లిస్ట్ అయిన బర్గర్ కింగ్ ఇండియా స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది. 57 శాతం రిటర్న్స్ ఇవ్వవచ్చునని పేర్కొంది. ప్రస్తుతం బర్గర్ కింగ్ షేర్ ధర రూ.158 వద్ద ఉంది. ఈ స్టాక్ రూ.250కి చేరుకోవచ్చునని అంచనా వేస్తోంది. పీటీ సారీ బర్గర్ ఇండోనేషియాలో 85 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు బర్గర్ కింగ్ ఇండియా నాన్-బైండింగ్ అవగాహనకు వచ్చింది.
F&B ఏషియా వెంచర్స్ (65.8 శాతం), మిత్ర అదిపెర్కాసా (19.2 శాతం) వాటాలను దక్కించుకోనుంది. ప్రభుదాస్ లీలాధర్ ప్రకారం బీకే ఇండోనేషియాను కొనుగోలు చేయడం ద్వారా బర్గర్ కింగ్ ఇండియా నాలుగో అత్యధిక జనాభా కలిగిన దేశంలోకి ప్రవేశిస్తోంది. ఇది ఇండోనేషియాలో రెండో అతిపెద్ద QSR బ్రాండ్‌గా అవతరించింది. ఇది అనేక సినర్జీలను అందిస్తోంది. బర్గర్ కింగ్ టార్గెట్ మిల్లీనియల్స్ పైన ఉంది. అంటే 30 ఏళ్ల లోపు ఉన్న 60 శాతం మందిని టార్గెట్ చేస్తోంది.
బర్గర్ కింగ్ ఇండియా బ్రేక్ ఫాస్ట్ మెనూను, బీకే కేఫ్‌ను 2021 క్యాలెండర్ ఏడాది చివరి త్రైమాసికానికి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. మాల్స్ కంటే అధిక మార్జిన్ అందించే పూర్తి సర్వీస్ డ్రైవ్ పైన దృష్టి సారించింది. బర్గర్ కింగ్ వృద్ధికి అన్ని అవకాశాలు ఉన్నాయని, రూ.250 టార్గెట్ ధరలో మార్పులేదని ప్రభుదాస్ లీలాధర్ బ్రోకరింగ్ సంస్థ తెలిపింది.

సీమెన్స్ లిమిటెడ్ టార్గెట్ ధర
మరో బ్రోకింగ్ కంపెనీ ఆజ్‌కోన్ గ్లోబల్ మరో సంస్థ సీమెన్స్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయవచ్చునని సజెస్ట్ చేస్తోంది. సీమెన్స్ ఇండియా 18 శాతం రిటర్న్స్ ఇవ్వవచ్చునని పేర్కొంది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ.2,274 వద్ద ఉంది. ఈ స్టాక్ రూ.2300 పైకి చేరుకుంటుందని అంచనా వేస్తోంది. సీమెన్స్ ఇండియా దశాబ్దాలుగా భారత్‌లో ఇండస్ట్రీ, ఎనర్జీ, హెల్త్ కేర్ రంగాల్లో ఆవిష్కరణలు, ఎనెబుల్డ్ సొల్యూషన్స్‌తో దూసుకెళ్తోంది.
సీమెన్స్ ఇండియా స్టాక్ దూసుకెళ్తుందని చెప్పడానికి పలు నిదర్శనాలు ఉన్నాయి. బలమైన పేరెంటేజ్ - సీమెన్స్ ఏజీ, నవతరానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సరిపడేలా బిజినెస్ మోడల్, డిజిటల్ ఇండస్ట్రీస్, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొబిలిటీ స్పేస్‌లో మంచి స్థానం, డిజిటల్ టెక్నాలజీ (సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సహా)కి డిమాండ్ పెరగడం, ఎలక్ట్రిక్ వెహికిల్ ఇండస్ట్రీ, ఎలక్ట్రిక్ వెహికిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఓలాతో భాగస్వామ్యం వంటి అంశాలు కలిసి వస్తాయి.

స్టాక్స్ పెట్టుబడి రిస్క్
స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న అంశం. పై స్టాక్స్‌ను ప్రభుదాస్ లీలాధర్, అజ్‌కోన్ గ్లోబల్ సజెస్ట్ చేశాయి. ఆయా స్టాక్స్ చరిత్ర, త్రైమాసిక ఫలితాలు, డీల్స్ వంటి వాటి ఆధారంగా బ్రోకరింగ్ సంస్థలు సజెస్ట్ చేస్తాయి. అయితే స్టాక్స్, ఫండ్స్ పెట్టుబడి రిస్క్. కాబట్టి నిపుణుల సలహాలు, ఆయా స్టాక్స్ గురించి పూర్తి అవగాహనతో ఇన్వెస్ట్ చేయడం మంచిది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications