కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో చాలా వరకు స్టాక్స్ భారీ నష్టాలను చవిచూశాయి. ఆ తర్వాత క్రమంగా కోలుకొని, ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వచ్చాయి. రిలయన్స్ వంటి షేర్లు దాదాపు రెండింతల కంటే ఎక్కువగా పెరిగింది. గత ఏడాది కాలంలో కొన్ని షేర్లు భారీ రిటర్న్స్ ఇచ్చినవి ఎన్నో ఉన్నాయి. గత ఏడాది మందగమనం, ఈ ఏడాది కరోనా కారణంగా వివిధ కంపెనీల షేర్లు మందగించాయి. కొన్ని షేర్లు మాత్రం ఆయా ఇన్వెస్టర్లకు భారీ రిటర్న్స్ ఇచ్చాయి. అందులో అదానీ గ్రీన్ ఎనర్జీ ఉంది.

741 శాతం పెరిగిన షేర్ ధర
గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రీన్ ఎనర్జీ గత ఏడాది నుండి ఏకంగా 741 శాతం పెరిగింది. ఈ కంపెనీ సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(SECI) నుండి మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ సోలార్ కాంట్రాక్ట్‌ను పొందింది. ఈ ట్రాన్సాక్షన్ వ్యాల్యూ రూ.45,000 కోట్లుగా (6 బిలియన్ డాలర్లు) ఉంది. ఈ మేరకు జూన్ 8వ తేదీన ఈ ఒప్పందం కుదిరింది. అప్పటి నుండి అయితే ఈ షేర్ ధర 24 శాతానికి పైగా ఎగిసి రూ.375 వద్ద ఉంది.

రూ.29 నుండి రూ.375కి ఎదిగిన షేర్
అదానీ గ్రీన్ ఎనర్జీ జూన్ 2018లో లిస్టింగ్ అయింది. ఈ స్టాక్ వ్యాల్యూ ప్రారంభంలో రూ.29 వద్ద ఉంది. ఇప్పుడు రూ.375కు పైగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్టం రూ.486.75 కాగా, 52 వారాల కనిష్టం రూ.42.50. అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.57,947 కోట్లుగా ఉంది. రూ.2,500 కోట్లు సమీకరించేందుకు షేర్ హోల్డర్స్ అప్రూవల్ కూడా పొందినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అంతేకాదు, వేగవంతమైన వ్యాపార వృద్ధికి, వ్యాపార విస్తరణ వంటి వాటి కోసం, అవసరమైతే అదనపు వనరులు సమకూర్చేందుకు కూడా వాటాదారుల ఆమోదం లభించింది.

సోలార్ పవర్ ప్రాజెక్టులు
ఏప్రిల్ నెలలో ఫ్రెంచ్ ఎనర్జీ మేజర్ టోటల్ ఎస్ఏ రూ.3,707 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, టోటల్ ఎస్ఏ భాగస్వామ్యంలో దేశంలోని 11 రాష్ట్రాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నారు. మార్చి 31తో ముగిసిన క్వార్టర్‌కు కంపెనీ రూ.692.67 కోట్ల కన్సాలిడేటెడ్ సేల్స్ నమోదు చేసింది. అంతకుముందు క్వార్టర్ రూ.501 కోట్లతో పోలిస్తే 38.14 శాతం పెరిగింది. అదే సమయంలో అంతకుముందు ఏడాది అదే క్వార్టర్ సేల్‌తో పోలిస్తే 1.72 శాతం పెరిగింది. తాజా క్వార్టర్ ఫలితాల్లో ట్యాక్స్ తర్వాత నెట్ ప్రాఫిట్ రూ.64 కోట్లుగా ఉంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications