2022 ప్రారంభంలో ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారికి అదిరిపోయే రిటర్న్స్!
డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లు ఇటీవల పరుగులు పెడుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం కాస్త శాంతించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లు, దానికి అనుగుణంగా దేశీయ మార్కెట్లు ఆల్ టైమ్ గరిష్టం దిశగా సాగుతున్నాయి. సెన్సెక్స్ నేడు కీలకమైన 60,000 మార్కును దాటింది. ఓ సమయంలో 1500 పాయింట్లు కూడా ఎగిసి, 61,000ను సమీపించింది. ఆ తర్వాత కాస్త క్షీణించినప్పటికీ, 1100 పాయింట్లకు పైగా లాభాల్లోనే ఉంది. ఈ క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు కొన్ని పెన్నీ స్టాక్స్ 725% వరకు రిటర్న్స్ ఇచ్చాయి.

పెన్నీ స్టాక్స్ అదుర్స్
దాదాపు 20 స్టాక్స్ ఈ ఏడాది 725 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. ఇవి కాకుండా మరో 30 స్టాక్స్ 70 శాతం నుండి 700 శాతం మధ్య రిటర్న్స్ ఇచ్చాయి. అదే సమయంలో 2022 క్యాలెండర్ ఏడాదిలో మాత్రం సెన్సెక్స్, నిఫ్టీలు క్షీణించాయి. ఇటీవల వరుసగా లాభాల్లో ఉండటం, నేడు ఒక్కరోజే 1000 పాయింట్లకు పైగా ఎగిసిపడటంతో తాజాగా పాజిటివ్‌గా ఉన్నాయి. నేటి దూకుడును పరిగణలోకి తీసుకోకుంటే సూచీలు జనవరి 1, 2022తో నష్టాల్లోనే ఉన్నాయి. కానీ పెన్నీ స్టాక్స్ మాత్రం అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చాయి.

ఇవి 700 శాతం రిటర్న్స్
ఓ డేటా ప్రకారం 2022 క్యాలెండర్ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటి వరకు అత్యధిక రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్‌లో టైన్ ఆగ్రో లిమిటెడ్ ముందు ఉన్నాది. ఇది ఏకంగా 700 శాతం రిటర్న్స్ ఇచ్చింది. టైన్ ఆగ్రో షేర్ ధర డిసెంబర్ 31, 2021న రూ.6.80గా ఉంది. జనవరి 3, 2022న రూ.7.14 వద్ద ఉంది. కానీ ఇప్పుడు రూ.26 వద్ద ఉంది. ఓ సమయంలో రూ.61ని దాటింది. కానీ గత నెల రోజులుగా ఇది తగ్గింది. ఆ తర్వాత కైజర్ కార్పోరేషన్ లిమిటెడ్ కూడా దాదాపు 700 శాతం వృద్ధి నమోదు చేసింది. జనవరి 3న రూ.2.92 వద్ద ఉన్న ఈ స్టాక్ ఇప్పుడు రూ.57 వద్ద ఉంది.

ఈ స్టాక్స్
2022 క్యాలెండర్ ఏడాదిలో మంచి రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్‌లో టైన్ ఆగ్రో, కైజర్ కార్పోరేషన్, బీఎల్ఎస్ ఇన్ఫోటెక్, ఖూబ్‌సూరత్, కిరన్ సింటెక్స్, హేమాంగ్ రిసోర్సెస్, ఎంపీఎస్ ఇన్ఫోటెక్నిక్స్, ఎలిజాంట్ ఫ్లోరికల్చర్ అండ్ ఆగ్రోటెక్, స్విస్ మిలిటరీ కన్స్యూమర్ గూడ్స్, కార్పోరేట్ కొరియర్ అండ్ కార్గో, త్రివేణి గ్లాస్, ట్రాన్ వే టెక్నాలజీస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ సర్వీసెస్, నిక్కీ గ్లోబల్ ఫైనాన్స్, బయోజీన్ ఫార్మాకెమ్ ఇండస్ట్రీస్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్, రీజెన్సీ ట్రస్ట్, మాక్రో ఇంటర్నేషనల్, మదుసూదన్ సెక్యూరిటీస్, లుహారుకా మీడియా అండ్ ఇన్ఫ్రా వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications