స్టాక్ మార్కెట్లు వరుసగా మూడు రోజుల పాటు నష్టాల్లో ముగిశాయి. గతవారం 60,000 పాయింట్లను దాటి చరిత్ర సృష్టించిన సెన్సెక్స్, ఈ వారం 59,000 స్థాయికి పడిపోయింది. ఈ మూడు సెషన్‌లలో 900 పాయింట్లకు పైగా క్షీణించింది. ఈ కాలంలో దిగ్గజ స్టాక్స్ కూడా నష్టపోయాయి. అంతర్జాతీయ పరిణామాలకు తోడు గతవారం భారీ లాభాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా సూచీలు ఈ వారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు సెషన్లలో మూడు సెషన్లు భారీగా నష్టపోయిన మార్కెట్లు, ప్రారంభ సెషన్‌లో మాత్రం స్థిరంగా ముగిశాయి. దీంతో రేపు మార్కెట్లు కాస్త సానుకూలంగా ముగిసే అవకాశాలు లేకపోలేదు. అయితే ఈ వారం మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ... చాలా స్టాక్స్ నష్టపోయినప్పటికీ, కొన్ని మాత్రం లాభాల్లో ఉన్నాయి. అందులోనూ కొన్ని కంపెనీలు దాదాపు పది శాతం అంతకంటే పైగా లాభపడ్డాయి.

భారీ నష్టాల్లో.. ఈ స్టాక్స్ జంప్
పది శాతం అంతకంటే ఎక్కువగా లాభపడిన స్టాక్స్‌లో ఫేజ్ థ్రీ ఆటో ఫ్యాబ్ 14.45 శాతం, ఆర్ఎంసీ స్విచ్ గేర్స్ 13.31 శాతం, వెల్‌స్పన్ కార్ప్ 12.64 శాతం, షీతల్ కూల్ 12.59 శాతం స్పెన్సర్స్ రిటైల్ లిమిటెడ్ 12.42 శాతం, జేఎంసీ ప్రాజెక్ట్స్ 12.11 శాతం, ఆక్రో ఇండియా 11.63 శాతం, ఆర్టీఎస్ పవర్ 11.42 శాతం, ఐవోబీ 11.22 శాతం, పటేల్ ఇంజినీర్స్ 10.93 శాతం లాభపడ్డాయి. 30 షేర్ సెన్సెక్స్ 286.91 పాయింట్లు నష్టపోయి 59126.36 పాయింట్ల వద్ద ముగిసింది. 50 షేర్ నిఫ్టీ ఇండెక్స్ 93.15 పాయింట్లు క్షీణించి 17618.15 పాయింట్ల వద్ద ముగిసింది.

అందుకే నష్టాలు
సిస్టెమాటిక్స్ సెక్, ఆర్ఎంసీ స్విచ్ గేర్స్, షీతల్ కూల్, స్పెన్సర్స్ రిటైల్ లిమిటెడ్, త్రివేణి టర్బైన్ స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి. నాప్ బుక్స్ లిమిటెడ్, సుపిరియర్ ఫిన్ లీజ్, అరిహంత్ టార్న్, నెక్సస్ కమోడిటీస్, హీమో ఆర్గానిక్ 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. స్టాక్ మార్కెట్ వరుస నష్టాలకు పలు కారణాలు ఉన్నాయి. చైనా ఎవర్ గ్రాండ్ సంక్షోభం ముగుస్తుండటం మార్కెట్లకు సానుకూల పరిణామం అయినప్పటికీ, యూఎస్ డిఫాల్ట్, టెన్ ఇయర్ బాండ్ యీల్డ్స్, అంతర్జాతీ మార్కెట్ నష్టాలు మన సూచీలపై ప్రభావం చూపాయి.

ఇవి కూడా జంప్
2021లో స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఈ క్యాలెండర్ ఏడాదిలో పలు స్టాక్స్ 50 శాతం వరకు లాభాలను కూడా ఇచ్చాయి. కొన్ని రెండింతలు, మూడింతలు లాభపడ్డాయి. ఎఫ్ఎం హెవీ స్టాక్స్‌లో ఎస్ ఈక్విటీ డేటా, కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ 32. శాతం లాభాలను అందించాయి. ఇవి కన్‌స్ట్రక్షన్ అండ్ ఇంజినీరింగ్ కంపెనీలు. జూన్ 30 నాటికి ఎంఎఫ్స్ వాటా 26.52 శాతం కలిగిన పీఎన్‌సీ ఇన్ఫ్రాటెక్ 101 శాతం లాభపడింది. ఈక్విటాస్ హోల్డింగ్స్ (ఇందులో ఎంఎఫ్స్ వాటా 29.78 శాతం) 80 శాతం లాభ పడింది.
More From GoodReturns

ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలో చెప్పే మ్యాజిక్ ఫార్ములా ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications