ఇప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మొదటి ఉద్యోగంలో అడుగు పెడితే అది జీవితంలో ఒక కొత్త ఛాప్టర్ లాంటిది. జీతం రావడం, స్వంతంగా ఖర్చులు చేసుకోవడం, భవిష్యత్తు గురించి ప్లాన్ చేయడం ఇవి అన్నీ ఉత్సాహకరంగానే ఉంటాయి. కానీ అదే సమయంలో చాలా మందికి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ప్రారంభించాలో అర్థం కాక గందరగోళం వస్తుంది. మొదటిసారి డబ్బు సంపాదిస్తున్నప్పుడు స్మార్ట్‌గా అలవాట్లు పెంచుకుంటే, తర్వాతి రోజుల్లో పెద్ద ఫైనాన్షియల్ టెన్షన్ లేకుండా సౌకర్యంగా ముందుకు సాగవచ్చు.
కానీ చిన్న చిన్న స్మార్ట్ ప్లానింగ్ చేస్తే, భవిష్యత్తులో మీ ఫైనాన్స్ పక్కాగా సెట్ అవుతుంది. ఇక్కడ ఈ సింపుల్ టిప్స్ ప్రతి యంగ్ ఎర్నర్ తప్పనిసరిగా తెలుసుకోవాలి.

1. కెరీర్ ప్రారంభంలో ఆదాయం, ఖర్చులు రెగ్యులర్‌గా మారుతుంటాయి. కాబట్టి బడ్జెట్‌ని స్ట్రిక్ట్‌గా కాకుండా ఫ్లెక్సిబుల్‌గా ఉంచండి. అవసరాలు, లైఫ్ స్టైల్ ఖర్చులు, చిన్న ఎమర్జెన్సీ ఫండ్ కవర్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పర్ఫెక్ట్ కాకపోయినా పర్లేదు, క్రమంగా ఆర్థిక డిసిప్లిన్ వస్తుంది.
2. హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. మొదట మీ బేసిక్ ఫౌండేషన్ సెక్యూర్ చేసుకోవాలి. అందులో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైనది. మీ ఆఫీస్ ఇన్సూరెన్స్ సరిపోకపోతే, అదనంగా తీసుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం ఫ్యామిలీలో ఫైనాన్షియల్‌గా మీ మీదే ఆధారపడి ఉన్నవాళ్లు ఉన్నప్పుడు మాత్రమే అవసరం. టాక్స్ సేవింగ్ కోసమే కొనడం తప్పు.
3. ఇల్లు కొనటం వంటివి ప్రారంభ దశలో చాలా భారమవుతాయి. ఆదాయం మారినప్పుడు అలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ నుండి బయటకు రావడం కష్టం. అందుకే ఈ దశలో లిక్విడిటీ, ఫ్లెక్సిబిలిటీ ఉన్న ఆప్షన్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది. మీరు ఎప్పుడైనా మార్పు చేసుకోగలిగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి.
4. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ELSS (ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్) మంచి ఆప్షన్. ఇది సెక్షన్ 80C కింద టాక్స్ డిడక్షన్ ఇస్తుంది, అలాగే లాంగ్-టర్మ్ గ్రోత్ కూడా ఇస్తుంది. ముఖ్యంగా, లాక్-ఇన్ పీరియడ్ కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉండటంతో, సంప్రదాయ టాక్స్ సేవింగ్ ఆప్షన్స్ కంటే ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది.
5. యంగ్ ఎర్నర్స్ కి బెస్ట్ సలహా ఫైనాన్స్‌ని సింపుల్‌గా, క్లియర్‌గా ఉంచండి. మ్యూచువల్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్ లాంటి ఆప్షన్స్ మీకు లాంగ్-టర్మ్ గ్రోత్ ఇస్తాయి. అవసరం లేని లోన్లు తీసుకోవద్దు. మీ ఫైనాన్షియల్ గోల్స్ క్లియర్‌గా పెట్టుకోండి, సమయానికి రివ్యూ చేస్తూ ముందుకు వెళ్ళండి. ఆదాయం పెరిగే కొద్దీ, మీ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ కూడా గ్రాడ్యువల్‌గా పెరుగుతుంది.
6. చిన్నలావాదేవీల కోసం ఉదాహరణకు ట్రావెల్, కొత్త గాడ్జెట్స్ లేదా కారు వంటి ఖర్చుల కోసం ప్రత్యేక ఫండ్స్ ఉంచండి. అదే సమయంలో, రిటైర్మెంట్, ఇంటి కొనుగోలు వంటి పెద్ద లక్ష్యాలకు వేరుగా ఫండ్స్ పెట్టడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే, చిన్న ఖర్చుల కోసం మీ లాంగ్-టర్మ్ సేవింగ్స్ లో దిగి పోవడం నుంచి రక్షించవచ్చు.
7. మీ కెరీర్ వృద్ధి కోసం స్కిల్స్ పెంపొందించడం చాలా ముఖ్యమే. ఆన్‌లైన్ కోర్సులు, సర్టిఫికేషన్లు, వర్క్ షాప్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు, నైపుణ్యాలు మెరుగుపరుస్తారు. మొదట ఇది వెంటనే డబ్బు రాబడిని ఇవ్వకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మీ ఆదాయం పెరుగుతుంది.
8. క్రెడిట్ కార్డు హై-ఇంటరెస్ట్ డెబ్ట్ లేదా ఫ్రెండ్స్, ఫ్యామిలీ నుండి తీసుకునే లోన్స్ విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్త ఉండాలి. ఏ డెబ్ట్ గుడ్ డెబ్ట్, ఏది బ్యాడ్ డెబ్ట్ అనేది గుర్తించడం ముఖ్యం. గుడ్ డెబ్ట్ అంటే మీ ఫైనాన్స్‌ను బలోపేతం చేసే లోన్, బ్యాడ్ డెబ్ట్ అంటే ఎక్కువ ఇంటరెస్ట్ తో మీ మీద బరువు పడుతుంది.
9. మీ ఖర్చులు ఎక్కడ వెళ్ళుతున్నాయో తెలుసుకోవడానికి apps లేదా స్ప్రెడ్‌షీట్‌లు ఉపయోగించండి. ప్రతి నెల లేదా మూడు నెలలకు ఒకసారి మీ బడ్జెట్, ఇన్వెస్ట్‌మెంట్స్ రివ్యూ చేసి అవసరమైతే సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్లండి.
మొత్తంగా చెప్పాలంటే, యంగ్ ఎర్నర్స్ కి ఈ ఐదు టిప్స్ లైఫ్ చేంజింగ్ అవుతాయి. ఫ్లెక్సిబుల్ బడ్జెట్, హెల్త్ ఇన్సూరెన్స్, స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్, ELSS, మరియు కెరీర్‌తో పాటు గ్రోత్ ప్లాన్ ఇవన్నీ మీ ఆర్థిక పరిస్థితులను అదుపులో ఉంచుతాయి.


Click it and Unblock the Notifications