FY22 ట్యాక్స్ సేవింగ్స్ పెట్టుబడుల కోసం సమయం మరెంతో లేదు. మార్చి 31, 2022 వరకు మాత్రమే గడువు ఉంది. ట్యాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం మీకు మరో పదిహేను రోజుల గడువు మాత్రమే ఉంది. మీ ఆర్థిక లక్ష్యాలను పరిగణించి, ఇన్వెస్ట్ చేయాలి. రిస్క్ విముఖత కలిగిన పెట్టుబడిదారులు ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్‌ను పరిశీలించవచ్చు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గాయి. అయితే కొన్ని బ్యాంకులు ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. 6.5 శాతం వడ్డీని అందించే చిన్న ప్రయివేటు బ్యాంకులు ఉన్నాయి.

రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. తద్వారా పన్ను మినహాయింపుని పొందవచ్చు. ట్యాక్స్ సేవింగ్స్ సాధనాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ కోసం అయిదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో 6.5 శాతం వడ్డీ రేటును అందించే వివిధ బ్యాంకులు చూద్దాం...

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేటు
- ఇండస్ఇండ్ బ్యాంకు ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్స్ పైన 6.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ప్రయివేటు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ పైన అత్యధిక వడ్డీ రేటును అందిస్తోన్న బ్యాంకు ఇదే. రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అయిదేళ్లలో ఇది రూ.2.07 లక్షలు అవుతుంది.
- ఆర్బీఎల్ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.3 శాతంగా ఉంది. రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అయిదేళ్లలో రూ.2.05 లక్షలు అవుతుంది.
- ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు, యస్ బ్యాంకులు 6.25 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అయిదేళ్లలో రూ.2.05 లక్షలు అవుతుంది.
- డీసీబీ బ్యాంకు వడ్డీ రేటు 5.95 శాతం అందిస్తోంది. రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అయిదేళ్లలో రూ.2.02 లక్షలు అవుతుంది.
- కరూర్ వైశ్య బ్యాంకులో ట్యాక్స్ సేవింగ్స్ డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 5.90 శాతంగా ఉంది. రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అయిదేళ్లలో రూ.2.01 లక్షలు అవుతుంది.

రూ.5 లక్షల వరకు హామీ
చిన్న బ్యాంకులు కొత్త డిపాజిట్లను ఆకర్షించేందుకు అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. డిపాజిట్ ఇన్సురెన్స్ గ్యారెంటీ కార్పోరేషన్ (DICGC) కింద రూ.5 లక్షల వరకు గ్యారెంటీ ఉంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications