ఇది వరకు క్రెడిట్ కార్డ్స్ అంటే కేవలం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే! ఎక్కడైనా ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేస్తే, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరపడం వరకే ఎక్కువగా పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ పైన అదిరిపోయే ఆఫర్లు, క్యాష్ బ్యాక్, ఎక్స్‌క్లూజివ్ డిస్కౌంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా లగ్జరీ స్టైల్ ఉత్పత్తులపై మంచి ఆఫర్లు ఉంటాయి. సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డ్స్ ట్రావెలింగ్, డైనింగ్, షాపింగ్ పైన ఎక్స్‌క్లూజివ్ బెనిఫిట్స్ అందిస్తున్నాయి.
అలాగే రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. అయితే ఈ లగ్జరీ క్రెడిట్ కార్డ్ యాన్యువల్ ఫీజు అధికంగా ఉంటుంది. మార్కెట్‌లో వివిధ రకాల క్రెడిట్ కార్డ్స్ అందుబాటులో ఉన్నాయి. సూపర్ ప్రీమియం బెనిఫిట్స్ కలిగిన బెస్ట్ కార్డును తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ రీసెర్చ్‌లో వెల్లడైన మార్కెట్ బెస్ట్ సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డ్స్‌ను చూద్దాం.

HDFC డైనర్స్ క్లబ్ బ్లాక్ క్రెడిట్ కార్డ్
HDFC డైనర్స్ క్లబ్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ యాన్యువల్ మెంబర్‌షిప్ రూ.10,000. వార్షిక సభ్యత్వంపై క్లబ్ మారియోట్, ఫోర్బ్స్, అమెజాన్ ప్రైమ్, జొమాటో ప్రో, టైమ్స్ ప్రైమ్ వంటి వాటిని ఆఫర్ చేస్తోంది. నెలకు రూ.80,000 ఖర్చు పైన ఓలా సెలక్ట్, కల్ట్ డాట్ ఫిట్ లైవ్, బుక్ మై షో, టాటా క్లిక్ వోచర్స్‌ను ఆఫర్ చేస్తోంది. భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా అన్-లిమిటెడ్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉంది. ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ పైన 1.99 శాతం ఫీజు ఉంటుంది.

SBI ఆరమ్ క్రెడిట్ కార్డ్
ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సభ్యత్వంతో అమెజాన్ ప్రైమ్, జొమాటో ప్రో, లెన్స్‌కార్ట్ గోల్డ్, డిస్కవర్ ప్లస్, ఈజీ డైనర్ ప్రైమ్ తదితరాల ఉచిత మెంబర్‌షిప్ ఆఫర్ ఉంది. జాయినింగ్ బెనిఫిట్‌గా 40,000 రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ప్రతి నెల నాలుగు మూవీ టిక్కెట్స్ లభిస్తాయి. ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ పైన 1.99 శాతం ఛార్జీ వర్తిస్తుంది. ఇంటర్నేషనల్ విమానాశ్రయాల్లో అన్-లిమిటెడ్ లాంజ్ యాక్సెస్ ఉంది. ఈ కార్డు వార్షిక ఫీజు రూ.10,000.

HDFC బ్యాంకు ఇన్‌ఫినియా క్రెడిట్ కార్డ్
HDFC బ్యాంకు ఇన్‌ఫినియా క్రెడిట్ కార్డ్ మెటల్ ఎడిషన్ వార్షిక ఫీజు రూ.12,500. ఈ కార్డును తీసుకుంటే కాంప్లిమెంటరీ ఆఫర్ కింద ఏడాది పాటు క్లబ్ మారియట్ మెంబర్‌షిప్ ఉంది. ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ పైన 2 శాతం ఫీజు ఉంది. దేశీయంగా, అంతర్జాతీయంగా అన్-లిమిటెడ్ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉంది.

మరిన్ని కార్డ్స్...
- సిటీ ప్రెస్టీజ్ క్రెడిట్ కార్డు యాన్యువల్ ఫీజు రూ.20,000. తాజ్ గ్రూప్ లేదా ఐటీసీ హోటల్స్‌పై ప్రతి సంవత్సరం రూ.10,000 బెనిఫిట్స్ ఉన్నాయి.
- యాక్సిస్ బ్యాంకు రిజర్వ్ క్రెడిట్ కార్డు
ఒబెరాయ్ హోటల్స్, రిసార్ట్స్ నుండి యాక్సిస్ బ్యాంకు రిజర్వ్ క్రెడిట్ కార్డు ద్వారా ఎక్స్‌క్లూజివ్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ కార్డు యాన్యువల్ ఫీజు రూ.50,000.


Click it and Unblock the Notifications