For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే 20% రిటర్న్స్, దాదాపు రూ.1000 పెరగొచ్చు!!

|

భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం అస్థిరంగా ఉన్నాయి. మార్కెట్లు ఆల్ టైమ్ గరిష్టానికి సమీపంలో ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఫార్మా స్టాక్స్ దుమ్ము రేపుతున్నాయి. ఇలాంటి సమయంలో మీ పోర్ట్‌పోలియోలో ఫార్మా స్టాక్స్ ఉండటం సముచితమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఫార్మా స్టాక్స్‌లో డాక్టర్ రెడ్డీస్ వంటివి ఉన్నాయి. అయితే ఇటీవల ఈ కంపెనీ తన క్వార్టర్ ఫలితాలను ప్రకటించిన తర్వాత స్టాక్స్ క్షీణించాయి. ఈ కాలంలో డాక్టర్ రెడ్డీస్ స్టాక్ దాదాపు రూ.800 వరకు క్షీణించింది.

డాక్టర్ రెడ్డీస్ బైకాల్

డాక్టర్ రెడ్డీస్ బైకాల్

ప్రముఖ బ్రోకరేజీ ఫర్మ్ ఎంకే గ్లోబల్ ఇటీవల డాక్టర్ రెడ్డీస్ స్టాక్ 'బై కాల్' చేసింది. ప్రస్తుత ధరతో 120 రెట్లు అధిక టార్గెట్ ఇచ్చింది. డాక్టర్ రెడ్డీస్ స్టాక్ ప్రస్తుతం రూ.4700 స్థాయి దిగువనే ఉంది. నేడు రూ.4669 వద్ద ముగిసింది. ఎంకే గ్లోబల్ మార్కెట్ టార్గెట్ ధరను రూ.5,755గా పేర్కొంది. ప్రస్తుత త్రైమాసికం రెండో త్రైమాసికం నుండి తమ కంపెనీ మంచి రిటర్న్స్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ రెడ్డీస్ అంచనా వేస్తోంది. వివిధ రకాల ఖర్చులు పెరిగినప్పటికీ, బ్రాండెడ్ మార్కెట్లలో పెరిగిన పెట్టుబడి అధిక వృద్ధికి అవకాశం ఉందని బ్రోకరేజీ సంస్థ చెబుతోంది.

మంచి రిటర్న్స్

మంచి రిటర్న్స్

డాక్టర్ రెడ్డీస్ అమెరికా మార్కెట్ పైన ఆశాజనకంగా ఉంది. దీనికి తోడు భారత్‌లో వ్యాపారం స్థిరంగా కొనసాగుతోంది. భారత ఫార్మా మార్కెట్ ప్రస్తుతం సానుకూలంగా ఉంది. యూరప్‌లో వృద్ధిని నమోదు చేస్తోందని భావిస్తున్నారు. ఈ స్టాక్ ఏడాది కాలంగా మంచి రిటర్న్స్ అందిస్తోంది.

నిపుణుల సలహాలతో పెట్టుబడి

నిపుణుల సలహాలతో పెట్టుబడి

తమ టార్గెట్ ధర రూ.5755గా పేర్కొంటూ, స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చునని ఎంకే గ్లోబల్ చెబుతోంది. అంటే దాదాపు ఇరవై శాతం అధికం. త్రైమాసికం ఫలితాల అనంతరం ఈ వారం డాక్టర్ రెడ్డీ స్టాక్స్ పది శాతానికి పైగా పడిపోయాయి. ఇదిలా ఉండగా, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. వ్యాసం ఆధారంగా పెట్టుబడి సరికాదు. నిపుణుల సలహాలతో పెట్టుబడులు పెట్టాలి.

English summary

ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే 20% రిటర్న్స్, దాదాపు రూ.1000 పెరగొచ్చు!! | These Pharma stock may give 20 percent returns

Indian markets continue to be volatile, through the course of the week, even as the US Federal Reserve did not indicate any timeline for tapering.
Story first published: Thursday, July 29, 2021, 18:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X