ఈ NBFC, క్లాత్ స్టాక్, బర్గర్ కింగ్ స్టాక్ కొనుగోలు చేస్తే అదిరిపోయే రిటర్న్స్!

ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ రీసెర్చ్ పలు స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్, టీసీఎన్ఎస్ క్లాతింగ్ వంటి స్టాక్స్ ర్యాలీ చేస్తాయని భావిస్తోంది. ఈ స్టాక్స్ ఏడాది కాలంలో 68 శాతం వరకు రిటర్న్స్ ఇచ్చే అవకాశముందని, అలాగే, మంచి డివిడెండ్ రావొచ్చునని సూచిస్తోంది. ఆయా కంపెనీల పనితీరు, త్రైమాసిక ఫలితాలు, చరిత్ర ఆధారంగా ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు వివిధ కంపెనీల స్టాక్స్ కొనుగోలును సూచిస్తుంటాయి.

అయితే స్టాక్స్, ఫండ్స్‌లలో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. కాబట్టి రేటింగ్ సంస్థలు, కథనాల ఆధారంగా మాత్రమే కాకుండా, ఆయా స్టాక్స్ పైన పూర్తి అవగాహన, మార్కెట్ పరిస్థితిని తెలుసుకొని కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు బాగా కనిపిస్తున్న స్టాక్ అనుకొని పరిస్థితుల్లో రేపు కుప్పకూలవచ్చు. కాబట్టి స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్‌తో కూడుకున్నదని గుర్తించాలి.

పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్

పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్

పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ స్టాక్ ధర ప్రస్తుతం రూ.129 వద్ద ఉంది. ఈ స్టాక్ ఏడాది కాలంలో 68 శాతానికి పైగా ఎగిసి రూ.220కి చేరుకోవచ్చునని ఎంకే గ్లోబల్ అంచనా వేస్తోంది. నిన్న ఈ స్టాక్ రూ.131 వద్ద ఉండగా, నేడు 2 శాతం కంటే పైగా క్షీణించి రూ.129 వద్ద ఉంది. ఎంకే గ్లోబల్ ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.220కి పెంచింది. ఈ బ్రోకరేజీ సంస్థ ప్రకారం అసెట్ క్వాలిటీ ట్రెండ్ ప్రోత్సాహకరంగా ఉంది.

మొత్తం స్టేజ్ 3 అసెట్స్... రూ.211.5 బిలియన్‌తో 26 ప్రాజెక్టులు, రూ.158.2 బిలియన్లతో ర16 ప్రాజెక్టులు ఇప్పటికే ఎన్సీఎల్టీ కింద 69 శాతం ప్రొవిజన్స్ కవరేజీతో ఆమోదించబడ్డాయి. ఎన్సీఎల్టీ వెలుపల రూ.53.3 బిలియన్ డాలర్లతో పది ప్రాజెక్టులు 54 శాతంతో ఉన్నాయి. గత త్రైమాసికంలో ఓవరాల్ కవరేజీ 63 శాతం నుండి 65 శాతానికి పెరిగింది.

కంపెనీ అసెట్ క్వాలిటీ ట్రెండ్, అట్రాక్టివ్ రిస్క్ రివార్డ్‌ను మెరుగుపరుస్తున్నందున ఈ కంపెనీ స్టాక్ టార్గెట్‌ను పెంచుతున్నట్లు బ్రోకరేజీ సంస్థ వెల్లడించింది. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ స్టాక్ టార్గెట్ ధరను గతంలో రూ.215 నుండి ఇప్పుడు రూ.220కి పెంచింది. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ స్టాక్ 7 శాతం కంటే ఎక్కువ డివిడెండ్ ఇస్తున్నట్లు తెలిపింది.

- ప్రస్తుత మార్కెట్ ధర - రూ.130

- టార్గెట్ ధర - రూ.220

- లాభం - 68%

TCNS క్లాతింగ్ సెంటర్

TCNS క్లాతింగ్ సెంటర్

TCNS క్లాతింగ్ సెంటర్ స్టాక్ ప్రస్తుత ధర రూ.562 వద్ద ఉంది. క్రితం సెషన్లో ఈ స్టాక్ రూ.568 వద్ద ఉండగా, నేడు 0.76 శాతం మేర నష్టపోయింది. దీంతో రూ.572 వద్ద ఉంది. ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.860కి పెంచింది ఎంకే గ్లోబల్ రీసెర్చ్. వచ్చే ఏడాది కాలంలో 51 శాతం లాభపడుతుందని అంచనా వేస్తోంది. FY22 మొదటి త్రైమాసికంలో రెవెన్యూ రికవరీ 35 శాతం పెరిగిందని, గత ఏడాదితో పోలిస్తే ఈ రంగంలోని ఇతర సంస్థల కంటే మంచి వృద్ధి కనబరిచింది.

ఆన్‌లైన్, ఇతర ఛానల్స్ ద్వారా ఈ సంస్థ వృద్ధి 112 శాతంతో ఆరోగ్యకరంగా ఉంది. మొదటి త్రైమాసికంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా స్టోర్స్ మూసి ఉండటం, ఆ తర్వాత స్టోర్స్ తెరిచినప్పటికీ కరోనా ఆంక్షలు వంటి అంశాలు రికవరీ పైన ప్రభావం చూపాయని తెలిపింది. అయితే TCNS క్లాతింగ్ 70 శాతం రికవరీతో కనిపిస్తోందని చెబుతున్నారు.

- కరెంట్ మార్కెట్ ధర - రూ.568

- టార్గెట్ ధర - రూ.860

- లాభం - 51%

బర్గర్ కింగ్

బర్గర్ కింగ్

మరో బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్.... బర్గర్ కింగ్ స్టాక్‌ను రిఫర్ చేస్తోంది. ఈ స్టాక్ 25 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. ప్రస్తుతం కింగ్ స్టాక్ ధర రూ.167 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే దాదాపు ఒక శాతం క్షీణించింది. ఈ స్టాక్ టార్గెట్ ధరను 210కి పెంచింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఉన్నప్పటికీ బర్గర్ కింగ్ 1QFY22లో మంచి ప్రదర్శన కనబరిచిందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది.

జూలై-ఆగస్ట్ కాలంలో మరింత ప్రోత్సాహకరంగా కనిపిస్తోందని పేర్కొంది. వివిధ రాష్ట్రాలు మాల్స్, రెస్టారెంట్స్ తెరుచుకోవడానికి అవకాశం ఇచ్చాయి. బర్గర్ కింగ్ ఇటీవల ప్రారంభించిన స్టన్నర్ మెనూకు మంచి రెస్పాన్స్ వస్తోంది. బర్గర్ కింగ్ ఇండియా బుల్లిష్‌గా కనిపిస్తోందని, మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది.

1QFY22లో బర్గర్ కింగ్ డౌన్ లోడ్స్ 1 మిలియన్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఆర్డర్స్‌లో మూడోవంతు బర్గర్ కింగ్ యాప్ నుండి నమోదవుతున్నాయి. మూడో త్రైమాసికంలో టెస్ట్ మార్కెటింగ్‌లో భాగంగా కొన్ని కేఫ్స్ ఓపెన్ చేస్తోంది. అలాగే, త్రైమాసిక ఫలితాలు బాగున్నాయి. ఇవన్నీ కూడా ఈ స్టాక్ టార్గెట్ ధరను పెంచడానికి దోహదపడ్డాయి.

రిస్క్‌తో కూడుకున్నది...

రిస్క్‌తో కూడుకున్నది...

ఈ సమాచారం మోతీలాల్ ఓస్వాల్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీ ఆధారంగా ఇచ్చింది. అయినప్పటికీ స్టాక్స్, ఫండ్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. గత ఏడాది మార్చి నెలలో కరోనా కారణంగా సూచీలు దారుణంగా పతనమయ్యాయి. ఆ తర్వాత క్రమంగా కోలుకున్నాయి. స్టాక్స్ పైన జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు కంపెనీ చరిత్ర, త్రైమాసిక ఫలితాలు సహా ఎన్నో అంశాలు ప్రభావం చేస్తాయి. కాబట్టి స్టాక్స్, ఫండ్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+