ప్రతి నెల కొన్ని అంశాలు వ్యక్తులను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా బ్యాంకులకు సంబంధించిన అంశాలు చాలా ప్రధానమైనవి. ప్రతి కొత్త ఆర్థిక సంవత్సరం, కొత్త క్యాలెండర్ ఏడాదిలో ఎక్కువగా మార్పులు ఉంటాయి. అయితే అప్పుడప్పుడు ప్రతి నెలలోను మార్పులు సహజం. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 1వ తేదీ నుండి మారనున్న కొన్ని మార్పులు తెలుసుకుందాం...

అందుబాటులోకి NACH
నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(NACH) ఆగస్ట్ 1వ తేదీ నుండి ప్రతి రోజు అందుబాటులో ఉండనుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) దాదాపు రెండు నెలల క్రితం తెలిపింది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్, వడ్డీ రేటు, డివిడెండ్,ఇతర పేమెంట్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి భారీ చెల్లింపులు నిర్వహించేదే NACH. ఇది ఆగస్ట్ 1 నుండి అన్ని రోజులు అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం ఇది బ్యాంకింగ్ వర్కింగ్ డేస్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జీలు
ఏటీఎం నుండి పరిమితికి మించి ట్రాన్సాక్షన్స్ చేసేవారికి ఆగస్ట్ నుండి షాక్. ఏటీఎం నగదు ఉపసంహరణ పరిమితిని పెంచుతున్నారు. ఆయా బ్యాంకుకు చెందిన ఏటీఎం నుండి నగదును ఉపసంహరించుకుంటే పరిమిత ట్రాన్సాక్షన్స్ ఉచితం. ఆ తర్వాత మాత్రం ఛార్జీ వసూలు చేస్తారు. ఈ ఛార్జీని పెంచుతున్నారు. అంటే నిర్ణీత ఉచిత ట్రాన్సాక్షన్స్‌కు మించి చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీని పెంచుతున్నాయి బ్యాంకులు. ఈ మేరకు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత పరిమితికి మించి చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌కు కస్టమర్ నుండి రూ.21 వసూలు చేయనున్నాయి బ్యాంకులు. ఈ మేరకు బ్యాంకులకు అనుమతిస్తూ ఆర్బీఐ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాదారులు, ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎం నుండి ప్రతి నెల 5 ఉచిత ఆర్థిక, ఆర్థికేతర ట్రాన్సాక్షన్స్‌ను నిర్వహించవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి మెట్రో నగరాల్లో అయితే మూడు, నాన్ మెట్రో నగరాల్లో అయితే ఐదు ఉచిత ట్రాన్సాక్షన్స్ వరకు పరిమితి ఉంది. ఇవి మించితే ప్రస్తుతం ఒక్కో ట్రాన్సాక్షన్ పైన రూ.20 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు దీనిని రూ.21కి పెంచారు. బ్యాంకులకు రూ.1 పెంచేందుకు ఆర్బీఐ అనుమతించింది.

ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్స్
హోమ్ బ్యాంకు ఏటీఎం నుండి ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఐదు. ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద నగరాన్ని బట్టి మారుతుంది. మెట్రో నగరాల విషయంలో ఇతర బ్యాంకుల ఏటీఎం నగదు ట్రాన్సాక్షన్స్ 3, నాన్-మెట్రోల్లో 5గా ఉండనుంది.

లోన్, ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లలో మార్పు
కరోనా మహమ్మారి నేపథ్యంలో వచ్చే నెలలో జరగనున్న ద్రవ్య పరపతి సమావేశంలో వడ్డీ మార్పులు చర్చనీయాంశమే. అయితే వడ్డీ రేట్లలో మార్పు ఉండకపోవచ్చు.

ICICI కొత్త రూల్స్, చెక్కుబుక్కులు
ఐసీఐసీఐ బ్యాంకు డొమెస్టిక్ సేవింగ్స్ అకౌంట్స్ హోల్డర్లకు క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఏటీఎం ఇంటర్‌చేంజ్, చెక్ బుక్ ఛార్జీలను ఆగస్ట్ 1వ తేదీ నుండి మారనున్నాయి. బ్యాంకు వెబ్ సైట్ ప్రకారం ఐసీఐసీఐ ఖాతాదారులకు ఆరు మెట్రో నగరాల్లో మొదటి మూడు ట్రాన్సాక్షన్స్ అంటే ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సేవలు ఉచితం.

ఎల్పీజీ సిలిండర్ ధర
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను చమురురంగ సంస్థలు ప్రతి నెల సవరిస్తాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ధరల్లో మార్పు ఉంటుంది.

15సీఏ/15సీబీ ఫామ్స్ గడువు
సీబీడీటీ 15సీఏ/15సీబీ ఫామ్స్ ఫైలింగ్ చేసే వారికి ఊరట. ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌లో మరింత సడలింపులు చేసింది. మ్యాన్యువల్ ఫైలింగ్ తేదీని పొడిగించింది. కొత్త పోర్టల్‌లో సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాబట్టి ఈ గడువును ఆగస్ట్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు సీబీడీటీ తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications