ఈ క్రిప్టోలు 2 గంటల్లో 500 శాతం లాభాలను అందించాయి
గ్లోబల్ క్రిప్టో కరెన్సీ ఇటీవల ర్యాలీ చేస్తోంది. కాయిన్ మార్కెట్ క్యాప్ డేటా ప్రకారం వివిధ క్రిప్టో కరెన్సీలు భారీగా వృద్ధిని నమోదు చేస్తున్నాయి. నిన్నటికి గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.18 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది 0.84 శాతం అధికం. 24 గంటల్లోనే మార్కెట్ క్యాప్ 99.11 శాతం ఎగిసిపడింది. క్రిప్టో కరెన్సీలు భారీగా వృద్ధిని నమోదు చేస్తున్నప్పటికీ, కొన్ని క్రిప్టోలు మాత్రం మరింతగా అదరగొడుతున్నాయి. ఇటీవల కొన్ని క్రిప్టోలు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. అందులో డోజీకాయిన్, షిబా ఇను ఉన్నాయి.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన పెట్ డాగ్ గరించి ట్వీట్ చేసిన అనంతరం అదే పేరుకు దగ్గరగా ఉన్న షిబా ఇను ఒక్కసారిగా ఎగబాకింది. ఇక్కడ ప్రధానంగా ఎలాన్ మస్క్ ట్వీట్ ఉపయోగపడింది. అందుకే ఈ క్రిప్టో ఎగిసిపడింది. ఇక, మరో క్రిప్టో డోజీకాయిన్ తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. అయితే డోజీకాయిన్ ఆల్ టైమ్ గరిష్టంతో ఇప్పటికీ 3.01 శాతం తక్కువతో ఉంది. గతవారం రోజుల్లో మాత్రం దాదాపు రెండు శాతం లాభపడింది. ఇక షిబా ఇను అయితే ఏకంగా 21 శాతం జంప్ చేసింది. మరిన్ని క్రిప్టో కరెన్సీల వృద్ధి ఇటీవల 200 శాతం నుండి దాదాపు 500 శాతం వరకు పెరిగాయి.

24 గంటల్లో అత్యధికంగా లాభపడిన క్రిప్టోలు...
1) Gravitoken - $0.00114 - 499.25 శాతం జంప్
2) Around Network - $990.82 - 350.14 శాతం జంప్
3) Biconomy Exchange Token - $0.00003486 - 276.14 శాతం జంప్
4) Greenex - $0.03983 - 274.86 శాతం జంప్
5) Bridge Oracle - $0.0008047 - 186.49 శాతం జంప్
క్రిప్టో కరెన్సీ కింగ్ బిట్ కాయిన్ ఇటీవల పైకీ, కిందకు కదులుతోంది. బిట్ కాయిన్ మార్కెట్ వాటా దాదాపు 42 శాతంగా ఉంది. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడి, గత నెల రోజులుగా 40వేల డాలర్ల పైన కనిపిస్తోంది. ఇటీవల మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనమైంది. 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలోనే 44,000 డాలర్లకు పడిపోయింది. ఇప్పుడు 48వేల డాలర్ల పైన ఉంది.
టాప్ 10 క్రిప్టోలు
- Bitcoin BTC - $48,519.23 - 1.60 శాతం జంప్
- Ethereum ETH - $3,508.47 - 0.10 శాతం డౌన్
- Cardano ADA - $2.40 - 0.02 శాతం డౌన్
- Binance Coin BNB - $416.76 - 0.35 శాతం డౌన్
- Tether USDT - $0.9998 - 0.02 శాతం డౌన్
- XRP - $1.09 - $0.16 శాతం జంప్
- Solana SOL - $159.21 - $13.62 శాతం జంప్
- Polkadot DOT - $34.76 - 1.78 శాతం డౌన్
- Dogecoin - $0.2438 - $2.55 శాతం డౌన్


Click it and Unblock the Notifications