న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్ నాన్ గెజిటెడ్ మెడికల్ ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం వారికి తీపి కబురు అందిస్తోంది. ఉద్యోగుల వేతనాన్ని రూ.5,000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంలోని రైల్వేస్ నాన్ గెజిటెడ్ మెడికల్ ఎంప్లాయీస్‌కు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ మేరకు వారికి ప్రమోషన్‌ను రైల్వే బోర్డు అప్రూవ్ చేసింది. ప్రమోషన్ తర్వాత 8 కేటగిరీల్లోని నాన్ గెజిటెడ్ మెడికల్ ఉద్యోగుల వేతనం కనీసం రూ.5వేలు పెరుగుతుంది.

వేతనంతో పాటు వీటిలో పెరుగుదల
స్టాఫ్ నర్సు, ఫార్మాసిస్ట్, రేడియో గ్రాఫర్, ల్యాబ్ స్టాఫ్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్‌పెక్టర్, ఫిజియోథెరఫిస్ట్, డైటీషియన్, ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వంటి 8 కేటగిరీల్లోని నాన్ గెజిటెడ్ మెడికల్ ఉద్యోగుల వేతనం పెరగనుంది. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్ కారణంగా హెచ్ఆర్ఏ, టీఏ, డీఏ కూడా పెరగనుంది.

ఆ తర్వాతే ప్రమోషన్ పైన నిర్ణయం
జోనల్ రైల్వేస్, సంబంధిత విభాగాలతో సంప్రదింపుల అనంతరం నాన్ గెజిటెడ్ కేటగిరీలోని ఉద్యోగుల ప్రమోషన్ పైన నిర్ణయం తీసుకున్నామని రైల్వే బోర్డు తెలిపింది. అయితే మెడికల్ ల్యాబోరేటరీ కేటగిరీలో కేడర్ స్ట్రక్చర్ రివ్యూ ఇంకా ఫైనలైజ్ కాలేదని తెలిపింది. ఇది పూర్తయ్యాక వీరికి కూడా ఏవీసీ (అవెన్యూ ఆఫ్ ప్రమోషన్) వర్తిస్తుందని పేర్కొంది.

ఉద్యోగుల లెవల్ పెరిగి..
ప్రమోషన్ అనంతరం ఉద్యోగులు ఓ స్థాయి పైకి చేరుకుంటారు. ఉద్యోగి లెవల్ వన్ నుంచి లెవల్ టూకు లేదా లెవల్ టూ నుంచి లెవల్ త్రీకి.. ఇలా పైకి చేరుకుంటారు. అప్పుడు సదరు ఉద్యోగి కనీస వంతనం ఐదువేల రూపాయలు పెరుగుతుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications