డెట్ కేటగిరీ ఇన్వెస్టర్లలో, ప్రత్యేకించి దీర్ఘకాలంలో మూలధనం రిస్క్‌కు దూరంగా ఉండే సీనియర్ సిటిజన్లు, అలాగే DICGC అందించే డిపాజిట్ భద్రత హామీతో పాటు స్థిరమైన, సెక్యూరిటీ ఆదాయ మార్గం కోరుకునే వారు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్స్ వైపు మొగ్గు చూపుతారు. సీనియర్ సిటిజన్ ఇన్వెస్ట్‌మెంట్‌గా ఫిక్స్డ్ డిపాజిట్‌కు పెట్టింది పేరు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) 2020 ప్రారంభంలోనే వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ఏడాది కాలంగా ఇవే వడ్డీ రేట్లు కొనసాగుతున్నాయి. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా తగ్గాయి.
ఆర్బీఐ రెపో రేటు, రివర్స్ రెపో రేటు తగ్గించడంతో బ్యాంకులు FD వడ్డీ రేట్లను కాస్త తగ్గించాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను ప్రభుత్వరంగ దిగ్గజం SBI, ప్రయివేటు రంగ దిగ్గజాలు HDFC, ICICI, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివి సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక స్కీంలను ప్రవేశ పెట్టాయి. వడ్డీ రేట్లు తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బ్యాంకులు అయిదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలపరిమతిపై ఎక్కువ వడ్డీ రేటు అందిస్తున్న బ్యాంకులు...

ఎస్బీఐ వికేర్ సీనియర్ సిటిజన్ టర్మ్ డిపాజిట్ స్కీం
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీకేర్ సీనియర్ సిటిజన్ టర్మ్ డిపాజిట్ స్కీంను తీసుకు వచ్చింది. అయిదేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితికి ఈ స్కీం వర్తిస్తుంది. సాధారణ వడ్డీ రేటు కంటే 50 బేసిస్ పాయింట్లు, సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల కంటే 30 బేసిస్ పాయింట్లు అధికంగా ఇస్తోంది. మొత్తంగా సాధారణ వడ్డీ రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు ఎక్కువగా అందిస్తోంది. వడ్డీ రేటును నెలవారీ, త్రైమాసికం వారీగా చెల్లిస్తుంది.
- 7 days to 45 days 3.4 శాతం వడ్డీ రేటు,
- 46 days to 179 days 4.4 శాతం వడ్డీ రేటు,
- 180 days to 210 days 4.9 శాతం వడ్డీ రేటు,
- 211 days to less than 1 year 4.9 శాతం వడ్డీ రేటు,
- 1 year to less than 2 year 5.5 శాతం వడ్డీ రేటు,
- 2 years to less than 3 years 5.6 శాతం వడ్డీ రేటు,
- 3 years to less than 5 years 5.8 శాతం వడ్డీ రేటు,
- 5 years and up to 10 years 6.2 శాతం వడ్డీ రేటు

HDFC బ్యాంకు సీనియర్ సిటిజన్ కేర్ FD
అయిదు సంవత్సరాల ఒకరోజు నుండి పదేళ్ల కాలపరిమితిపై రూ.2 కోట్ల లోపు సీనియర్ సిటిజన్ల కోసం HDFC బ్యాంకు సీనియర్ సిటిజన్ కేర్ FDని తీసుకు వచ్చింది. ఈ స్పెషల్ డిపాజిట్ స్కీం 18 మే 2020లో ప్రారంభమైంది. 30 సెప్టెంబర్ 21 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ స్కీంలో అదనంగా 0.25 శాతం వడ్డీ రేటు వస్తుంది.
నాన్-రెసిడెంట్ ఇండియన్స్ ఈ స్కీంకు అర్హులు కాదు. ఈ పథకం అయిదు సంవత్సరాల కంటే ముందే లేదా కాలపరిమితికి ముందే ముగిస్తే వడ్డీ రేటు కాంట్రాక్ట్ లేదా డిపాజిట్ చేసిన కాలానికి వర్తించే బేస్ రేటు కంటే 1 శాతం తక్కువగా వస్తుంది. HDFC సీనియర్ సిటిజన్ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి...
- 7 - 14 days 3.00 శాతం వడ్డీ రేటు,
- 15 - 29 days 3.00 శాతం వడ్డీ రేటు,
- 30 - 45 days 3.50 శాతం వడ్డీ రేటు,
- 46 - 60 days 3.50 శాతం వడ్డీ రేటు,
- 61 - 90 days 3.50 శాతం వడ్డీ రేటు,
- 91 days - 6 months 4.00 శాతం వడ్డీ రేటు,
- 6 months 1 day - 9 months 4.90 శాతం వడ్డీ రేటు,
- 9 months 1 day to less than 1 Year 4.90 శాతం వడ్డీ రేటు,
- 1 Year 5.40% 1 year 1 day - 2 years 5.40 శాతం వడ్డీ రేటు,
- 2 years 1 day - 3 years 5.65 శాతం వడ్డీ రేటు,
- 3 year 1 day- 5 years 5.80 శాతం వడ్డీ రేటు,
- 5 years 1 day - 10 years 6.25 శాతం వడ్డీ రేటు.

ICICI బ్యాంకు గోల్డెన్ ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్
సీనియర్ సిటిజన్ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం కింద అయిదేళ్ల ఒకరోజు నుండి పది సంవత్సరాల వరకు 0.30 శాతం అదనపు వడ్డీ రేటును అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం అక్టోబర్ 7, 2021న ప్రారంభమైంది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్ పైన వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ స్కీం నుండి ముందే ఉపసంహరించుకుంటే పెనాల్టీ వడ్డీ రేటు 1.30 శాతంగా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంకు సీనియర్ సిటిజన్ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి...
- 7 days - 14 days 3.00%,
- 15 days - 29 days 3.00%,
- 30 days - 45 days 3.50%,
- 46 days - 60 days 3.50%,
- 61 days - 90 days 3.50%,
- 91 days - 120 days 4.00%,
- 121 days - 150 days 4.00%,
- 151 days - 184 days 4.00%,
- 185 days - 210 days 4.90%,
- 211 days - 270 days 4.90%,
- 271 days - 289 days 4.90%,
- 290 days - less than 1 year 4.90%,
- 1 year - 389 days 5.40%,
- 390 days - < 18 months 5.40% 18 months to 2 years 5.50%,
- 2 years 1 day - 3 years 5.65%,
- 3 years 1 day - 5 years 5.85%,
- 5 years 1 day - 10 years 6.30%,
- 5 Years (80C FD) - Max - Rs 1.50 lac 5.85%.

బ్యాంక్ ఆఫ్ బరోడా
రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ పైన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక వడ్డీ రేటును అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి...
- 7 days to 14 days 3.30%,
- 15 days to 45 days 3.30%,
- 46 days to 90 days 4.20%,
- 91 days to 180 days 4.20%,
- 181 days to 270 days 4.80%,
- 271 days & above and less than 1 year 4.90%,
- 1 year 5.40% Above 1 year to 400 days 5.50%,
- Above 400 days and upto 2 Years 5.50%,
- Above 2 Years and upto 3 Years 5.60%,
- Above 3 Years and upto 5 Years 5.75%,
- Above 5 Years and upto 10 Years 6.25%.
More From GoodReturns

Personal Loan: శాలరీ స్లిప్ లేదా? అయినా సరే మీకు లోన్ వస్తుంది.. ఇలా ట్రై చేయండి!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications