సేవింగ్స్ ఖాతాలో ఇన్వెస్ట్‌మెంట్ అనేది తక్కువ రిస్క్ కలిగి ఉంటుంది. పెట్టుబడులపై పెద్దగా అవగాహనలేని వారికి, స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యంతో ఉన్నవారికి ఇది మొదటి అడుగుగా చెప్పవచ్చు. డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్(DICGC) ద్వారా రూ.5 లక్షల హామీ ఉంటుంది. డిపాజిట్ భద్రత, వడ్డీ ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ వంటి ఇతర ఉత్పత్తులపై అందించే వాటి కంటే సేవింగ్స్ అకౌంట్ ఇచ్చే వడ్డీ రేట్లు గణనీయంగా తక్కువగా ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. అయితే స్వల్పకాలిక లక్ష్యానికి ఇది ప్రయోజనకరం.
ఈ నేపథ్యంలో SBI, HDFC, యాక్సిస్ బ్యాంకు, ICICI బ్యాంకు, ఇతర పబ్లిక్, ప్రయివేటు దిగ్గజ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన అందించే వడ్డీ రేట్లతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ అందించే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులను ఇక్కడ చూద్దాం.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ మినిమం మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.5000. సేవింగ్స్ అకౌంట్ తీసుకున్న కస్టమర్లు రూపే క్లాసిక్ డెబిట్ కార్డును పొందుతారు. ఈ కార్డుతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ పైన ప్రస్తుతం ఈ కింది వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు మార్చి 6, 2021 నుండి అమలులోకి వచ్చాయి. సేవింగ్స్ అకౌంట్‌లో డే-ఎండ్-బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ రేటును లెక్కిస్తారు. ఈ మొత్తాన్ని త్రైమాసికం ఆధారంగా చెల్లిస్తారు.
వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి....
- రూ.1 లక్ష వరకు 4.00% వడ్డీ రేటు,
- రూ.1 లక్ష నుండి రూ.25 లక్షల వరకు 7.00% వడ్డీ రేటు,
- రూ.25 లక్షల నుండి రూ.10 కోట్ల వరకు 6.00% వడ్డీ రేటు,
- రూ.10 కోట్లు ఆ పైన 6.75% వడ్డీ రేటు.

AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా పైన వడ్డీ రేటు ఆకర్షణీయంగా ఉంది. దిగువ సూచించిన సేవింగ్స్ ఖాతా పైన వడ్డీ ప్రతిరోజు నిర్ణయిస్తారు. ప్రతి నెల చివరలో నెలవారీగా చెల్లిస్తారు.
- రూ.1 లక్ష వరకు 3.50% వడ్డీ రేటు,
- రూ.1 లక్ష నుండి రూ.10 లక్షల వరకు 5.00% వడ్డీ రేటు,
- రూ.10 లక్షల నుండి రూ.25 లక్షల వరకు 6.00% వడ్డీ రేటు,
- రూ.25 లక్షల నుండి రూ.2 కోట్ల వరకు 7.00% వడ్డీ రేటు,
- రూ.2 కోట్ల నుండి రూ.10 కోట్ల వరకు వడ్డీ రేటు 6.00% వడ్డీ రేటు.

ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు కొత్త వడ్డీ రేట్లు జూలై 1, 2021 నుండి అమలులోకి వచ్చాయి. వడ్డీ రేటు ఇలా ఉంది.
- రూ.1 లక్ష వరకు 4.50% వడ్డీ రేటు,
- రూ.1 లక్ష నుండి రూ.5 లక్షల వరకు 6.00% వడ్డీ రేటు,
- రూ.5 లక్షల నుండి రూ.1 కోటి వరకు 7.00% వడ్డీ రేటు,
- రూ.1 కోటి నుండి 2 కోట్ల వరకు 6.00% వడ్డీ రేటు,
- రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల వరకు 5.75% వడ్డీ రేటు,
- రూ.5 కోట్ల నుండి రూ.15 కోట్ల వరకు 4.50% వడ్డీ రేటు,
- రూ.15 కోట్ల నుండి రూ.20 కోట్ల వరకు 4.00% వడ్డీ రేటు,
- రూ.20 నుండి రూ.30 కోట్ల వరకు 3.25% వడ్డీ రేటు,
- రూ.30 కోట్ల నుండి రూ.50 కోట్ల వరకు 3.00% వడ్డీ రేటు,
- రూ.50 కోట్ల వరకు 3.00% వడ్డీ రేటు.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో మెట్రో/అర్బన్ ప్రాంతాల్లో కనీస నగదు నిల్వ రూ.5,000. ఏ ఏటీఎం నుండి అయినా ఉచిత అన్-లిమిటెడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ బ్యాంకులో వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
- రూ.1 లక్ష వరకు 5.00% వడ్డీ రేటు,
- ఇంక్రిమెంటల్ బ్యాలెన్స్ రూ.1 లక్ష నుండి రూ.25 లక్షలు 6.00% వడ్డీ రేటు,
- ఇంక్రిమెంటల్ బ్యాలెన్స్ రూ.25 లక్షల నుండి రూ.10 కోట్లు 7.00% వడ్డీ రేటు,
- ఇంక్రిమెంటల్ బ్యాలెన్స్ రూ.10 కోట్లు 6.75% వడ్డీ రేటు.

బ్యాంకుల్లో..
వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ పైన వడ్డీ రేటు ఇలా ఉన్నాయి.
- HDFC బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు 3.50%,
- ICICI బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు 3.5% - 4.00%,
- Axis బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు 3.50%,
- కొటక్ మహీంద్రా బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు 4.00% - 6.00%,
- Yes బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు 5.00% - 6.25%,
- బంధన్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు 4.00% - 7.00%,
- లక్ష్మీవిలాస్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు 3.50% - 6.50%,
- ఇండస్ఇండ్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు 4.00% - 6.00%,
- RBL బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు 5.00% - 6.75%.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications