For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేట్లు ఇచ్చే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

|

వివిధ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్స్ పైన మంచి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. సేవింగ్స్ అకౌంట్స్ పైన ఏడు శాతం వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకులు ఉన్నాయి. ఈ అకౌంట్ పైన డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్(DICGC) రూ.5 లక్షల బీమా హామీ ఇస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్‌తో పోలిస్తే సేవింగ్స్ పైన వడ్డీ రేటు తక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే సేవింగ్స్ ఖాతా పైన ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే ప్రస్తుతం అధిక వడ్డీ రేట్లు అందిస్తున్న చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఉన్నాయి. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఐదు చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఇక్కడ చూడండి...

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సేవింగ్స్ ఖాతా పైన 7 శాతం వరకు వడ్డీ రేటు అందిస్తోంది. ఇక్కడ నిస్సందేహంగా ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే ఎక్కు వడ్డీ రేటు ఉంటుంది. కస్టమర్లకు గరిమా సేవింగ్స్ అకౌంట్, రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్, ప్రివిలేజ్ సేవింగ్స్ అకౌంట్, మైనర్ సేవింగ్స్ అకౌంట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్, డిజిటల్ సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ వడ్డీ రేట్లు 6వ తేదీ మార్చి 2021 నుండి ఇలా ఉన్నాయి.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రూ.1 లక్ష వరకు వడ్డీ రేటు 4 శాతం,

రూ.1 లక్ష నుండి రూ.25 లక్షల వరకు వడ్డీ రేటు 7 శాతం,

రూ.10 కోట్ల వరకు వడ్డీ రేటు 6 శాతం వర్తిస్తుంది.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులోను వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. వివిధ రకాల కస్టమర్ల కోసం స్టాండర్డ్ సేవింగ్స్ అకౌంట్, ప్రీమియం సేవింగ్స్ అకౌంట్, జియో-నెక్స్ సేవింగ్స్ అకౌంట్, శాలరీ అకౌంట్, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్ వంటి సేవింగ్స్ ఖాతాలను అందిస్తోంది. జూలై 1వ తేదీ నుండి అమలులో ఉన్న దేశీయ సేవింగ్స్ అకౌంట్స్ పైన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రూ.1 లక్ష వరకు వడ్డీ రేటు 5 శాతం,

రూ.1 లక్ష నుండి రూ.25 లక్షల వరకు వడ్డీ రేటు 6 శాతం,

రూ.25 లక్షల నుండి రూ.10 కోట్ల వరకు వడ్డీ రేటు 7 శాతం వర్తిస్తుంది.

రూ.10 కోట్లకు పైన రూ.6.7 శాతం వర్తిస్తుంది.

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

ఈవా సేవింగ్స్ అకౌంట్, ఈవా ఎలైట్ సేవింగ్స్ అకౌంట్, వింగ్స్ సేవింగ్స్ అకౌంట్, రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్, సెల్ఫీ సేవింగ్స్ అకౌంట్, ఎలైట్, మై సేవింగ్స్ అకౌంట్, బేసిక్ అండ్ స్మాల్ సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయి. 16 ఆగస్ట్ 2021 నుండి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రూ.1 లక్ష వరకు వడ్డీ రేటు 3.50 శాతం,

రూ.1 లక్ష నుండి రూ.1 కోట్ల వరకు వడ్డీ రేటు 7 శాతం,

రూ.1 కోటికి పైన మొత్తంపై 6 శాతం వర్తిస్తుంది.

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఏటీఎం నుండి రూ.2 లక్షల వరకు ఉపసంహరించుకోవచ్చు. నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, పేపర్‌లెస్ అకౌంట్ ద్వారా ఉచిత ఉపసంహరణ ఉంటుంది. ప్రియారిటీ అకౌంట్, ప్రైమ్ సేవింగ్స్ అకంట్, ప్రియారిటీ ప్లస్ అకౌంట్, ప్రో ప్రియారిటీ సేవింగ్స్ అకౌంట్, 101 ఫస్ట్, 101 ప్రియారిటీ, బీఎస్‌బీడీఏ అకౌంట్, శక్తి అకౌంట్, స్మార్ట్ సేవర్ అకౌంట్స్ అందిస్తోంది.

స్మాల్ సేవింగ్స్ అకౌంట్ స్లాబ్ వడ్డీ రేట్లు

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రూ.1 లక్ష వరకు వడ్డీ రేటు 4.50 శాతం,

రూ.1 లక్ష నుండి రూ.5 లక్షల కోట్ల వరకు వడ్డీ రేటు 6 శాతం,

రూ.5 లక్షల నుండి రూ.1 కోటి వరకు మొత్తంపై 7 శాతం,

రూ.1 కోటి నుండి రూ.2 కోట్ల మొత్తంపై వడ్డీ రేటు 6 శాతం,

రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మొత్తంపై వడ్డీ రేటు 5.75 శాతం,

రూ.5 కోట్ల నుండి రూ.15 కోట్ల మొత్తంపై వడ్డీ రేటు 4.50 శాతం,

రూ.15 కోట్ల నుండి రూ.20 కోట్ల మొత్తంపై వడ్డీ రేటు 4.00 శాతం,

రూ.20 కోట్ల నుండి రూ.30 కోట్ల మొత్తంపై వడ్డీ రేటు 3.25 శాతం,

రూ.30 కోట్ల నుండి రూ.50 కోట్ల మొత్తంపై వడ్డీ రేటు 3.00 శాతం,

రూ.50 కోట్లకు పైన వడ్డీ రేటు 3.00 శాతంగా ఉంది.

English summary

బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేట్లు ఇచ్చే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు | These Banks Offering Higher Returns Up To 7 percent On Savings Accounts

Apart from interest-bearing investments when it comes to higher liquidity, safety of funds, auto sweep facility for additional interest, timely payments of debts, convenient fund transfers, deposits, and withdrawals, a savings account is the only one that you must have as a beginner investor or an investor going to make his first step towards personal finance.
Story first published: Sunday, August 29, 2021, 17:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X