For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీటిలో SBI, HDFC బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేట్లు, కానీ ఒకేచోట వద్దు!!

|

గ్యారెంటీ రాబడి కలిగిన పెట్టుబడికి ఫిక్స్డ్ డిపాజిట్స్(FD) ప్రసిద్ధి చెందినవి. హామీ రాబడితో పాటు, తక్కువ రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్స్‌స్ట్రుమెంట్ కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్స్‌‍కు సీనియర్ సిటిజన్స్‌తో పాటు రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిటర్స్ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్స్‌ను ఎంచుకునే ముందు వివిధ బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లను సరిపోల్చుకోవాలి. పెట్టుబడిదారులు తమ డబ్బును అత్యధిక వడ్డీ రేటు వచ్చే బ్యాంకులో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), HDFC, ICICI బ్యాంకు, ఇతర రుణగ్రహీతలు అందించే వడ్డీ రేట్లు ఇటీవల తగ్గుతున్నాయి. అయితే ఇందుకు విరుద్ధంగా కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రుణగ్రహీతలకు ఎక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఇది ఇతర బ్యాంకులతో పోలిస్తే వారికి లాభదాయకమే. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 6.75 శాతం నుండి వడ్డీ రేటును అందిస్తున్నాయి.

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో వడ్డీ రేట్లు 3.25 శాతం నుండి 6.75 శాతం మధ్య ఉన్నాయి. ఏడు రోజుల నుండి పదేళ్ల కాలపరిమితికి ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది.

These banks offering higher interest than SBI, ICICI, HDFC Bank on fixed deposits

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో వడ్డీ రేటు 3 శాతం నుండి 7 శాతం వరకు ఉంది. ఏడు రోజుల నుండి పదేళ్ల కాలపరిమితికి ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో వడ్డీ రేటు 2.5 శాతం నుండి 6.75 శాతం వరకు ఉంది. ఏడు రోజుల నుండి పదేళ్ల కాలపరిమితికి ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో వడ్డీ రేటు 3 శాతం నుండి 6.75 శాతం వరకు ఉంది. ఏడు రోజుల నుండి పదేళ్ల కాలపరిమితికి ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది.

SBI బ్యాంకులో వడ్డీ రేటు 2.9 శాతం నుండి 5.4 శాతం వరకు ఉంది. ఏడు రోజుల నుండి పదేళ్ల కాలపరిమితికి ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది.

HDFC బ్యాంకులో వడ్డీ రేటు 2.50 శాతం నుండి 5.50 శాతం వరకు ఉంది. ఏడు రోజుల నుండి పదేళ్ల కాలపరిమితికి ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది.

ICICI బ్యాంకులో వడ్డీ రేటు 2.5 శాతం నుండి 5.50 శాతం వరకు ఉంది. ఏడు రోజుల నుండి పదేళ్ల కాలపరిమితికి ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది.

ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి ముందు పలు అంశాలను గుర్తు పెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో, కొన్ని బ్యాంకుల్లో పెట్టుబడులు రిస్క్‌గా ఉండవచ్చు. అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అది ప్రమాదంతో ముడివడి ఉంటుందనే అంశం దృష్టిలో పెట్టుకోవాలి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో FD పెట్టుబడి పెట్టినప్పటికీ, DICGC డిపాజిట్ ఇన్సురెన్స్ రూ.5 లక్షల వరకు ఉంటుంది కాబట్టి, అక్కడికే పరిమితం కావాలని నిపుణుల సూచన.

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టడంలో రిస్క్ ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో బ్యాంకు డిపాజిట్స్ పైన రూ.5 లక్షలకు మించి ఉంచకపోవడం మంచిదని చెబుతున్నారు. మీరు రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే నాలుగు వేర్వేరు బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అప్పుడు మీ మొత్తం, వడ్డీ సురక్షితంగా ఉంటుంది.

English summary

వీటిలో SBI, HDFC బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేట్లు, కానీ ఒకేచోట వద్దు!! | These banks offering higher interest than SBI, ICICI, HDFC Bank on fixed deposits

When it comes to investment with a guaranteed return, bank FDs continue to be popular investment products not just among senior citizens, who are looking for guaranteed income, but also among investors who are looking for low-risk investment tools.
Story first published: Monday, September 6, 2021, 20:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X