మనీ మేనేజ్‌మెంట్ అంత ఈజీ కాదు. అలాగే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ద్వారా మరింత మొత్తం సంపాదించడం కూడా కష్టమే. మనీ మేనేజ్‌మెంట్ కోసం పలు మార్గాలు ఉన్నాయి. అంటే వివిధ రూపాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆర్జించవచ్చు. కానీ ఎంపిక సరైనదిగా ఉండాలి. అలా రిస్క్ లేకుండా స్థిర రాబడి హామీని ఇవ్వాలని కోరుకునే వారికి ఫిక్స్డ్ డిపాజిట్ ఒక ఎంపిక. ఇతర పెట్టుబడుల మాదిరిగా ఫిక్స్డి డిపాజిట్లలో రిస్క్ జీరో. స్థిరమైన ఆదాయానికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కలిగిన ఆర్థిక అంతరాయాన్ని ఎదుర్కోవడానికి ఆర్బీఐ వడ్డీ రేటును 4 శాతానికి తగ్గించింది. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు కూడా తగ్గింది.

రిస్కుకు దూరంగా ఉండాలనుకుంటే
రిస్కుకు దూరంగా ఉండేవారు, పెన్షనర్లు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్ వైపు మొగ్గు చూపుతారు. బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించాయి. దీంతో పైవారిపై చాలా ప్రభావం పడింది. ఉద్యోగ విరమణ చేసిన చాలా మంది స్థిర ఆదాయం కోసం చేసిన ప్రణాళికలను మార్చుకోవాలసి వచ్చింది. అయితే కొన్ని ప్రయివేటు బ్యాంకులు మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్లపై దాదాపు 7 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. వాటిలో ఇన్వెస్ట్ చేస్తే, మిగతా బ్యాంకులతో పోలిస్తే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించవచ్చు.

ఆయా బ్యాంకుల వడ్డీ రేట్లు
యెస్ బ్యాంకు అత్యధిక ఫిక్స్డ్ డిపాజిట్ అత్యధిక వడ్డీ రేటు 6.50 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంకు వార్షిక వడ్డీ రేటు 6.50 శాతం, డీసీబీ బ్యాంకు వార్షిక వడ్డీ రేటు 6.70 శాతం, సూర్యోదయ బ్యాంకు వార్షిక వడ్డీ రేటు 6.75 శాతం, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వార్షిక వడ్డీ రేటు 7 శాతంగా ఉంది.

ఆ తర్వాతే పెట్టుబడి
ఆయా బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయాలకోవాలనుకునే వారు నేరుగా బ్యాంకును సంప్రదించి, షరతులు తెలుసుకున్న తర్వాతనే పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా, సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. పైన పేర్కొన్న ఈ బ్యాంకు వెబ్ సైట్‌లలో పేర్కొన్న వడ్డీ రేట్లను 2021 ఏప్రిల్ 30వ తేదీ వరకు పరిగణలోకి తీసుకున్నది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications