కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఈక్విటీ, పసిడి మార్కెట్‌లో తీవ్ర అస్థిరత నెలకొంది. సెన్సెక్స్ 2022 చివరి నాటికి 70,000 నుండి 80,000 పాయింట్లకు, నిఫ్టీ 22,000 పాయింట్లకు చేరుకోవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది అంచనా మాత్రమే. కరోనా పెరిగితే ఇది రివర్స్ కావొచ్చు. అదే సమయంలో ఏ స్టాక్, ఏ రంగం ఎప్పుడు పుంజుకుంటుందో అంతగా అర్థం కాని అంశం. మరోవైపు పసిడి మార్కెట్ భిన్నంగా ఉంటుంది.
డాలర్ మారకంతో రూపాయి పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్ అంశాలు ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఈ ధరలు కూడా అస్థిరంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి ఫిక్స్డ్ డిపాజిట్స్‌గా భావిస్తున్నారు.

ఈ బ్యాంకుల్లో వడ్డీ రేటు ఎక్కువ
ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే లిక్విడిటీ లభిస్తుంది. కాలానుగుణంగా వడ్డీ ఆదాయం తెలుస్తుంది. ప్రస్తుత మహమ్మారి కాలంలో అత్యవసర కార్పస్‌ను నిర్మించేందుకు పొదుపు అవసరం. కరోనా పరిస్థితుల్లో కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపోరేటును 4 శాతం కనిష్టానికి తగ్గించింది. దీంతో దాదాపు అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. ఇందులో భాగంగా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా తగ్గాయి. అయితే పలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, స్మాల్ ప్రయివేటు బ్యాంకులు మాత్రం 7 శాతం కంటే అధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. అలాంటి బ్యాంకులు కొన్ని కింద చూద్దాం...

ఇందులో 7 శాతం వడ్డీ
- సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో మూడేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఇది మాత్రమే తక్కువ. ఉదాహరణకు మీరు రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్లలో రూ.1.23 లక్షలు అవుతుంది. కనీస పెట్టుబడి మొత్తం రూ.1000.
- ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో మూడేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.5 శాతం. రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్లలో మీకు రూ.1.21 లక్షలు వస్తుంది. కనీస పెట్టుబడి మొత్తం రూ.1000.

ప్రయివేటు బ్యాంకులో ఇదే అత్యధికం
- ఆర్బీఎల్ బ్యాంకు మూడేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ పైన 6.30 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ప్రయివేటు బ్యాంకుల్లో అత్యధిక ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు ఇదే. మీరు రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్లలో రూ.1.21 లక్షలు అవుతుంది.
- యస్ బ్యాంకులో మూడేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.25 శాతంగా ఉంది. మీరు రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్లలో ఇది రూ.1.20 వేలు అవుతుంది. కనీస పెట్టుబడి రూ.10,000.
- ఇండస్ఇండ్ బ్యాంకు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు మూడేళ్ళ కాలానికి 6 శాతంగా ఉంది. రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్లలో ఇది రూ.1.19 లక్షలు అవుతుంది. కనీస పెట్టుబడి రూ.10,000.
- స్మాలర్ ప్రయివేటు బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిపాజిట్స్ పైన అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ (DICGC) కింద రూ.5 లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ పైన గ్యారెంటీ ఉంటుంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications