పెట్టుబడులకు సంబంధించి రిస్క్ తీసుకోవడం ఇష్టపడని వారు సురక్షిత పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అయిదేళ్ల పర్సనల్ ఫైనాన్షియల్ గోల్, సెక్షన్ 80సీ కింద పన్ను బెనిఫిట్స్ పొందే ప్రయోజనాలు ఉంటాయి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ELSS) కేవలం ట్యాక్స్ సేవింగ్ సాధనం అయినప్పటికీ, మీకు స్థిరమైన, అంచనాలకు తగిన ఆదాయం కావాలంటే మాత్రం ఈ ఎంపిక సరైనది కాదని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమంటే పన్ను ఆదా చేసే FDలు ముందస్తు ఉపసంహరణను అనుమతించవు.
అలాగే, అయిదు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌ను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిలో పెట్టుబడి ఎప్పుడు కూడా ELSS కంటే సురక్షితమైన ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇటీవల రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పన్ను ఆదా చేసే FDలపై అధిక రాబడిని ఇచ్చే టాప్ 5 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రయివేటు రంగ బ్యాంకులు, ప్రభుత్వరంగ బ్యాంకులు ఇక్కడ చూడవచ్చు. DICGC ద్వారా రూ.5 లక్షల డిపాజిట్ బీమా ప్రయోజనం కూడా ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ సురక్షిత పెట్టుబడులు

ట్యాక్స్ సేవింగ్స్ FD-స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు
పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్‌కు సంబంధించి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఆ తర్వాత జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, నార్త్-ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా 6.50 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. ప్రభుత్వరంగ, ప్రయివేటు రంగ బ్యాంకులతో పోల్చినప్పుడు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, స్వల్పకాలిక, దీర్ఘకాలికాలంలో ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన అధిక వడ్డీ రేటును అందిస్తాయి. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన పన్ను ఆదా చేసే, అధిక రిటర్న్స్ అందించే ఐదు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇవే..
- ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.25%,
- జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%,
- నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%,
- ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%,
- ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%.

ట్యాక్స్ సేవింగ్స్ FD-ప్రయివేటురంగ బ్యాంకులు
ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ప్రయివేటురంగ బ్యాంకులు 6.50 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఉదాహరణకు డీసీబీ బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకు పన్ను ఆదా చేసే డిపాజిట్స్ పైన 6.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకుల వడ్డీ రేటుతో చూస్తే ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్, సీనియర్ సిటిజన్స్ కోసం ఇక్కడ టాప్ 5 ప్రయివేటు రంగ బ్యాంకులను చూడండి. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన అధిక వడ్డీ రేట్లు అందించే ప్రయివేటు రంగ బ్యాంకులివే...
- DCB బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%,
- RBL బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%,
- యస్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%
- ఇండస్ఇండ్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%
- IDFC ఫస్ట్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 7.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.25%

ట్యాక్స్ సేవింగ్స్ FD-ప్రభుత్వరంగ బ్యాంకులు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు వంటి పలు బ్యాంకులు ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన 5.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన అధిక వడ్డీ రేటును అందించే టాప్ 5 ప్రభుత్వరంగ బ్యాంకులు ఇవి..
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - రెగ్యులర్ వడ్డీ రేటు 5.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.00%,
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - రెగ్యులర్ వడ్డీ రేటు 5.30%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.80%,
- పంజాబ్ & సింద్ బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.30%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.80%,
- కెనరా బ్యాంకు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%,
- బ్యాంక్ ఆఫ్ బరోడా - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Gold: మీరు గమనించారా? మోహన్ లాల్, అభిషేక్ శర్మ బంగారు నగలు ఎందుకు ధరిస్తున్నారు?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications