రిటర్న్స్ అదుర్స్: ఈ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్స్ వడ్డీ రేటు 7% వరకు..
స్వల్పకాలిక అవసరాలను ఆదా చేయడం కోసం లేదా అత్యవసర ఆర్థిక సంక్షోభానికి సేవింగ్స్ అకౌంట్ చాలా ప్రయోజకనకరం. పెట్టుబడిని ఇప్పుడే ప్రారంభించేవారు ఎవరైనా ఏ బ్యాంకులో అయినా లేదా ఏ పోస్టాఫీస్‌లో అయినా ఖాతాను తెరువవచ్చు. ఈ సేవింగ్స్ అకౌంట్ అకౌంట్లోని డబ్బుపై వడ్డీ రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇబ్బందిలేని నగదు ఉపసంహరణ, డిపాజిట్స్, డిపాజిట్స్ చేయడానికి, రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి, క్రెడిట్, డెబిట్ కార్డు దరఖాస్తుకు, అలాగే రూ.5 లక్షల వరకు బీమా వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

మంచి వడ్డీ రేట్లు
ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా రికరింగ్ డిపాజిట్స్ కంటే సేవింగ్స్ అకౌంట్స్ పైన తక్కువ వడ్డీ రేటు వస్తుంది. అయితే కొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. సేవింగ్స్ అకౌంట్స్ ప్రయోజనాలు, ఆయా బ్యాంకులు ఇచ్చే ప్రయోజనాలను బట్టి కొన్ని బ్యాంకులను ఇక్కడ చూడండి. కొన్ని బ్యాంకులు 7 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. మంచి వడ్డీ రేటును ఆఫర్ చేస్తోన్న ఐదు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు....

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
జూలై 1, 2021 నుండి అమలులో ఉన్న ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సేవింగ్స్ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి....
- రూ.1 లక్ష వరకు బ్యాలెన్స్ ఉంటే ఏడాదికి 5.00%,
- రూ.1 లక్ష నుండి రూ.25 లక్షల వరకు ఏడాదికి 6.00%,
- రూ.25 లక్షల నుండి రూ.10 కోట్ల వరకు ఏడాదికి 7.00%,
- రూ.10 కోట్లకు పైన వడ్డీ రేటు ఏడాదికి 6.75%.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
మార్చి 5, 2021 నుండి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి...
- రూ.1 లక్ష వరకు ఏడాదికి వడ్డీ రేటు 4.00%,
- రూ.1 లక్ష నుండ రూ.25 లక్షల వరకు ఏడాదికి వడ్డీ రేటు7.00%,
- రూ.25 లక్షల నుండి రూ.10 కోట్ల వరకు ఏడాదికి వడ్డీ రేటు 6.00%,
- రూ.10 కోట్లకు పైగా ఏడాదికి వడ్డీ రేటు 6.75%.

ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
1 ఆగస్ట్ 2020 నుండి ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి...
- రూ.1 లక్ష వరకు ఏడాదికి వడ్డీ రేటు 4.00%,
- రూ.1 లక్ష నుండ రూ.10 లక్షల వరకు ఏడాదికి వడ్డీ రేటు 5.50%,
- రూ.10 లక్షలకు పైన ఏడాదికి వడ్డీ రేటు 6.50%,

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
1 జూన్ 2020 నుండి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి...
- రూ.1 లక్ష వరకు ఏడాదికి వడ్డీ రేటు 4.00%,
- రూ.1 లక్ష నుండ రూ.10 లక్షల వరకు ఏడాదికి వడ్డీ రేటు 6.25%,
- రూ.10 లక్షలకు పైన ఏడాదికి వడ్డీ రేటు 6.00%,

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
19 ఏప్రిల్ 2021 నుండి నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి...
- రూ.0 నుండి రూ.4.99 లక్షల వరకు ఏడాదికి వడ్డీ రేటు 4 శాతం,
- రూ.5 లక్షల నుండి రూ.25 లక్షల వరకు ఏడాదికి వడ్డీ రేటు 5 శాతం,
- రూ.25 లక్షల నుండి రూ.10 కోట్ల వరకు ఏడాదికి వడ్డీ రేటు 5.5 శాతం,
- రూ.10 కోట్ల నుండి రూ.25 కోట్ల వరకు వడ్డీ రేటు 5.75 శాతం,
- రూ.25 కోట్లకు పైగా వడ్డీ రేటు 6 శాతం.


Click it and Unblock the Notifications