ఈ బ్యాంకుల్లో 'మినిమం' అవసరంలేదు: వడ్డీ, ఇన్సురెన్స్ సహా అదిరిపోయే బెనిఫిట్స్
జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ విషయంలో జరిమానా గురించి భయపడవలసిన అవసరం లేదు. మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయకుంటే మీకు బ్యాంకు ఎలాంటి ఛార్జీని విధించదు. అదే సమయంలో మీ జీరో సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో ఉండే మొత్తం పైన బ్యాంకులు వడ్డీని ఇస్తాయి. పెద్ద, చిన్న సహా అన్ని బ్యాంకులు కూడా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ పైన వడ్డీ రేటును అందిస్తాయి. కనీస బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం ఇబ్బంది పడేవారికి, ప్రతి నెల స్థిర ఆదాయం లేనివారికి జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అవసరం. ఈ నేపథ్యంలో జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఇచ్చే బ్యాంకులు, అకౌంట్ పేరు, వడ్డీ రేటును తెలుసుకుందాం....

IDFC First Bank
- IDFC ఫస్ట్ బ్యాంకు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ - First Savings Account
- వడ్డీ రేటు - 4.00%
- రోజువారీ ATM ఉపసంహరణ పరిమతి - 40,000
- ఏ బ్యాంకులోను సేవింగ్స్ అకౌంట్ లేనివారు ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. రూ.2 లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సురెన్స్ పాలసీ ఉంది.

SBI
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ - బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (BSBDA)
- వడ్డీ రేటు - 2.70%
- గరిష్ట పరిమితి లేదు.
- కేవైసీ కోసం అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ కలిగిన వారు ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ అకౌంట్‌తో రూపే ఏటీఎం డెబిట్ కార్డు ఇస్తారు.

YES Bank
- యస్ బ్యాంకు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ - స్మార్ట్ సాలరీ అడ్వాంటేజ్ అకౌంట్.
- వడ్డీ రేటు - 4.00%
- యస్ బ్యాంకులో కేవలం శాలరైడ్ ఉద్యోగులు మాత్రమే ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. రూ.75,000 పరిమితితో ఎంగేజ్ డెబిట్ కార్డును కూడా అందిస్తారు.

HDFC Bank
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ - బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (BSBDA)
- వడ్డీ రేటు - 3.00%
- HDFC బ్యాంకులో శాలరీ క్రెడిట్ అయ్యే కంపెనీ ఉద్యోగులకు అకౌంట్ ఇస్తారు. ఇతర బ్యాంకుల్లో శాలరీ అకౌంట్ లేదా సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారు వ్యక్తిగతంగా అకౌంట్‌ను ఓపెన్ చేయలేరు.

Mahindra Bank Box
- మహీంద్రా బ్యాంకు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ - 811 డిజిటల్ బ్యాంకు అకౌంట్.
- వడ్డీ రేటు - 3.50%
- వీడియో కేవైసీ ద్వారా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. బ్యాంకులో ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరంలేదు. ఈ అకౌంట్ ద్వారా నెఫ్ట్, ఐఎంపీఎస్ ద్వారా మనీ ట్రాన్సుఫర్ చేయవచ్చు.

Standard Chartered Bank
- స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ - Aasan/BSBDA
- వడ్డీ రేటు - 2.75%
- ఇన్‌స్టాంట్ బేసిస్‌లో ఈ-కేవైసీ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా ఉచిత ట్రాన్సాక్షన్స్ నిర్వహించవచ్చు.

IndusInd Bank
- ఇండస్ఇండ్ బ్యాంకు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ - ఇండస్ ఆన్ లైన్ సేవింగ్స్ అకౌంట్.Account
- వడ్డీ రేటు - 4.00%
- ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్, పాన్ కార్డుతో లింక్ అయిన వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అవసరం. ఈ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా రూ.2 లక్షల పర్సనల్ యాక్సిడెంట్ పాలసీని పొందుతారు. ప్లాటినమ్ ప్లస్ డెబిట్ కార్డు వస్తుంది.


Click it and Unblock the Notifications