వాహనాలు కొనుగోలు చేయడానికి చాలామంది ఎంచుకునే ఆప్షన్ వెహికిల్ లోన్. బ్యాంకుల్లో వాహనాలపై తీసుకునే రుణాలపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. కరోనా సమయంలో సోషల్ డిస్టెన్స్ నేపథ్యంలో టూ-వీలర్ సేల్స్ భారీగా పెరిగాయి. గతంలో బస్సులు వంటి ప్రభుత్వ ప్రయాణ వాహనాలు లేదా ఇతర ప్రయివేటు వాహనాలు ఉపయోగించినవారు ఎందరో కరోనా తర్వాత సొంత వాహనాలు కొనుగోలు చేసేందుకు మక్కువ చూపారు. అందుకే టూవీలర్ సేల్స్, సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ పెరిగాయి.
ఇందులోను చాలామంది వెహికిల్ లోన్ తీసుకొని కొనుగోలు చేశారు. అర్హత కలిగిన వారికి బ్యాంకులు వాహన రుణాలు మంజూరు చేశాయి. ఇప్పటికీ టూ-వీలర్ సేల్స్ ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టూ-వీలర్ లోన్స్ పైన తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకులను ఇక్కడ చూద్దాం...

ఇవి చాలా కీలకం
మన అవసరాల కోసం ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలని భావిస్తే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పూర్తి మొత్తం చెల్లించి కొనుగోలు చేయగలగాలి. లేదా టూ-వీలర్ రుణం ద్వారా కొనుగోలు చేయాలి. కొంత డౌన్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. మన అర్హత, ఆదాయ ప్రమాణాలు, కాలపరిమితి, వడ్డీ రేట్లు చూసుకొని, మన అనుకూలతను బట్టి ఆయా బ్యాంకులో టూ-వీలర్ రుణం తీసుకోవాలి. మన అర్హత ప్రమాణాలు, ఆ తర్వాత తక్కువ వడ్డీని అందించే బ్యాంకును, ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్స్, ఈఎంఐ చెల్లింపు వంటి వాటిని వరుసగా పరిగణలోకి తీసుకోవాలి. ద్విచక్ర రుణం తీసుకునే సమయంలో సిబిల్ స్కోర్ చాలా కీలకం. మీ సిబిల్ 750 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఉంటుంది.

పన్ను మినహాయింపు
ఎలక్ట్రికల్ వాహనాలను మినహాయించి, డొమెస్టిక్ పర్పస్ ఉపయోగించే ఇతర టూ-వీలర్స్ పైన పన్ను మినహాయింపు ఉండదు. యజమాని లేదా వ్యాపార ప్రయోజనం కోసం ఉపయోగించే బైక్ పైన పన్ను మినహాయింపు పొందవచ్చు. కొనుగోలుదారు బిజినెస్‌మెన్, స్వయంఉపాధి ఇండివిడ్యువల్ అయితే మాత్రమే 1961 ఆదాయపు పన్ను చట్టం 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రోత్సాహకాలు లభిస్తాయి. మీ ద్విచక్ర వాహన రుణంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి ఐటీఆర్ ఫామ్ పూర్తి చేయాలి. బ్యాంకు జారీ చేసిన వడ్డీ ధృవపత్రాలను జత పరచాలి. అయితే రుణ గ్రహీతలు కేవలం వడ్డీ రేటు చెల్లింపులు, రవాణా ఖర్చులు, డిప్రిసియేషన్ ఖర్చు పైన మాత్రమే మినహాయింపు పొందగలరని గుర్తుంచుకోవాలి.

అవసరమయ్యే డాక్యుమెంట్స్
- ద్విచక్ర వాహన రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు కింది అర్హత ప్రమాణాలు తెలుసుకోవాలి. డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి.
- ద్విచక్ర వాహన రుణ గ్రహీత వయస్సు 21 సంవత్సరాల నుండి 58 సంవత్సరాలు (వేతన జీవి అయితే) ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 21 ఏళ్ల నుండి 65 ఏళ్లు.
- రుణ గ్రహీత వ్యాపారవేత్త లేదా శాలరైడ్ అయి ఉండాలి.
- రుణగ్రహీతకు నెలకు కనీసం రూ.10,000 ఆదాయం ఉండాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇన్‌కం ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్, గత మూడు నెలల బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్ ఉండాలి.

తక్కువ వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంకులు
ప్రస్తుతం ద్విచక్ర వాహనాలపై అతి తక్కువ వడ్డీ రేటును అందిస్తోన్న టాప్ 10 బ్యాంకులు...
- Central Bank of India - వడ్డీ రేటు 7.25% to 7.70% - గరిష్ట రుణ పరిమితి Rs 10 lac
- Bank of India - వడ్డీ రేటు 7.35% to 8.55% - గరిష్ట రుణ పరిమితి Rs 50 lac (max),
- Punjab National Bank - వడ్డీ రేటు 8.70% to 10.05% - గరిష్ట రుణ పరిమితి Rs 10 lac (max),
- Jammu & Kashmir Bank - వడ్డీ రేటు 8.70% onwards - గరిష్ట రుణ పరిమితి Rs 2.5 lac (max),
- Punjab & Sind Bank - వడ్డీ రేటు 9.00% onwards - గరిష్ట రుణ పరిమితి Rs 10 lac (max),
- Canara Bank - వడ్డీ రేటు 9.00% onwards - గరిష్ట రుణ పరిమితి Rs 10 lac (max),
- ICICI Bank - వడ్డీ రేటు 9.50% to 26.00% - గరిష్ట రుణ పరిమితి Rs 3 lac (max),
- IDBI Bank - వడ్డీ రేటు 9.80% to 9.90% - గరిష్ట రుణ పరిమితి Rs. 1.20 lacs onwards,
- Union Bank - వడ్డీ రేటు 9.90% to 10.00% - గరిష్ట రుణ పరిమితి Rs 10 lac (max),
- IDFC First Bank - వడ్డీ రేటు 9.99& onwards - గరిష్ట రుణ పరిమితి Rs 3 lac and above.


Click it and Unblock the Notifications