ఈ మూడు బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోలు చేస్తే లాభాలు అదుర్స్!

భారత సూచీలు ఏ రోజుకు ఆ రోజు సరికొత్త గరిష్టాన్ని తాకుతున్నాయి. సెన్సెక్స్ నిన్న ఏకంగా 56,000 పాయింట్లను తాకి, కాస్త కిందకు వచ్చింది. నిఫ్టీ 16,700 పాయింట్లను దాటినప్పటికీ, చివరి సెషన్‌లో 16,569 పాయింట్ల వద్ద ముగిసింది. సాధారణంగా ఇన్వెస్టర్లు ఎవరు కూడా సూచీలు ఆల్ టైమ్ గరిష్టం వద్ద ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపరు.

ఎందుకంటే స్టాక్ మార్కెట్ రిస్క్‌తో కూడుకున్నది. ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టానికి చేరినందున, ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తే నష్టాల్లోకి వెళ్లిపోవచ్చు. కాబట్టి ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించాలి. ఆగస్ట్ నెలలో ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ఏంజెల్ బ్రోకింగ్ మూడు బ్యాంకింగ్ స్టాక్స్ పైన ఆశాజనకంగా ఉంది. ఈ బ్యాంకింగ్ స్టాక్స్ 32 శాతం వరకు రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఆ స్టాక్స్ ఏమిటో తెలుసుకుందాం...

ఆర్థిక రికవరీకి సంకేతాలు, మార్కెట్‌కు ఊతం

ఆర్థిక రికవరీకి సంకేతాలు, మార్కెట్‌కు ఊతం

ఏంజెల్ బ్రోకింగ్ సూచించిన స్టాక్స్ గురించి చర్చించడానికి ముందు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి ఓ లుక్కేద్దాం. కరోనా కారణంగా ఏడాదిన్నరగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. గత ఏడాది రెండో అర్ధ సంవత్సరం నుండి ఆర్థిక వ్యవస్థ, కార్యకలాపాలు క్రమంగా కోలుకున్నాయి. అయితే ఈ ఏడాది మే నెల నుండి కరోనా సెకండ్ వేవ్ వల్ల దెబ్బతిన్నది. ఇప్పుడు మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిలోకి వస్తోంది. PMI, ఆటో సేల్స్, ఈ-వే బిల్స్, జీఎస్టీ కలెక్షన్లు వరుసగా సరికొత్త రికార్డుస్థాయికి చేరుకుంటున్నాయి. జూలై నెలకు గాను విడుదలైన PMI మ్యానుఫ్యాక్చరింగ్ డేటా డేటాను చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఔట్ పుట్ బలమైన వృద్ధిని నమోదు చేస్తోంది. జూన్ నెల నుండి రికవరీ కనిపిస్తోంది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. సెకండ్ వేవ్ భారీగా ఉన్న సమయంలో రోజుకు 4 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య 40,000కు పడిపోయింది. ప్రతిరోజు కొత్తగా నమోదవుతున్న కేసుల్లో కేరళ ముందు ఉంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో కేవలం కేరళలోనే 50 శాతానికి పైగా ఉన్నాయి. కేరళ మినహా మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి సద్దుమణిగినట్లుగా కనిపిస్తోంది. పాజిటివ్ రేట్ 2 శాతం కంటే దిగువకు పడిపోయింది.

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. మే నెల చివరి నాటికి 12 శాతం వ్యాక్సినేషన్ పూర్తికాగా, ఆగస్ట్ 8వ తేదీ నాటికి ఇది 29 శాతానికి చేరుకుంది.

కరోనా కారణంగా ప్రపంచ దేశాల ఆర్థికపరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో ఆయా దేశాల బ్యాంకులు తమ తమ దేశాల ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు లిక్విడిటీని అందిస్తున్నాయి. లిక్విడిటీ అందించడం భారత్ సహా దేశాల మార్కెట్లకు ఊతమిచ్చింది.

ఈ స్టాక్స్ రిఫర్

ఈ స్టాక్స్ రిఫర్

ఏంజెల్ బ్రోకింగ్ ఫెడరల్ బ్యాంకు, HDFC బ్యాంకు, శ్రీరామ్ సిటీ యూనియన్ బ్యాంకు స్టాక్స్ కొనుగోలును రిఫర్ చేస్తోంది.

ఏంజెల్ బ్రోకింగ్ ఫెడరల్ బ్యాంకును రిఫర్ చేసిన సమయంలో రూ.85గా ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.83 వద్ద ఉంది. ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.110గా అంచనా వేసింది ఏంజెల్ బ్రోకింగ్. అంటే 32 శాతం లాభాన్ని నమోదు చేయవచ్చు.

ఏంజెల్ బ్రోకింగ్ HDFC బ్యాంకును రిఫర్ చేసిన సమయంలో రూ.1495గా ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.1511 వద్ద ఉంది. ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.1859గా అంచనా వేసింది ఏంజెల్ బ్రోకింగ్. అంటే 22.6 శాతం లాభాన్ని నమోదు చేయవచ్చు.

ఏంజెల్ బ్రోకింగ్ శ్రీరామ్ సిటీ యూనియన్ బ్యాంకును రిఫర్ చేసిన సమయంలో రూ.1815గా ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.1938 వద్ద ఉంది. ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.2100గా అంచనా వేసింది ఏంజెల్ బ్రోకింగ్. అంటే 8.33 శాతం లాభాన్ని నమోదు చేయవచ్చు.

ఇవి అదుర్స్

ఇవి అదుర్స్

ఫెడరల్ బ్యాంకు 32 శాతం రిటర్న్స్ ఇచ్చే అవకాశముందని, ప్రస్తుతం రూ.83 వద్ద ఉన్న ఈ స్టాక్ రూ.110కి చేరుకోవచ్చునని ఏంజెల్ బ్రోకింగ్ అంచనా వేసింది. Q1FY22 ఫలితాల నేపథ్యంలో ఏడాది ప్రాతిపదికన 21.8 శాతం లాభాలు నమోదు చేసింది.

HDFC బ్యాంకు 22 శాతం రిటర్న్స్ ఇస్తూ ప్రస్తుతం ఉన్న రూ.1516 నుండి రూ.1859కు చేరుకోవచ్చునని అంచనా వేసింది. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో లోన్ వృద్ధి రేటు ఏడాది ప్రాతిపదికన 14 శాతం పెరిగింది. HDFC బ్యాంకు ఆశాజనక ఫలితాలను నమోదు చేస్తోంది.

శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ ఎనిమిది శాతం లాభపడి షేర్ ధర రూ.2100కి చేరుకుంటుందని ఏంజెల్ బ్రోకింగ్ తెలిపింది. ఎన్బీఎఫ్‌సీలో బలమైన వృద్ధిని నమోదు చేస్తోంది.

స్టాక్స్, ఫండ్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఈ స్టోరీ ఆధారంగా కాకుండా పెట్టుబడి నిపుణుల సలహాలు, మార్కెట్ పైన పూర్తి అవగాహనతో పెట్టుబడులు పెట్టడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+