For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు నెలల్లో డబుల్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్

|

స్టాక్స్ కొనుగోలు చాలా సులభం. కానీ సరైన స్టాక్స్ కొనుగోలు కష్టమైన విషయం. మార్కెట్లలో అనిశ్చితి ఏర్పడినప్పుడు చాలామంది ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూశారు. కొన్ని స్టాక్స్ జంప్ చేయడం వల్ల మరికొంతమంది లాభాలు తీసుకున్నారు. మార్కెట్లలో రిస్క్ చాలా సహజం. కానీ మంచి పెట్టుబడికి వ్యూహాలు అవసరం. అలాగే నష్టాలను అధిగమించే ప్రణాళిక, స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశాక కాస్త ఓపిక వంటివి ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. గత ఏడాది కాలంగా కరోనా కారణంగా మార్కెట్లు భారీ నష్టాలు నమోదు చేశాయి. అంతలోనే ఎగిసి, లాభాల్లోకి వచ్చాయి. సూచీలు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి.

ట్రంప్ మాత్రమే కాదు.. చైనాకు బిడెన్ భారీ షాక్: 7 కంపెనీలు బ్లాక్‌లిస్ట్‌లో..ట్రంప్ మాత్రమే కాదు.. చైనాకు బిడెన్ భారీ షాక్: 7 కంపెనీలు బ్లాక్‌లిస్ట్‌లో..

అదానీ గ్రూప్‌కు చెందిన వివిధ సంస్థలు గత ఏడాది కాలంలో భారీగా ఎగిశాయి. దీంతో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఫోర్బ్స్ టాప్ 20 జాబితాలో చేరుకున్నారు. అలాగే, గత రెండు నెలల కాలంలో కూడా వివిధ కంపెనీలు కూడా ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ ఇచ్చాయి.

These Are The Best Stocks To Buy And Watch Now

అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ టోటల్ గ్యాస్ రెండు నెలల క్రితం అంటే ఫిబ్రవరి 15వ తేదీన రూ.427గా ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.1092ను క్రాస్ చేసింది. అంటే దాదాపు మూడింతల రిటర్న్స్ వచ్చాయి. హిందూస్తాన్ కాపర్ ఫిబ్రవరి 15న రూ.75గా ఉండగా, రూ.144గా, ప్రకాశ్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఫిబ్రవరి 15న రూ.49,65గా ఉండగా, ప్రస్తుతం రూ.88.30కి పెరిగింది. ఇలా పలు స్టాక్స్ మంచి రిటర్న్స్ అందించాయి.

English summary

రెండు నెలల్లో డబుల్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ | These Are The Best Stocks To Buy And Watch Now

Buying a stock is easy, but buying the right stock without a time-tested strategy is incredibly hard.
Story first published: Friday, April 9, 2021, 20:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X