Gold Loans: బంగారం రుణాలపై తక్కువ వడ్డీ వసూలు చేస్తున్న బ్యాంకులు ఇవే..!
ఈ మధ్య కాలంలో బంగారం రుణాలు భారీగా పెరిగాయి. చాలా మంది బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. బంగారం రుణాలు పెరగడానికి ప్రధాన కారణం గోల్డ్ లోన్స్ పై వడ్డీ తక్కువగా ఉండడం. అంతే కాకుండా బంగారం ధరలు పెరగడం కూడా కారణంగా చెబుతున్నారు. బంగారం పలు బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బంగారం రుణాలపై 8.5 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.5 శాతం, ఎస్బీఐ గోల్డ్ లోన్ 8.65 శాతం, కెనరా బ్యాంక్ గోల్డ్ లోన్ 8.8 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 9 శాతం, హెచ్ డీఎఫ్ సీ 9.10 శాతం, యాక్సిస్ బ్యాంక్ 9.75 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి.
వ్యవసాయం కోసం బంగారం రుణాలు తీసుకుంటే కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ వసూలు చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా 7 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తోంది. ఇండియన్ బ్యాంకు వ్యవసాయ అవసరాల కోసం తీసుకునే బంగారం రుణాలపై 7 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజ్ కూడా తీసుకోవడం లేదు. యూనియన్ బ్యాంక్ 7.2 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు తీసుకోవడం లేదు. బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవసాయం కోసం తీసుకునే బంగారు రుణాలకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా 7.70 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. ఇందులో రూ.3 లక్షల పైగా గోల్డ్ లోన్ తీసుకుంటే 0.25 శాతం ప్రాసెసింగ్ ఫీజ్ అలాగే జీఎస్టీ కూడా వసూలు చేస్తారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయం కోసం తీసుకునే బంగారం రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా 8.25 శాతం వడ్డీ వసూల్ చేస్తోంది. ఫెడరల్ బ్యాంక్ వ్యవసాయం కోసం తీసుకునే బంగారం రుణాలపై 8.5 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.250 నుంచి రూ.1500 వసూలు చేస్తున్నారు. సౌత్ ఇండియన్ బ్యాంక్ బంగారం రుణాలపై 8.5 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. కాగా 2026 ఆగస్టు నాటికి రూ.22.5 లక్షల కోట్లకు పెరిగింది. 2023 జులై నుంచి 2025 జూన్ మధ్య కాలంలో రూ.2.5 లక్షల వరకు రుణం తీసుకున్న తక్కువ రిస్క్ వినియోగదారుల్లో 57 శాతం మంది, రూ.2.5 లక్షలకు పైగా రుణం తీసుకున్నవారిలో 54 శాతం మంది కేవలం 12 నెలల వ్యవధిలోనే మరోమారు గోల్డ్ లోన్ తీసుకున్నారని నివేదిక తెలిపింది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications