Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటు అందిస్తున్న బ్యాంకులు ఇవే..!

పలు బ్యాంకులు సీనియర్ సిటిజన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తున్నాయి. రూ. 3 కోట్ల వరకు చేసే ఐదేళ్ల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FDs)పై 8.05% వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు 8.05 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని అందిస్తున్నాయి. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం ఐదేళ్ల కాలపరిమితి గల ఎఫ్డీ లపై 8.05% వడ్డీని అందిస్తోంది. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం ఐదేళ్ల కాలపరిమితి గల ఎఫ్డీలపై 8 శాతం వడ్డీని అందిస్తోంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.25 శాతం, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.50, ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 6.25, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.00, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 6.75, స్లైస్ (slice) స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.25, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.05, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.70, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.50 శాతం వడ్డీ అందిస్తున్నాయి.

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లోని డిపాజిట్లు 'డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్' (DICGC) ద్వారా రూ. 5 లక్షల వరకు బీమా ఉంటుంది. అందుకే స్మాల్ ఫైనాన్స్ FDలలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై సీనియర్ సిటిజన్లకు 7.05% వడ్డీ రేటును అందిస్తోంది. ఇందులో 'SBI We-care' డిపాజిట్ పథకం కింద లభించే అదనపు 50 బేసిస్ పాయింట్ల (bps) ప్రయోజనం కూడా కలిసి ఉంది. ఒక వ్యక్తి 7.05% వడ్డీ రేటుతో 5 ఏళ్ల పాటు రూ. 5 లక్షలను పెట్టుబడి పెడితే, SBI సీనియర్ సిటిజన్ FD పథకం కింద మెచ్యూరిటీ సమయంలో లభించే మొత్తం సుమారు రూ. 7,09,129గా ఉంటుంది. ఇందులో పొందిన మొత్తం వడ్డీ దాదాపు రూ. 2,09,129 అవుతుంది.

FD

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై సీనియర్ సిటిజన్లకు 6.80% వడ్డీ రేటును అందిస్తోంది. ఒక సీనియర్ సిటిజన్ పీఎన్బీ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో 6.80% వడ్డీ రేటుతో 5 ఏళ్ల పాటు రూ. 5 లక్షలను పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ మొత్తం దాదాపు రూ. 7,00,469గా ఉంటుంది. ఈ ఐదేళ్ల కాలంలో లభించే మొత్తం వడ్డీ దాదాపు రూ. 2,00,469 అవుతుంది. కెనరా బ్యాంక్ తన 5 ఏళ్ల FDపై సీనియర్ సిటిజన్లకు 6.75% వడ్డీ రేటును అందిస్తోంది. ఒక సీనియర్ సిటిజన్ కెనరా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో 6.75 శాతం వడ్డీ రేటుతో 5 ఏళ్ల పాటు రూ. 5 లక్షలను పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ మొత్తం సుమారు రూ. 6,98,749గా ఉంటుంది. ఈ ఐదేళ్ల కాలంలో లభించే మొత్తం వడ్డీ సుమారు రూ. 1,98,749 అవుతుంది.

హెడీఎఫ్సీ బ్యాంక్ తన 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సీనియర్ సిటిజన్లకు 6.65% వడ్డీ రేటును అందిస్తోంది. ఒక సీనియర్ సిటిజన్ HDFC బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో 6.65% వడ్డీ రేటుతో 5 ఏళ్ల పాటు రూ. 5 లక్షలను పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ మొత్తం సుమారు రూ. 6,95,322గా ఉంటుంది. ఈ ఐదేళ్ల కాలంలో లభించే మొత్తం వడ్డీ దాదాపు రూ. 1,95,322 అవుతుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ తన 5 ఏళ్ల సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై 7.1% వడ్డీ రేటును అందిస్తోంది. ఒక వృద్ధ పౌరుడు కెనరా బ్యాంక్ 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకంలో 7.1% వడ్డీ రేటుతో రూ. 5 లక్షలను పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయానికి లభించే మొత్తం దాదాపు రూ. 7,10,873 అవుతుంది. ఈ ఐదేళ్ల కాలంలో లభించే మొత్తం వడ్డీ దాదాపు రూ. 2,10,873 ఉంటుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+