Fixed Deposits: ప్రభుత్వ బ్యాంక్ కంటే ఎక్కువ ఎఫ్డీ వడ్డీ రేట్లు అందిస్తున్న బ్యాంకులు ఇవే..!
చాలా మంది సురక్షితమైన, కచ్చితమైన రాబడి కోసం ఎఫ్డీలు చేస్తారు. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే ముందు ఎక్కడ వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎక్కువ ఉందో చూసి ఎఫ్డీ చేయాలి. అయితే బ్యాంకుల్లో మీ డిపాజిట్లు రూ.5 లక్షల వరకే ఇన్సూరెన్స్ ఉంటుంది. కాబట్టి ఒకే బ్యాంకులో పెద్ద మొత్తం కాకుండా రెండు, మూడు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకుంటే బెటరని నిపుణులు చెబుతున్నారు. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు పరిశీలిస్తే.. పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే.. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఆకర్షణీయమైన అధిక వడ్డీ రేట్లను చెల్లిస్తున్నాయి. కొద్ది శాతం వడ్డీ తేడా ఉన్నా.. భారీగా రాబడి కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండే బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం బెటర్.
బంధన్ బ్యాంక్ 2 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ పై అత్యధికంగా 7.45 శాతం ఆఫర్ చేస్తోంది. 3 సంవత్సరాల కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్ పై ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 7.25% గరిష్ట వడ్డీ రేటును అందిస్తోంది. దేశీయ దిగ్గజ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐలో అత్యధిక రెగ్యులర్ రేటు 444 రోజుల కాలపరిమితికి 6.45 శాతమే చెల్లిస్తోంది. ఈ విధంగా బంధన్ బ్యాంక్ వడ్డీ రేటు ఎస్బీఐ కంటే 1 శాతం ఎక్కువగానే ఉంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ రేటు ఎస్బీఐ కంటే 0.80 శాతం అధికంగా ఉంది. వడ్డీ రేటు కొద్ది శాతమే తక్కువ ఉన్నప్పటికీ.. డిపాజిట్ మొత్తం పెరిగే కొద్దీ వచ్చే వడ్డీ భారీ తేడా ఉండే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు మీరు రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే బంధన్ బ్యాంక్‌లో 7.45 శాతం వడ్డీ చొప్పున ఏడాదికి రూ. 37వేల 250 వడ్డీ లభిస్తోంది. ఇది ఎస్‌బీఐతో పోలిస్తే రూ.5వేలు ఎక్కువ. ఇదే రూ.5 లక్షలను ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే.. 7.25% వడ్డీ చొప్పున ఏడాదికి రూ. 36వేల 250 వడ్డీ చెల్లిస్తారు. ఇది ఎస్‌బీఐ కంటే రూ.4వేలు ఎక్కువ. ఎస్‌బీఐలో మాత్రం అదే రూ.5లక్షలకు కేవలం రూ.32వేల 250 వడ్డీ వస్తుంది. అందుకే వడ్డీ రేటు ఎక్కువున్న బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని సూచిస్తున్నారు.
అయితే కేవలం అత్యధిక వడ్డీ రేటును చూసి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయకూడదని చెబుతున్నారు. కాలపరిమితి, ముందస్తు విత్‌డ్రా రూల్స్, పన్ను విధింపు వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ రూల్స్ ప్రకారం ప్రతి బ్యాంకులోనూ అసలు వడ్డీ కలిపి రూ. 5 లక్షల వరకు డిపాజిట్లకు పూర్తి భద్రత ఉంటుందని గుర్తుంచుకోవాలి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications