ఫండ్స్ సమీకరించేందుకు కేవలం ప్రయివేటు సంస్థలు మాత్రమే ఐపీవోను ఎంచుకోవడం లేదు! తమ PSUల ద్వారా ప్రభుత్వం కూడా నిధులను సమీకరిస్తుంది. గత కొన్నేళ్లలో ప్రభుత్వం ప్రయివేటీకరణ, విలీనం, పెట్టుబడుల ఉపసంహరణ, షేర్ల విక్రయం ద్వారా నిధులను సమీకరించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2022లో పలు ఐపీవోలతో ముందుకు వస్తోంది. ఈ క్యాలెండర్ ఏడాదిలో వచ్చే ఐదు ఐపీవోలను ఇక్కడ చూద్దాం... ఇందులో ప్రధానమైనది ఎల్ఐసీ.

ఎల్ఐసీ
లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రభుత్వరంగ సంస్థ మాత్రమే కాదు, భారత అతిపెద్ద ఐపీవోగా నిలువనుంది. సమాచారం మేరకు ఎల్ఐసీ ఐపీవో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పూర్తి అవుతుంది. 2022లో భారత క్యాపిటల్ మార్కెట్ వృద్ధికి ఎల్ఐసీ ఐపీవో కీలకం కానుంది. ఎల్ఐసీ ఐపీవోకు వీలుగా కేంద్రం లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ చట్టంలో సవరణలు చేసింది. తాజాగా చైర్మన్ పదవిని మరో ఏడాది పాటు పొడిగించింది.

ఈసీజీసీ లిమిటెడ్
ప్రభుత్వరంగ సంస్థలు ఈసీజీసీ లిమిటెడ్, నేషనల్ సీడ్స్ కార్పోరేషన్ లిమిటెడ్.. ఈ రెండు కూడా ఐపీవోకు వస్తున్నాయి. ఈసీజీసీ అంటే ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ప్రభుత్వ రంగ క్రెడిట్ ప్రొవైడర్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఉంది. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఈ కంపెనీ వివిధ ఆన్ లైన్ సేవలు అందిస్తుంది.

నేషనల్ సీడ్స్ కార్పోరేషన్
నేషనల్ సీడ్స్ కార్పోరేషన్ లిమిటెడ్(NSC) కూడా ఐపీవోకు వస్తుంది. ఇది వ్యవసాయ కార్పోరేషన్, రైతు సంక్షేమ శాఖ, వ్యవసాయ కార్పోరేషన్, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉంది. NSC విత్తన పరీక్ష, నాణ్యత నియంత్రణ కోసం భోపాల్, ఢిల్లీ, సూరత్‌గర్, సికింద్రాబాద్‌లలో నాలుగు క్వాలిటీ కంట్రోల్ లేబోరేటరీలను ఏర్పాటు చేసింది. ఇందులో 25 శాతం వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మినీరత్న ఎన్ఎస్సీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో 29.92 కోట్ల లాభాన్ని (ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్) ఆర్జించింది. మార్చి 31, 2020 నాటికి దీని వ్యాల్యూ రూ.646.37 కోట్లు. 2022లో ఐపీవోకు రావొచ్చు.

WAPCOS లిమిటెడ్
WAPCOS (వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్) ప్రభుత్వరంగ సంస్థ. విద్యుత్, నీళ్లు, ఇన్ఫ్రా రంగాలకు సంబంధించినది. ఈ మినీరత్న కంపెనీ ఆప్ఘనిస్తాన్‌తో పాటు వివిధ దేశాల్లో సేవలు అందిస్తోంది. ఐపీవోపై దూకుడుగా ముందుకు వెళ్లినప్పటికీ, కరోనా కారణంగా ఆలస్యమైంది. WAPCOS ప్రస్తుతం తన అంతర్జాతీయ వ్యాపారాలన్నింటి పైన సమాచారం సేకరిస్తోంది. ఇది కొద్ది నెలల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత ఐపీవోకు రావొచ్చు.

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్
నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ (NEEPCO).. ప్రభుత్వ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిదారు ఎన్టీపీసీ అనుబంధ సంస్థ. అసెట్ మానిటైజేషన్‌లో భాగంగా ఇది ఐపీవోకు వస్తోంది. ఎన్టీపీసీ మరో రెండు అనుబంధ సంస్థల్లో ఈ పెట్టుబడులు పెడుతోంది. పవన శక్తి పైన దృష్టి సారించి, మున్ముందు కాలంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల నుండి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వ్యూహాన్ని అనుసరిస్తోంది NEEPCO. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం కావొచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications