ఉరుకుల పరుగులతో సాగుతున్న ఈ జీవితంలో చాలాసార్లు మనం కొన్ని చిన్న విషయాలను అప్రమత్తంగా గమనించకుండా వదిలేస్తుంటాం. అవి చిన్నవిగా అనిపించినా, తమ తమ రంగాల్లో కాలక్రమంలో సీరియస్ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఇదే విషయం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ విషయంలో దీని ఎఫెక్ట్ చాలానే ఉంటుంది. మంచి ఆదాయం ఉన్నా, ఖర్చులు నియంత్రణలో ఉన్నా కొన్ని చిన్న అలవాట్ల వలన మన క్రెడిట్ స్కోర్ అనూహ్యంగా పడిపోతూ ఉంటుంది.
క్రెడిట్ స్కోర్ అనేది ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. మీరు రుణం తీసుకోగలరా లేదా?, ఏమాత్రం వడ్డీతో రుణం వస్తుందా? అనే విషయాలపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది. సాధారణంగా మనం చేసే కొన్ని చిన్న పొరపాట్లు క్రెడిట్ స్కోర్‌ను బాగా దెబ్బతీసెస్తాయి. వాటిలో ముఖ్యమైనవేంటో ఇప్పుడు చూద్దాం.

బిల్లులను సకాలంలో చెల్లించకపోవడం: క్రెడిట్ కార్డ్ బిల్‌ను ప్రతీ నెలా పూర్తి మొత్తంగా చెల్లించకపోతే మీపై వడ్డీ పడటమే కాకుండా, మీరు అప్పు మీద ఆధారపడే వ్యక్తి అన్న అభిప్రాయం తీసుకొస్తుంది. ఇది credit score ని తగ్గించే మొదటి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే డ్యూ డేట్ మరిచి పోకుండా ఫోన్ రిమైండర్ లేదా ఆటో-డెబిట్ ను సెట్ చేసుకోవడం మంచిది.
అత్యవసర అవసరాల్లో క్రెడిట్ కార్డు వినియోగం: ఆసుపత్రి బిల్లు, వాహనం రిపేర్ వంటి సందర్భాల్లో ఒక్కసారిగా కార్డ్ స్వైప్ చేసేస్తాం. ఇలా అనేకసార్లు చేస్తే అప్పు మెల్లగా పెరుగుతుంది. దీన్ని నివారించాలంటే అత్యవసర నిధిని.. చిన్న మొత్తంతో అయినా క్రమంగా తయారు చేయాలి. అప్పుడు మీకు అది కొన్ని సమయాల్లో ఉపయోగపడుతుంది.
తరచుగా కొత్త క్రెడిట్ కార్డ్‌లు లేదా లోన్‌లకు దరఖాస్తు చేయడం: మీ రు తరచూ రుణానికి అప్లై చేస్తే.. బ్యాంకుల ద్వారా అది ఎంక్వైరీగా నమోదవుతుంది. ఎక్కువ ఎంక్వైరీస్ రావడం అంటే .. ఈ వ్యక్తికి డబ్బు కొరత ఉందన్న సంకేతం వస్తుంది. ఇది స్కోర్‌కి మైనస్ అవుతుంది. కాబట్టి నిజంగా అవసరమైతేనే దరఖాస్తు చేయండి.
క్రెడిట్ నివేదికను తనిఖీ చేయడం: చాలామంది తమ క్రెడిట్ రిపోర్ట్‌ను ఎప్పుడూ చెక్ చేయరు. అయితే ఇందులో పాత అప్పులు లేదా శాశ్వతంగా క్లజ్ అయిన అకౌంట్‌లు ఇంకా అమౌంట్ పెండింగ్ అని చూపించబడే అవకాశముంది. ఇది మీ స్కోరును అనవసరంగా తగ్గిస్తుంటుంది. కనీసం సంవత్సరం లోకైనా ఒకసారి CIBIL / CRIF వెబ్‌సైట్‌లలో మీ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసి తనిఖీ చేయండి.
పాత క్రెడిట్ కార్డులను వెంటనే మూసివేయడం: కొన్ని పాత కార్డులు మీ క్రెడిట్ హిస్టరీకి బలమైన బ్యాక్‌అప్‌గా పనిచేస్తాయి. అలాంటి కార్డులను Annual Fees లేకపోతే యాక్టివ్‌గా ఉంచడం ఉత్తమం. మూసివేయడం వల్ల పాస్ జరిగిన మంచి హిస్టరీ కూడా పోతుంది.మీరు ఈ చిన్న చిన్న అలవాట్లను మార్చుకుంటే, రుణాలు కూడా తక్కువ వడ్డీకి అందుతాయి, భవిష్యత్తులో పెద్ద అవసరాలను అంత కస్టం లేకుండా తీర్చుకోవచ్చు.
తప్పులు ఏమిటి? వాటిని ఎలా నివారించాలి?
తప్పు 1: క్రెడిట్ కార్డ్ బిల్‌ను ఆలస్యంగా లేదా పూర్తిగా చెల్లించకపోవడం
మీరు బిల్లులో 10%-20% మాత్రమే చెల్లించి మిగతాను ఆ తర్వాత చెల్లిస్తే, దాని మీద వెంటనే వడ్డీ ప్రారంభమవుతుంది. ఇది క్రెడిట్ యుటిలైజేషన్ రెషియోను పెంచుతుంది. ఇది మీ స్కోర్‌ను నెమ్మదిగా తగ్గిస్తుంటుంది.
పరిష్కారం: బిల్లు మొత్తాన్ని సమయానికి పూర్తిగా చెల్లించండి. అవసరమైతే EMIలో మార్పు చేసుకోండి లేదా Auto-Pay / Reminder సెట్ చేసుకోండి.
తప్పు 2: అత్యవసరాల్లో పదే పదు క్రెడిట్ కార్డును వాడడం
హాస్పిటల్, కారు మరమ్మతులు లాంటి వేడుకల్లో సుమారు ప్రతి సారి కార్డు Swipe చేస్తే అప్పు కూడా అలాగే పెరుగుతుంది.
పరిష్కారం: మెల్లిగా అయినా ఒక Emergency Fund (అత్యవసర నిధి) ప్రారంభించండి. నెలకు రూ. 500 పెట్టుకోవడం మొదలు పెట్టండి.
తప్పు 3: తరచుగా క్రెడిట్ కార్డ్ / లోన్‌కు దరఖాస్తు చేయడం
పదేపదే దరఖాస్తు చేయడం వల్ల మీపై అవసరం ఎక్కువ... రిస్క్ ఎక్కువ అన్న అభిప్రాయాన్ని బ్యాంక్‌లు ఏర్పరుచుకుంటాయి.
పరిష్కారం: నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే దరఖాస్తు చేయండి. ముందస్తు అరుప్రూవ్‌డ్ ఆఫర్లను పరిశీలించండి.
తప్పు 4: మీ క్రెడిట్ నివేదికను ఎప్పుడూ తనిఖీ చేయకపోవడం
కొన్ని సందర్భాల్లో ఇప్పటికే ముగిసిన లోన్‌లు, చెల్లించిన బకాయిలు ఇంకా పెండింగ్‌గా కనిపించవచ్చు.
పరిష్కారం: సంవత్సరానికి ఒకసారి CIBIL లేదా CRIF సైట్‌లో మీ పూర్తి క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేయండి. లోపాలైతే తక్షణమే dispute చేయండి.
తప్పు 5: పాత క్రెడిట్ కార్డును మూసివేయడం
మీకు చాలా సంవత్సరాలుగా ఉన్న పాత కార్డును మూసివేస్తే మీ క్రెడిట్ హిస్టరీ పొడవు తగ్గిపోతుంది. ఇది కూడా స్కోర్‌ను తగ్గిస్తుంది.
పరిష్కారం: ఆ కార్డ్‌పై వార్షిక ఛార్జీలు లేకపోతే, దానిని యాక్టివ్‌గా ఉంచండి. అవసరమైతే దానిని బేసిక్ వెర్షన్ కు మార్చుకోండి.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications