2020లో ఈ చిన్న స్టాక్స్ 600% వరకు రిటర్న్స్ ఇచ్చాయి

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది ఇన్వెస్టర్ల లాభాలు రోలర్ కోస్టర్‌ను తలపించాయని చెప్పవచ్చు. అనుకోని విధంగా కరోనా కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో భారీగా పతనమయ్యాయి మార్కెట్లు. అలాగే, ఊహించని విధంగా ఏడాది ముగిసే సమయానికి మార్కెట్లు ఝూమ్మని ఎగిశాయి. 2020లో పలు స్టాక్స్ భారీ రిటర్న్స్ అందించాయి. ఈ ఏడాది 200 శాతానికి పైగా లాభాలు అందించిన కొన్ని స్టాక్స్ ఉన్నాయి. 2019 చివరి నాటికి రూ.100 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉండి, రూ.25కు తక్కువ ట్రేడింగ్ అయిన షేర్లు ఇలా ఉన్నాయి..

600 శాతం వరకు జంప్

600 శాతం వరకు జంప్

- అలోక్ ఇండస్ట్రీస్ 2020 క్యాలెండర్ ఇయర్‌లో 602 శాతం లాభపడింది. డిసెంబర్ 31, 2019న రూ.3.04 గా ఉన్న ఈ స్టాక్ డిసెంబర్ 29, 2020న రూ.21.30కి చేరుకుంది.

- సుబెక్స్ స్టాక్ ఈ ఏడాది 403 శాతం లాభపడింది. డిసెంబర్ 29, 2019న రూ.5.90గా ఉన్న ఈ స్టాక్ డిసెంబర్ 24, 2020న రూ.29.70కి చేరుకుంది.

- కోర్దా కన్‌స్ట్రక్షన్స్ 2020 క్యాలెండర్ ఇయర్‌లో 376 శాతం లాభపడింది. డిసెంబర్ 31, 2019న రూ.23.74 గా ఉన్న ఈ స్టాక్ డిసెంబర్ 24, 2020న రూ.113.10కి చేరుకుంది.

ఈ స్టాక్స్ 300 శాతం జంప్

ఈ స్టాక్స్ 300 శాతం జంప్

- కెల్టాన్ టెక్ సొల్యూషన్స్ 2020 క్యాలెండర్ ఇయర్‌లో 301 శాతం లాభపడింది. డిసెంబర్ 31, 2019న రూ.18.05 గా ఉన్న ఈ స్టాక్ డిసెంబర్ 29, 2020న రూ.72.40కి చేరుకుంది.

- సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ స్టాక్ ఈ ఏడాది 299 శాతం లాభపడింది. డిసెంబర్ 31, 2019న రూ.10.82 గా ఉన్న ఈ స్టాక్ డిసెంబర్ 24, 2020న రూ.43.20కి చేరుకుంది.

- రతన్‌ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ 2020 క్యాలెండర్ ఇయర్‌లో 253 శాతం లాభపడింది. డిసెంబర్ 31, 2019న రూ.1.87 గా ఉన్న ఈ స్టాక్ డిసెంబర్ 29, 2020న రూ.6.61కి చేరుకుంది.

100 శాతానికి పైగా రిటర్న్స్

100 శాతానికి పైగా రిటర్న్స్

- మార్క్‌శాన్స్ ఫార్మా స్టాక్ 2020 క్యాలెండర్ ఇయర్‌లో 58.05 శాతం లాభపడింది. డిసెంబర్ 31, 2019న రూ.16.71 గా ఉన్న ఈ స్టాక్ డిసెంబర్ 24, 2020న రూ.58.05.30కి చేరుకుంది.

-టాటా టెలీ సర్వీసెస్ ఈ ఏడాది 237 శాతం లాభపడింది. డిసెంబర్ 31, 2019న రూ.2.25 గా ఉన్న ఈ స్టాక్ డిసెంబర్ 24, 2020న రూ.7.59కి చేరుకుంది.

- బాంబే రేయాన్ ఫ్యాషన్స్ 2020 క్యాలెండర్ ఇయర్‌లో 220 శాతం లాభపడింది. డిసెంబర్ 31, 2019న రూ.4.20 గా ఉన్న ఈ స్టాక్ డిసెంబర్ 24, 2020న రూ.13.44కి చేరుకుంది.

- జైప్రకాశ్ అసోసియేట్స్ ఈ ఏడాది 214 శాతం లాభపడింది. డిసెంబర్ 31, 2019న రూ.1.96 గా ఉన్న ఈ స్టాక్ డిసెంబర్ 24, 2020న రూ.6.16కి చేరుకుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+