SBI: హోం లోన్ తీసుకునేవారికి ఎస్బీఐ అద్భుతమైన అవకాశం.. అలా చేస్తే చెల్లించాల్సిన వడ్డీ తగ్గుతుంది..!
సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇల్లు కోసం రూపాయి రూపాయి కూడబెడతారు. దానితో పాటు గృహ రుణం కూడా తీసుకుంటారు. అయితే హోం లోన్ అనేది దీర్ఘకాల లోన్ అనేది గుర్తుంచుకోవాలి. సంవత్సరాల పాటు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. అందుకే హోం లోన్ తీసుకునేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకే హోం లోన్ ఉంటుందో అక్కడే తీసుకోవాలి. దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఇండియా కూడా తక్కువ వడ్డీ హోం లోన్లు ఇస్తోంది. ఈ బ్యాంకులో హోం లోన్ వడ్డీ 7.75 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. వినియోగదారులు అవసరాలకు అనుగుణంగా ఎస్బీఐ ఒక హోం లోన్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఎలా ఉపయోగపడుతుందంటే.
ఉదాహరణకు రాజు వ్యక్తి హైదరాబాద్ లో ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నాడు. రూ.90 లక్షలకు ఇల్లు కొనుగోలుకు సిద్ధమయ్యాడు. అయితే అతని వద్ద రూ.40 లక్షలు ఉన్నాయి. మిగతా డబ్బు కోసం ఇంటి వద్ద ఉన్న భూమి అమ్ముదామని అనుకున్నాడు. అయితే ఎమర్జెన్సీ కాబట్టి ఈ భూమి కొనుగోలు చేసేవారు తక్కువ ధరకే అడిగారు. దీంతో రాజు మిగతా రూ.50 లక్షలు హోం లోన్ తీసుకున్నాడు. సంవత్సరం తర్వాత ఆయన తన భూమిలోని కొంత భాగాన్ని విక్రయించాడు. అప్పుడు అతనికి రూ.50 లక్షలు వచ్చాయి. ఇందులో రూ.40 లక్షలు తన కుమార్తె పెళ్లికి ఉపయోగించాడు. మిగతా రూ.10 లక్షలు హోంలోన్ కట్టేద్దామని అనుకున్నాడు.

అయితే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎలా అని ఆగడు. అయితే ఇలాంటి వారి కోసమే ఎస్‌బీఐ మ్యాక్స్ గెయిన్ హోమ్ లోన్ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం సాధారణ గృహ రుణం వలే కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక కరెంట్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాగా పని చేస్తుందని ఎస్బీఐ బ్యాంకు అధికారులు చెబుతున్నారు. మీ హోమ్ లోన్ ఔట్ స్టాండింగ్ అసలు నుంచి మీరు ఓడీ ఖాతాలో జమ చేసిన అదనపు పొదుపు మొత్తాన్ని మినహాయించి, మిగిలిన నిధులపై మాత్రమే రోజువారీ ప్రాతిపదికన వడ్డీని లెక్కించేలా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఒక వేళ్ల ఓ వ్యక్తి ఎస్‌బీఐ మ్యాక్స్ గెయిన్ ఓడీ ద్వారా రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే దీనికి ఒక ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాను లింక్ చేస్తారని అధికారులు వివరించారు.
అందులో మీరు చెల్లించే ఈఎంఐ కన్నా ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు జమ చేయవచ్చు. పెద్ద మొత్తలో డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు రూ.50 లక్షల గృహ రుణం తీసుకున్నారు. రెండు, మూడు నెలలు ఈఎంఐ కట్టిన తర్వాత మీ చేతికి రూ.10 లక్షలు వచ్చాయి. అప్పుడు మీరు ఈ డబ్బును ఓడీ ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు. అప్పుడు మీకు వడ్డీ రూ.40 లక్షలకే లెక్కిస్తారు. మీరు ఓడీలో మూడేళ్లపాటు రూ.10 లక్షలు ఉంచారనుకుంటే.. ఆ మూడేళ్లు రూ.40 లక్షలకే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడైనా ఆ రూ.10 లక్షలను తిరిగి తీసుకోవచ్చు. రాజు లాంటి కేసులో ఈ ఎస్‌బీఐ మ్యాక్స్ గెయిన్ హోమ్ లోన్ పథకం ఉపయోగపడుతుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
