SBI Monthly Income Scheme: ఎస్బీఐలో అదిరిపోయే పథకం.. ఇలా చేస్తే నెలకు రూ. 5,875 మీ ఖాతాలోకి..!

కచ్చితమైన రాబడి నెలనెలా రావాలనుకుంటున్నారా. అలాంటి వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (Monthly Income Scheme) తీసుకొచ్చింది. ఇది సాధారణంగా ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) లాంటిదే. ఇందులో మీరు ఒకేసారి కొంత మొత్తాన్ని (lumpsum) పెట్టుబడి పెట్టాలి. బ్యాంక్ ఆ వడ్డీని ప్రతి నెలా మీ సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తుంది. ఎస్బీఐ బ్రాంచ్ లో సంప్రదిస్తే ఈ పథకంలో ఎలా పెట్టుబడి పెట్టాలో వివరిస్తారు. ఈ పథకంలో కనిష్ట డిపాజిట్ రూ. 1,000 ఉండగా.. గరిష్ట డిపాజిట్ మొత్తానికి ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. 1 నుంచి 2 సంవత్సరాలకు సాధారణ పౌరులకు అయితే 6.25 శాతం వడ్డీ చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీ చెల్లిస్తారు.

2 నుంచి 3 సంవత్సరాలకు సాధారణ పౌరులకు 6.40 శాతం, సీనియర్ సిటిజన్లుక 6.90 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 3 నుంచి 5 సంవత్సరాలకు సాధారణ పౌరులకు 6.30 శాతం వడ్డీ చెల్లిస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు 6.80 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. 5 నుంచి 10 సంవత్సరాలకు సాధారణ పౌరులకు 6.05 శాతం వడ్డీ చెల్లిస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం వడ్డీ చెల్లిస్తోంది. రూ.1,00,000 పెట్టుబడికి సాధారణ పౌరులకు నెలకు రూ.533 వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్లకు నెలకు రూ.588 వడ్డీ చెల్లిస్తారు. రూ.5,00,000 పెట్టుబడిపై సాధారణ పౌరులకు రూ.2,667 చెల్లిస్తుండుగా.. సీనియర్ సిటిజన్లకు నెలకు రూ.2,938 చెల్లిస్తారు.

SBI

రూ.10,00,000 పెట్టుబడిపై సాధారణ ప్రజలకు నెలకు రూ.5,333 రాగా.. సీనియర్ సిటిజన్లకు రూ. 5,875 వస్తాయి. 15,00,000 లకు సాధారణ పౌరులకు రూ.8,000, సీనియర్ సిటిజన్లకు రూ. 8,813 చెల్లిస్తారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే ఇంటి నుంచి డిపాజిట్ పని పూర్తి చేయవచ్చు. మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఉపయోగించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా SBIలో లాగిన్ అవ్వండి. ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) విభాగానికి వెళ్లండి. ప్రతి నెలా వడ్డీని పొందడానికి 'మంత్లీ ఇంట్రెస్ట్ పేఅవుట్' (Monthly Interest Payout) ఎంపికను ఎంచుకోండి. డిపాజిట్ మొత్తం, కాలపరిమితి (FD వ్యవధి) మరియు చెల్లింపు వివరాలను నమోదు చేయండి.

వివరాలను సరిచూసుకుని, FD అభ్యర్థనను నిర్ధారించండి. ఒకసారి FD సృష్టించబడిన తర్వాత, నెలవారీ వడ్డీ మీ లింక్ చేయబడిన సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. కాలపరిమితి ముగిసినప్పుడు (maturity), FD నిబంధనల ప్రకారం మీ అసలు పెట్టుబడి మొత్తం తిరిగి ఇస్తారు. పదవీ విరమణ చేసిన వారు, క్రమం తప్పని నెలవారీ ఆదాయం అవసరమైన వారు, తక్కువ రిస్క్‌తో కూడిన రాబడిని కోరుకునే పెట్టుబడిదారులు ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. DICGC ఇన్సూరెన్స్ ప్రతి డిపాజిటర్‌కు, ప్రతి బ్యాంకులో ₹5 లక్షల వరకు వర్తిస్తుంది. బ్యాంక్ FD నుండి వచ్చే వడ్డీ "ఇతర వనరుల నుండి ఆదాయం" కింద పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను వర్తిస్తుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+