RBI: హోం లోన్లు తీసుకున్న వారికి అలర్ట్.. ఇక మీ EMI తగ్గొచ్చు లేదా పెరగొచ్చు..\!
గృహ రుణాలు సంబంధంచి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. రుణాల వడ్డీ రేట్ల రీసెట్ డ్రాఫ్ట్ ఫ్రేమ్‌వర్క్ ను ప్రకటించింది. హోం లోన్లుకు సంబంధించి కీలక ప్రతిపాదనలను విడుదల చేసింది. సాధారణంగా EMI భారం మారాలంటే ఏడాది సమయం పడుతుంటుందని.. కానీ ఇకపై ఈ మార్పులను 3 నెలలకే పరిమితం చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ కొత్త ప్రతిపాదనలపై సెప్టెంబర్ 11, 2026 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను కోరనుంది.
ఒకవేళ ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే.. ఏప్రిల్ 1, 2027 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం ఫ్లోటింగ్ రేట్ తో రుణాలు తీసుకున్న వారు వడ్డీ రేటు ఒక బెంచ్‌మార్క్‌కు లింక్ అయి ఉంటుంది. అయితే ఆర్బీఐ ప్రతిపాదించిన ఈ కొత్త విధానం ప్రకారం బ్యాంకులు ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను రీసెట్ చేయాల్సి ఉంటుంది. అంటే మార్కెట్‌లో వడ్డీ రేట్లు తగ్గినా లేదా పెరిగినా ఆ ప్రభావం లోన్ చెల్లింపులు చేసేవారిపై చాలా వేగంగా పడనుంది. దీనివల్ల వడ్డీ రేట్లు తగ్గితే లోన్ తీసుకున్న వారికి వెంటనే వడ్డీల భారం తగ్గనుంది. ఒకవేళ పెరిగితే వడ్డీ భారం కూడా అంతే స్పీడుగా వడ్డీ భారం పడనుంది.
సాధారణంగా బ్యాంకులు ఆర్బీఐ వడ్డీ రేట్లను సవరించినప్పుడు ఈ వడ్డీ రేట్లు మారతుంటాయి. కానీ, అన్ని బ్యాంకులు ఒకేసారి వడ్డీ రేట్లను మార్చవు. కొన్నిసార్లు ఏడాది వరకు సమయం తీసుకుంటాయి. ఇలా చేయడం వల్ల రుణ గ్రహితలు నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆర్బీఐ ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. కొత్త ప్రతిపాదన వల్ల వడ్డీ తగ్గుతుందని అర్థం కాదని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ మార్పులకు అనుగుణంగా వడ్డీ రేట్లు త్వరగా సర్దుబాటు అయ్యేందుకు ఆర్బీఐ ఈ నిబంధనలు తీసుకురానుంది. ఉదాహరణకు ఒక రుణంపై 8.5 శాతం వడ్డీ ఉన్నప్పుడు వడ్డీ రేటు తగ్గితే.. 3 నెలల వ్యవధిలోనే ఆ రేటు తగ్గి ఈఎంఐ భారం తగ్గనుంది.

అయితే వడ్డీ రేట్లు పెరిగితే మూడు నెలల్లోనే మీరు చెల్లించే ఈఎంఐ భారం పెరుగుతుంది. ఆర్బీఐ ప్రతిపాదన ప్రకారం.. ప్రస్తుత లోన్లను కొత్త విధానంలోకి మార్చుకోవడానికి ఏప్రిల్ 1, 2029 వరకు అవకాశం ఉంది. అంతేకాకుండా ఇలా మారడానికి దరఖాస్తుదారుడి నుంచి బ్యాంకుల అనుమతి తీసుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. రిజర్వు బ్యాంక్ తీసుకొస్తున్న కొత్త రూల్స్ ఎక్కువగా ఫ్లోటింగ్ రేట్ లోన్లకే వర్తించనున్నాయి. చాలా వరకు పర్సనల్, ఆటో లోన్లు ఫిక్స్‌డ్ రేటుతో ఉంటాయి కాబట్టి.. వాటిపై ఈ మార్పుల ప్రభావం ఉండదు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications