Post Office MIS: నెలనెలా వడ్డీ వచ్చే పోస్టాఫీస్ పథకం ఇదే..!

డబ్బు సంపాదించడమే కాదు. దానిని ఎక్కడ ఎలా పెట్టుబడి పెట్టాలో కూడా తెలియాలి. అయితే చాలా మంది రిస్క్ లేకుండా ఉండే పథకాలలో పెట్టుబడి పెడతారు. ఆ పథకాల్లో కచ్చితమైన హామీతో కూడిన రాబడి వస్తుంది. అలాంటి వాటిలో పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం ఒకటి. స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావానికి లోనుకాకుండా స్థిరమైన రాబడిని అందిస్తుంది. అయితే, ఇందులో పెట్టుబడి పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కామ్ పథకంలో 7.4% వార్షిక వడ్డీని నెలవారీగా అందిస్తుంది. మీరు ఖాతా తెరిచినప్పుడు అమలులో ఉన్న రేటు, దాని మొత్తం 5 సంవత్సరాల కాలానికి స్థిరంగా ఉంటుంది.

ఈ పథకంలో కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సింగిల్-హోల్డర్ ఖాతా గరిష్టంగా రూ.9 లక్షల పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. ముగ్గురు పెద్దల వరకు ఉండగల జాయింట్ ఖాతాలో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. 7.4% వడ్డీ రేటుతో రూ.15 లక్షల ఉమ్మడి డిపాజిట్‌పై సంవత్సరానికి రూ.1,11,000 వస్తుంది. నెలకు రూ.9,250 లభిస్తాయి. ఐదేళ్లలో మొత్తం వడ్డీ రూ.5.55 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో అసలు తిరిగి చెల్లిస్తారు. ఈ పథకంలో ఐదేళ్లు లాగిన్ పీరియడ్ ఉంటుంది. ఖాతా ఐదేళ్ల తర్వాత మెచ్యూర్ అవుతుంది. మొదటి సంవత్సరంలో గడువుకు ముందే ఖాతాను మూసివేయడానికి అనుమతి లేదు.

Post Office

ఒక వేళ ఒక సంవత్సరం తర్వాత కానీ మూడు సంవత్సరాల లోపు కానీ ఖాతాను మూసివేస్తే, డిపాజిట్ నుంచి 2 శాతం కట్ చేస్తారు. మూడు సంవత్సరాల తర్వాత ఖాతా మూసివేస్తే కోత 1 శాతం ఉంటుంది. నెలవారీ వడ్డీని క్లెయిమ్ చేయకుండా వదిలేస్తే, దానిపై అదనపు వడ్డీ లభించదని గుర్తుంచుకోవాలి. డిపాజిట్ చేసే ముందు, మీ నెలవారీ ఆదాయ అవసరాలు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, దీర్ఘకాలిక లక్ష్యాలు, పన్ను బాధ్యత, మీరు అసలు మొత్తాన్ని ఐదు సంవత్సరాల పాటు నిలిపి ఉంచగలరా లేదా అనే విషయాలను అంచనా వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+