NPS: ఎన్పీఎస్ ఛార్జీలను సవరించిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), NPS లైట్ కింద ఉన్న అన్ని పథకాలకు సంబంధించి పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (PoP)కు వర్తించే ఛార్జీల విధానాన్ని సవరించింది. ఈ కొత్త ఛార్జీలు అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. సవరించిన ఫ్రేమ్‌వర్క్ ప్రకారం ఎన్పీఎస్ చందాదారులు ప్రతి PRANకు ఒకేసారి రూ. 200 ఆన్‌బోర్డింగ్ ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని సెంట్రల్ రికార్డ్‌కీపింగ్ ఏజెన్సీలు (CRAs) యూనిట్లను రద్దు చేయడం ద్వారా ప్రతి త్రైమాసికానికి రూ. 50 చొప్పున వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్‌బోర్డింగ్ పూర్తయిన త్రైమాసికం తర్వాతి నెలలో ఈ మొత్తాన్ని PoPకి చెల్లించాల్సి ఉంటుంది.

పూర్తిగా డిజిటల్, ఫేస్ టూ పేస్ ప్రక్రియ ద్వారా ఆన్‌బోర్డ్ చేయబడిన చందాదారులకు, PoP కోసం PFRDA నిర్ధారించిన ఛార్జీని బట్టి, రూ. 100 వరకు ఆన్‌బోర్డింగ్ ఛార్జీ తగ్గించవచ్చని పేర్కొంది. వార్షిక ఖర్చు కింద అనేది నిర్వహణలో ఉన్న ఆస్తులపై (AUM) 0.20 శాతం వార్షిక ఛార్జీ వసులు చేస్తారు. దీనిని NAV ద్వారా సర్దుబాటు చేసి, త్రైమాసిక ప్రాతిపదికన PoPలకు చెల్లిస్తారు. పని చేయని ఖాతాలు మినహా అన్ని పథకాలకు ఈ ఛార్జీ వర్తిస్తుంది. పని చేయని ఖాతాకు ఛార్జీ విధించబడదని PFRDA సర్క్యులర్ పేర్కొంది. ఒక సంవత్సరం కనీసం సొమ్మును ఎన్పీఎస్ ఖాతాలో జమ చేయకుంటే ఆ ఖాతా స్తంభించి పోతుంది.

NPS

ఉదాహరణకు రూ. 10 లక్షల AUM ఉన్న ఒక NPS ఖాతాకు సంవత్సరానికి రూ.2000 వార్షిక ఫీజును వసూలు చేస్తారు. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. ఈ ఛార్జీ NAV లో సర్దుబాటు చేస్తారు కాబట్టి, పెట్టుబడిదారులు దీనిని తమ బ్యాంకు ఖాతా నుండి ప్రత్యేక డెబిట్‌గా కాకపోవచ్చని చెబుతున్నారు. PFRDA తన డిజిటల్ ఛానెల్‌లను ఉపయోగించే పెట్టుబడిదారుల కోసం ఒక ముఖ్యమైన వ్యత్యాసాన్ని కూడా స్పష్టం చేసింది. e-NPS ద్వారా చేరి, ఆ తర్వాత e-NPS లేదా D-Remit ద్వారా విరాళాలు ఇచ్చే చందాదారులు PoP ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ప్రారంభంలో PoP ద్వారా చేరిన చందాదారులు, ఆ తర్వాత e-NPS లేదా D-Remit ద్వారా విరాళాలు ఇచ్చినా కూడా, నిర్దేశించిన PoP ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

సవరించిన ఛార్జీలను తమ వెబ్‌సైట్‌లలో బహిరంగంగా ప్రదర్శించాలని, అలాగే డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ సమయంలో చందాదారులకు వాటిని స్పష్టంగా వెల్లడించాలని రెగ్యులేటర్ PoPలను ఆదేశించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం (Q3) నుంచి ఛార్జీల తగ్గింపు కోసం సవరించిన విధానాన్ని CRAలు అమలు చేస్తాయని PFRDA తెలిపింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+