NPS Swasthya: NPSతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా.. అక్టోబర్ 1 నుంచి ప్రారంభం..!
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పదవీ విరమణ పొదుపు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను మిళితం చేసే ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. 'ఎన్పీఎస్ స్వస్థ్య' (NPS Swasthya) అనే పేరుతో పథకం తీసుకొచ్చింది. అర్హులైన ఎన్పీఎస్ చందాదారులు ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకోవడంతో పాటు 'సూపర్ టాప్-అప్' ఆరోగ్య బీమా పాలసీని కూడా పొందవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ 1, 2026న (NPS దివస్ సందర్భంగా) ఎన్పీఎస్ స్వస్థ్యను ప్రారంభించే అవకాశం ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) సెప్టెంబర్ 18న ఎన్పీఎస్ స్వస్థ్యకు సంబంధించిన నిర్వహణ మార్గదర్శకాలను జారీ చేసింది.
ఎన్పీఎస్ స్వస్థ్య అనేది పదవీ విరమణ పొదుపుతో పాటు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందించడానికి రూపొందించన ఒక కొత్త పథకం. ఇందులో రెండు భాగాలు ఉంటాయి. ఒక ప్రత్యేక NPS స్వస్థ్య పెట్టుబడి ఖాతా (ఇందులో మీ చందాలు పెట్టుబడి పెట్టబడతాయి). రెండోది తప్పనిసరి 'సూపర్ టాప్-అప్' ఆరోగ్య బీమా పాలసీ. వర్తించే వార్షిక 'డిడక్టబుల్' (బీమా చెల్లింపు ప్రారంభమయ్యే ముందు పాలసీదారు భరించాల్సిన ఖర్చు) పరిమితిని దాటిన తర్వాత, అర్హత కలిగిన వైద్య ఖర్చులను ఈ సూపర్ టాప్-అప్ బీమా కవర్ చేస్తుంది. దీనికి అదనంగా పథకం ఉపసంహరణ నిబంధనలకు లోబడి, చందాదారులు తమ ఎన్పీఎస్ స్వస్థ్య నిధిని కూడా అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు.

ఎన్పీఎస్ లో చేరడానికి అర్హత ఉన్న ఏ వ్యక్తి అయినా, పథకం నిబంధనలకు లోబడి ఎన్పీఎస్ స్వస్థ్యలో నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రామాణిక ఆరోగ్య బీమా, ఒకే 'ఫ్యామిలీ ఫ్లోటర్' పాలసీ కింద చందాదారు, జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లల వరకు (ఆధారపడిన వారిని) కవర్ చేస్తుంది. ఇందులో తల్లిదండ్రులకు కవరేజీ ఉండదు. బీమా కోసం చేరే వయస్సు 18 నుంచి 70 సంవత్సరాలు ఉండాలి.
మొదటి సంవత్సరం ఆరోగ్య బీమా ప్రీమియంతో పాటు రూ. 200 వార్షిక నిర్వహణ రుసుము చెల్లించాలి. NPS స్వస్థ్య పెట్టుబడి ఖాతా కోసం కనీసం రూ.1,000. తదుపరి చెల్లించాల్సిన కనీస మొత్తం రూ.10గా ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మాత్రం వయసు ఆధారంగా బీమా సంస్థ బట్టి మారుతుంది.
ఈ పాలసీలో భాగంగా నాలుగు రకాల డిడెక్టిబుల్, సమ్-ఇన్ష్యూర్డ్ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 10,000 డిడెక్టిబుల్‌కు రూ. 1 లక్ష కవర్, రూ. 50,000 డిడెక్టిబుల్‌కు రూ. 5 లక్షల కవర్, రూ. 1 లక్ష డిడెక్టిబుల్‌కు రూ. 10 లక్షల కవర్, రూ. 3 లక్షల డిడెక్టిబుల్‌కు రూ. 30 లక్షల కవర్ లభిస్తాయి. డిడెక్టిబుల్ అంటే బీమా వర్తించడానికి ముందు కస్టమర్ స్వయంగా చెల్లించాల్సిన ప్రారంభ మొత్తమని అర్థం. ఒకవేళ వైద్య ఖర్చులు వస్తే తమ ఎన్‌పీఎస్ స్వాస్థ్య ఖాతా నుంచి పాక్షిక విత్‌డ్రాయల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ ఉపసంహరణ పరిమితి ఖాతాదారుడి మొత్తం కాంట్రిబ్యూషన్‌లో 25 శాతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Click it and Unblock the Notifications