మనమందరం చిన్నప్పటి నుంచీ ఒక విషయాన్ని నమ్ముతూ పెరిగాం బంగారాన్ని లాకర్‌లో పెడితే అది పూర్తిగా భద్రంగా ఉంటుందని. బ్యాంకుల్లో లాకర్ తీసుకోవడం అంటే గర్వంగా అనిపించే వ్యవహారంగా భావించేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ భద్రత కూడా ప్రశ్నార్థకం అవుతోంది.
ఇటీవల చాలామంది పెట్టుబడిదారులు మరియు ఆర్థిక నిపుణులు ఇదే చెబుతున్నారు "బంగారం లాకర్‌లో నిద్రపోవడం కాదు, పని చేయాలి.

లాకర్‌లో ఉన్న బంగారానికి నిజంగా భద్రత ఉందా?
భవిష్యత్తు కాలంలో ఏదో ప్రమాదం జరుగుతుంది అని, బ్యాంక్ లాకర్‌లో ఉన్న ఆభరణాలకి రక్షణ కలుగుతుందనే అభిప్రాయం ఉంది. కానీ నెమ్మదిగా ఇది ఒక అపోహగా మారుతోంది. ఎందుకంటే బ్యాంక్ లాకర్లు బంగారం కోల్పోతే పూర్తిగా బాధ్యత వహించవు. చాలా లాకర్లకు ఇన్సూరెన్స్ కవరేజ్ పరిమితంగానే ఉంటుంది. నీటి ముంపు, అగ్నిప్రమాదం, చోరీ వంటి అనుకోని ప్రమాదాలన్నీ అన్ని స్థాయుల్లో భయాందోళన కలిగించాయి
ఇటీవల ఒక నగరంలో వచ్చిన వరదలతో, బ్యాంక్ లోని కొన్ని లాకర్లు నానిపోయి, అందులో ఉన్న ఆభరణాల విలువ కోల్పోయిన సంఘటనలు వెలుగుచూశాయి. దీనితో "బ్యాంక్ లాకర్ అంటే ఎప్పుడూ సేఫ్" అన్న భావనకు పెద్ద దెబ్బ తగిలింది. చాలా మంది తమ బంగారం కోసం లాకర్‌ని అంతిమ సురక్షిత గదిగా భావించడంతో, నిజానికి అందులో అసలు భద్రత చాలా తక్కువ.
ఇటీవల ఆర్థిక నిపుణుడు లవిష్ ఆనంద్ ఇచ్చిన సూచనల ప్రకారం, లాకర్‌లో ఉండే బంగారాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ (GMS) ద్వారా ఉపయోగించుకోవడం మరింత లాభదాయకమని స్పష్టం చేశారు.
"ఇది మీ బంగారాన్ని అమ్మేసే స్కీమ్ కాదు. దీని ముఖ్య ఉద్దేశ్యం మీ బంగారం సురక్షితంగా ఉండేలా, అలాగే మీకు కొంత ఆదాయం వచ్చేట్టు పని చేయించడమే" అని ఆయన వివరించారు. ఈ స్కీమ్‌లో మీరు వాడకుండా ఉన్న బంగారాన్ని అథరైజ్డ్ బ్యాంకుల్లో 5 నుంచి 15 ఏళ్ల కాలపరిమితికి డిపాజిట్ చేయవచ్చు. ష్యూరిటీ పరీక్షించిన తర్వాత సరైన బరువు నమోదు చేసి, మీరు పెట్టిన బంగారానికి అనుగుణంగా 2.25% నుంచి 2.5% వరకు వార్షిక వడ్డీ లభిస్తుంది మరియు మూడు నుండి ఐదు సంవత్సరాలు లాక్-ఇన్ పీరియడ్ కూడా ఉంటుంది," అన్నారు ఆనంద్. "కానీ నిజంగా చాలామంది కుటుంబాలు ఆ బంగారాన్ని తరచూ వాడే సూచన లేదు.
ఇది భయపెట్టే విషయం కాదు," అంటూ ఆనంద్ ప్రకటించారు. "ఇది అవగాహన విషయం. దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాల్లో వారసత్వ బంగారం నిరుపయోగంగా మిగిలిపోతుంది. గోల్డ్ మోనిటైసేషన్ స్కీమ్ ద్వార దీనిని రక్షించుకోవచ్చు, భద్రత కల్పించవచ్చు, విలువ పెరుగుతుంది.
RBI మార్గదర్శకాలు ప్రకారం, లాకర్‌లో ఉన్న ఆస్తులపై బ్యాంక్‌కు పూర్తి బాధ్యత ఉండదు. బ్యాంక్ కేవలం లాకర్‌ను అద్దెకు ఇచ్చే సేవ మాత్రమే అందిస్తుంది. అందులో ఏముంటుందో, ఎంత విలువ ఉందో బ్యాంక్‌కి తెలియదు. ఇన్సూరెన్స్ లేదంటే రికవరీ లేదు. మీరు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ చేయించుకోకుండా ఉంటే, బ్యాంక్ దొంగతనానికి సంబంధించి గరిష్టంగా రూ. 3 లక్షల వరకు మాత్రమే పరిహారం చెల్లిస్తుంది. అది కూడా నిర్ధారిత ప్రమాణాల ప్రకారం మాత్రమే.
ఐదు లక్షల రూపాయల వరకు ఉన్న డిపాజిట్లకు మాత్రమే భద్రత ఉంటుంది. ఇది డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (DICGC)లో భాగంగా ఉంటుంది. కానీ RBI తాజా మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు 2022 నుంచి బ్యాంకులు తమ అలసత్వం వలన జరిగే నష్టానికి కొంతవరకు బాధ్యత వహించాలి అని RBI పేర్కొంది. అయినా, ఇది పూర్తి బంగారం విలువకే కాదు అతి ఎక్కువగా రూ. 3 లక్షలు వరకు మాత్రమే పరిహారం ఉంటుంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications