LIC: ఎల్ఐసీ నుంచి అదిరిపోయే మూడు కొత్త పాలసీలు.. !
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అక్టోబర్ 19, 2026న మూడు కొత్త బీమా ఉత్పత్తులను ప్రారంభించనుంది. ఈ కొత్త ఆఫర్లలో డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్, ఆరోగ్య బీమా ప్లాన్, క్యాన్సర్ కవర్ పాలసీ ఉన్నాయి. ఈ పాలసీలు అక్టోబర్ 19, 2026 నుంచి దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంటాయని ఎల్ఐసీ తెలిపింది. ఆ మూడు పాలసీల్లో న్యూ జీవన్ ధార - II, హెల్త్ షీల్డ్, న్యూ క్యాన్సర్ కవర్ ఉన్నాయి. ఈ కొత్త ప్లాన్లు నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ కేటగిరీల కిందకు వస్తాయి. న్యూ జీవన్ ధార - II ఒక పొదుపు, డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ కాగా, హెల్త్ షీల్డ్, న్యూ క్యాన్సర్ కవర్ అనేవి ప్యూర్ రిస్క్ ప్లాన్లుగా ఎల్ఐసీ పేర్కొంది.
న్యూ జీవన్ ధారా-2 పాలసీ అనేది వ్యక్తిగత పొదుపు, డిఫర్డ్ యాన్యుటీ (పింఛను) పథకం. పదవీ విరమణ తర్వాత కచ్చితమైన హామీ కూడిన ఆదాయం కావాలనుకునే వారు ఈ పాలసీ తీసుకొచ్చని ఎల్ఐసీ తెలిపింది. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, భవిష్యత్తు ఆదాయానికి ప్రణాళిక వేసుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. హెల్త్ షీల్డ్ పాలసీని కుటుంబ ఆరోగ్య సంరక్షణ అవసరాలు దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చారు. ల ఈ పాలసీని తీసుకొచ్చింది. పాలసీ కాల వ్యవధి, మొత్తం ప్రీమియాలు స్థిరంగా ఉంటాయి. ఆసుపత్రిలో చేరినప్పుడు రోజువారీ నగదు ప్రయోజనం లభిస్తుంది.

న్యూ క్యాన్సర్ కవర్ పాలసీ అనేది నిర్ణీత క్యాన్సర్లు నిర్థారణ అయినప్పుడు.. వాస్తవ చికిత్స ఖర్చుతో సంబంధం లేకుండా పాలసీ విలువను చెల్లిచ్చే పాలసీ. ఈ పథకంలో రూ.15-35 లక్షల వరకు పాలసీ తీసుకోవచ్చని ఎల్ఐసీ పేర్కొంది. ఇప్పటికే ఉన్న క్యాన్సర్ పాలసీలతో కలిపి, గరిష్ఠ బీమా మొత్తం రూ.50 లక్షల పరిమితి ఉంటుందని తెలిపింది. పాలసీలు తీసుకునే ముందు అన్ని నిబంధనలు సరిగా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఏజెంట్లు తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని.. అందుకే పాలసీ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications