PM Mudra Yojana: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. మరో ఐదేళ్ల పాటు ముద్ర రుణాలు..!
ప్రధానమంత్రి ముద్రా యోజన కింద సూక్ష్మ యూనిట్ల కోసం ఉద్దేశించిన రుణ హామీ నిధిని 31 మార్చి 2031 వరకు ఐదేళ్ల కాలానికి కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీఎం ముద్రా పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రుణ సంస్థలు 43.34 లక్షల కోట్ల రూపాయల విలువైన 60.36 కోట్లకు పైగా రుణాలను మంజూరు అయ్యాయి. ఐదు వేల కోట్ల రూపాయల కేటాయింపునకు ఆమోదం లభించిందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇది 12.60 లక్షల కోట్ల రూపాయల విలువైన ముద్రా రుణాలకు మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
స్టాండ్-అప్ ఇండియా పథకాన్ని 31 మార్చి 2031 వరకు ఐదేళ్ల కాలానికి కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారిలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, ఐదేళ్ల వ్యవధిలో అదనంగా 2.5 లక్షల మంది పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం లక్ష్యం. ఏప్రిల్ 2016లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ పథకం 2.75 లక్షలకు పైగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రుణాలను అందించింది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఈ పథకం పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలకు హామీ ఇస్తుందని వైష్ణవ్ పేర్కొన్నారు.

రుణ హామీ కోసం నాలుగు వేల 111 కోట్ల రూపాయల నిధితో ఈ పథకం కాలపరిమితి నాలుగు సంవత్సరాలు ఉంటుందని ఆయన చెప్పారు. నోయిడా మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా దాదాపు 8.5 కిలోమీటర్ల మేర విస్తరించి, ఐదు ఎలివేటెడ్ స్టేషన్లను కలిగి ఉన్న ఆక్వా లైన్ మెట్రో రైల్ కారిడార్‌ను నోయిడా సెక్టార్-51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్-04 వరకు పొడిగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కారిడార్ కార్యరూపం దాల్చిన తర్వాత, నోయిడా, గ్రేటర్ నోయిడాలో సుమారు 72 కిలోమీటర్ల క్రియాశీల మెట్రో రైల్ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుంది. కాగా ముద్ర యోజన కింద రాబోయే ఐదేళ్లల్లో రూ.1.26 లక్షల కోట్ల ముద్రా విలువైన రుణాలను మంజూరు చేసే అవకాశం ఉంది.
చిన్న వ్యాపారుకుల దీని వల్ల లబ్ధి పొందనున్నారు. వారికి రుణాలు సులువుగా అందించేందుకు ఇది ఉపయోగపడనుంది. కేంద్రం రూ.5 వేల కోట్ల నిధి ఏర్పాటు చేయడం ద్వారా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలకు నష్టం భయం తగ్గుతుంది. దీని వల్ల రుణాలు వేగంగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. ముద్ర యోజనలో కేటరిగిలు ఉంటాయి. శిశు, కిశోర్, తరుణ్ కేటగిరీలుగా విభజించారు. శిశు కేటగిరీ కింద రూ.50 వేల వరకు, కిశోర్ కేటగిరీ కింద రూ.5 లక్షల వరకు, తరుణ్ కేటగిరీ కింద రూ.10 లక్షల వరకు రుణం ఇస్తారు. కిరాణా దుకాణాలు, చిన్న తయారీ యూనిట్లు, సేవా రంగం, చేతివృత్తులవారు, వీధి వ్యాపారులు వంటి చిన్న వ్యాపారులకు రుణాలు తీసుకోవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications