SBI Amrit Vrishti: ఎస్బీఐ బ్యాంకులో అదిరిపోయే పథకం.. 14 నెలలకు కచ్చితమైన రాబడి..!
సంపాదించిన డబ్బును పొదువు చేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టపడిన రూపాయి నష్టపోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తారు. అయితే ఎలాంటి రిస్క్ లేకుండా కచ్చితమైన రాబడి ఇచ్చే పతకాల్లోనే పెట్టుబడి పెడతారు. సురక్షితమైన, కచ్చితమైన రాబడి ఇచ్చే పథకాల్లో ముందుగా గుర్తొచ్చేది ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకమే. అయితే ఇందులో వడ్డీ రేటు తక్కువగా ఉంటుందని కానీ రాబడి మాత్రం కచ్చితంగా ఉంటుంది. అందుకే రిస్క్ లేకుండా ఉండేవారు ఇందులో పెట్టుబడి పెడతారు. ముఖ్యంగా వృద్ధులు ఎక్కువగా రిస్క్ తీసుకోలేరు. వార ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం సింపుల్ గా సరిపోతుంది.
అయితే సీనియర్ సిటిజన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పలు బ్యాంకులు అధిక వడ్డీని కూడా ఆఫర్ చేస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న అమృత్ వృష్టి అనే 444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో సాధారణ ఎఫ్‌డీలతో పోలిస్తే.. మంచి వడ్డీ రేటును పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ స్కీమ్‌లో కస్టమర్ వర్గాన్ని బట్టి వడ్డీ రేట్లు మారుతాయి. సాధారణ పౌరలకు 6.45 శాతం వడ్డీ చెల్లిస్తుండగా.. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు 6.95 శాతం, 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నారు.

సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ ఎఫ్‌డీ కాలపరిమితి 444 రోజులు అంటే దాదాప 14.5 నెలలు. అమృత్ వృష్టి ఎఫ్‌డీలో కనీసం రూ.1,000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడిదారులు తమ అవసరాన్ని బట్టి వడ్డీని నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధసంవత్సర ప్రాతిపదికన పొందే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అత్యవసర సమయంలో ఎఫ్‌డీపై లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉందని గుర్తు చేస్తున్నారు. అలాగే అవసరమైతే గడువు పూర్తికాకముందే ఎఫ్‌డీను క్లోజ్ చేసి డబ్బు తీసుకోవచ్చని వివరిస్తున్నారు.
ఈ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టడం కూడా చాలా ఎస్బీఐ పేర్కొంది. ఎస్‌బీఐ కస్టమర్లు యోనో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచ్ ద్వారా అమృత్ వృష్టి ఎఫ్‌డీను ప్రారంభించవచ్చని తెలిపింది. తక్కువ కాలంలో స్థిరమైన రాబడి పొందాలని భావించే వారికి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు, ఈ ఎఫ్‌డీ ఒక మంచి పెట్టుబడి ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. అయితే పెట్టుబడి పెట్టే ముందు SBIలో ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రేట్లు, నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది పేర్కొంటున్నారు. .
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
