తనలాంటి బిలియనీర్లపై పన్నులు పెంచాలని అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వాటిని చెల్లించేందుకు ఎలక్ట్రిక్ వెహికిల్ కంపెనీ టెస్లాలో తనకు ఉన్న పది శాతం వాటాను విక్రయించాలా, వద్దా అనే అంశంపై తనకు సలహా ఇవ్వాలని ఆ కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా ఓటింగ్ నిర్వహించారు. ఏదైనా కంపెనీలో షేర్ల వ్యాల్యూ పెరిగినప్పుడు వాటిని విక్రయించకపోయినా, సంబంధిత యజమానికి వచ్చిన అన్-రియలైజ్డ్ గెయిన్స్ పైన పన్ను విధించాలని కొంతమంది డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. పన్నుల నుండి తప్పించుకునేందుకు షేర్ల వ్యాల్యూ పెరిగినప్పటికీ, స్టాక్స్‌ను విక్రయించి లాభాలు స్వీకరించడం లేదనే వారు ఉన్నారు. ఇటీవల టెస్లా షేర్ల వ్యాల్యూ పెరిగి ఎలాన్ మస్క్ సంపద ఇటీవల 30 వేల కోట్ల డాలర్లకు చేరుకుంది. మన కరెన్సీలో రూ.22,50,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

10 శాతం విక్రయించాలని
పన్ను నుండి తప్పించుకోవడానికి షేర్ల వ్యాల్యూ పెరిగినప్పటికీ వాటిని విక్రయించి లాభాలు స్వీకరించడం లేదని ఆరోపిస్తున్నారని, కాబట్టి తాను టెస్లా స్టాక్‌లో 10 శాతం విక్రయించి లాభాలపై పన్ను చెల్లించమంటారా? దీనిని మీరు సమర్థిస్తారా అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. దీనిపై కొద్ది గంటల్లోనే అనూహ్య స్పందన వచ్చింది. సగానికి పైగా నెటిజన్లు షేర్లను విక్రయించాలని సూచిస్తూ ఓటు వేశారు. ఎలాన్ మస్క్ సంపద ప్రధానంగా టెస్లాలో ఉంది. ఆయన నగదు రూపంలో వేతనం తీసుకోకుండా స్టాక్ ఆప్షన్స్‌ను ఎంచుకుంటారు. అందుకే పన్నులు చెల్లించేందుకు ఈ షేర్లను విక్రయించాల్సి వస్తోందని ట్వీట్ చేశారు. నా వద్ద స్టాక్ మాత్రమే ఉందని, పన్నులు చెల్లించేందుకు విక్రయించాల్సిందే అని పేర్కొన్నారు. దీనికి నెటిజన్లు స్పందిస్తూ స్టాక్‌లో పది శాతం విక్రయించాలని సూచించారు.

స్టాక్ పతనం
ట్విట్టర్ పోల్‌లో ఎక్కువమంది ఈ స్టాక్స్‌ను విక్రయించాలని ఓటు వేయడంతో.. ఈ పోల్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే 21 బిలియన్ డాలర్ల స్టాక్స్ విక్రయించవలసి వస్తుంది. టెస్లా షేర్లను విక్రయించాలని నెటిజన్లు సూచించడంతో నేడు ఈ స్టాక్ 4.5 శాతం మేర నష్టపోయింది. టెస్లా 52 వారాల గరిష్టం 1,243.49 డాలర్లు, కనిష్టం 396.03 డాలర్లు.
ఎలాన్ నగదు రూపంలో వేతనం తీసుకోరు. కేవలం స్టాక్ ఆప్షన్స్ మాత్రమే స్వీకరించినందున రాయితీ ధరతో కూడిన స్టాక్సే ఆయన వేతనం. అలా ఆయన ఖాతాలో ఉన్న 22.86 మిలియన్ల టెస్లా స్టాక్ ఆప్షన్స్‌కు వచ్చే ఏడాది ఆగస్ట్ 13 నాటికి కాలం చెల్లుతుంది. ఆ లోగా ఆయన వాటిని ముందు నిర్ణయించిన 6.24 డాలర్లకు కొనుగోలు చేయాలి. వీటిపై వచ్చే ఆదాయాన్ని మూలధన లాభం కింద లెక్కగడతారు. దీనిపై మస్క్ పన్ను చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతం టెస్లా స్టాక్ ధర రూ.1222 డాలర్లుగా ఉంది. ఈ లెక్కన మస్క్‌కు భారీ లాభం వస్తుంది. దీంతో ఆయన పెద్ద మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 30 నాటికి టెస్లాలో 170.5 మిలియన్ల షేర్లు ఉన్నాయి. వీటిలో 10 శాతం విక్రయిస్తే ఆయనకు 21 బిలియన్ డాలర్లు సమకూరవచ్చు.
ఈ ఏడాది టెస్లా వాటాల వ్యాల్యూ భారీగా పెరిగింది. అక్టోబర్ నెలలో స్టాక్ ధర జీవితకాల గరిష్టాలకు చేరుకుంది. దీంతో మస్క్ సోదరుడు సహా టెస్లా బోర్డ్ సభ్యులు చాలామంది తమ వాటాలను విక్రయించారు. కానీ మస్క్ విక్రయించలేదు.

షేర్ నష్టపోవచ్చు...
ఎలాన్ మస్క్ తన షేర్లను విక్రయించాలని నిర్ణయించుకుంటే టెస్లా స్టాక్ మరింత పడిపోవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. టెస్లా స్టాక్స్ గత ఆరు నెలల కాలంలోనే రెండింతలు అయ్యాయి. నేడు టెస్లా స్టాక్ నాలుగు శాతం పడిపోయినప్పటికీ, విక్రయిస్తే మాత్రం మరింత పడిపోయే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications