For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరో 7 రోజులే మిగిలింది..! ఏప్రిల్ 10వ తేదీ నుండి ప్రీమియం భారీగా పెంపు

|

తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్ ఇన్సురెన్స్ పాలసీలు త్వరలో కాస్త ఖరీదు కానున్నాయి. పాలసీదారుడికి అనుకోని విధంగా ఏదైనా జరిగితే నామినీకి పెద్ద మొత్తం అందుతుంది. ఆర్థిక ప్రణాళికలో ప్రాధాన్యం కలిగిన ఈ పాలసీ ప్రీమియాన్ని పెంచాలని బీమా సంస్థలు నిర్ణయించాయి. ఈ పెంపును ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేయాలని తొలుత నిర్ణయించాయి. కానీ కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేశాయి సంస్థలు.

షాక్: అమెరికాలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఉడిపోయే అవకాశముందంటే? ఇండియన్స్ ఏమంటున్నారు?షాక్: అమెరికాలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఉడిపోయే అవకాశముందంటే? ఇండియన్స్ ఏమంటున్నారు?

40 శాతం వరకు పెంపు

40 శాతం వరకు పెంపు

టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలని భావించే వారికి ప్రస్తుత ప్రీమియం రేటు మరికొద్ది రోజులే అందుబాటులో ఉండనుంది. ఏప్రిల్ 10వ తేదీన ఈ ప్రీమియం రేటు పెరగనున్నాయి. ఇన్సురెన్స్ కంపెనీని బట్టి ప్రీమియంను బట్టి పెంపు 15 శాతం నుండి 40 శాతం వరకు పెరగవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.

పోటీ కారణంగా తక్కువ ధరకు ప్రీమియం

పోటీ కారణంగా తక్కువ ధరకు ప్రీమియం

మూడేళ్ల క్రితం టర్మ్ లైఫ్ ప్రీమియం 5 నుండి 25 శాతం వరకు పెరిగింది. బీమా సంస్థల మధ్య పోటీ నెలకొనడంతో అవి తక్కువ ధరకే అధిక మొత్తం పాలసీలను అందించేందుకు ముందుకు వచ్చాయి. నెలకు రూ.500 ఖర్చుతో 30 ఏళ్ల వ్యక్తికి రూ.1 కోటి విలువైన పాలసీలను ఆన్ లైన్ ద్వారా అందించే సంస్థలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పాలసీల క్లెయిమ్ రేటు పెరగడంతో రీఇన్సురెన్స్ సంస్థలు ప్రీమియాన్ని పెంచుతున్నాయి.

సవాల్‌గా మారింది..

సవాల్‌గా మారింది..

ఇప్పటికే బీమా తీసుకున్న పాలసీలకు ఈ పెంపు వర్తించదు. పాత ప్రీమియం కొనసాగుతుంది. ఏప్రిల్ 10వ తేదీ తర్వాత నుండి తీసుకునే టర్మ్ పాలసీలకే ఇది వర్తిస్తుంది. టర్మ్ పాలసీలు తీసుకోవాలని భావించే వారికి మరికొద్ది రోజులే సమయం ఉందని అంటున్నారు. ప్రీమియం లెక్కింపులో ప్రధానంగా చూస్తే మరణాల రేటు గతంతో పోలిస్తే పెరిగింది. తక్కువ ప్రీమియానికి పాలసీలను అందించడం బీమా సంస్థలకు సవాల్‌గా మారిందని అంటున్నారు.

ప్రీమియాన్ని నిర్ణయించేవి ఇవే..

ప్రీమియాన్ని నిర్ణయించేవి ఇవే..

దేశంలోని ప్రజల మరణాల రేటు, అప్పటి వరకు ఉన్న ఇన్సురెన్స్ క్లెయిమ్ రేటు, పాలసీ హోల్డర్ వయస్సు, వృత్తిపరమైన, వ్యక్తిగత రిస్క్, రీ-ఇన్సూరర్ భరించే రిస్క్, వసూలు ప్రీమియం వంటి ద్వారా నిర్ణయిస్తారు.

English summary

మరో 7 రోజులే మిగిలింది..! ఏప్రిల్ 10వ తేదీ నుండి ప్రీమియం భారీగా పెంపు | Term life insurance premium cost likely to increase soon

Term life insurance premiums are likely to increase from April 10, 2020, according to insurance brokers. These premiums were earlier set to be increased from April 1, 2020 but the hike has been deferred to April 10 due to the coronavirus pandemic, as per industry sources.
Story first published: Friday, April 3, 2020, 8:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X