గత కొన్ని ఏళ్ళుగా సహజ మరణాల రేటు తగ్గుతోంది. ప్రమాదాలు, రోగాల కారణంగానే ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ కుటుంబం ఆర్థికంగా సురక్షితంగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. మీ కుటుంబ ఆర్థిక భద్రతకు లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. ప్రత్యేకించి చెప్పాలంటే మీరు ఒక్కరే మీ కుటుంబంలో డబ్బు సంపాదిస్తున్న వారు అయితే. ప్రస్తుతం మార్కెట్లో 2 రకాల లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. వీటిలో దేన్నీ తీసుకోవాలి అనే విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇందుకు ముందుగా ఈ రెండింటి మధ్య తేడా, లాభాలు, నష్టాలను అర్థం చేసుకోవడం అవసరం.
టర్మ్ ఇన్సూరెన్స్ అనేది సింపుల్ & రిస్క్ ఫ్రీ కవరేజ్ ప్లాన్. ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి పాలసీ సమయంలో మరణిస్తే నామినీకి నిర్ణయించిన మొత్తం (డెత్ బెబేఫిట్స్) లభిస్తాయి. కానీ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి పాలసీ సమయంలో జీవించి ఉంటే అతనికి ఎలాంటి మొత్తం అందదు. అందువల్ల టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు లైఫ్ ఇన్సూరెన్స్ కంటే చాలా తక్కువగా ఉంటాయి.

టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు
టర్మ్ ప్లాన్‌లు తక్కువ ప్రీమియంలతో ఎక్కువ కవరేజీని అందిస్తాయి. ఉదాహరణకు మీ వయస్సు ఇంకా ఆరోగ్యాన్ని బట్టి మీరు రూ. 500-1,000 ప్రతినెల ప్రీమియం కట్టడం ద్వారా 1 కోటి కవరేజీ పొందవచ్చు.
తక్కువ మొత్తం అండ్ ఫ్లెక్సిబిలిటీ : టర్మ్ ప్లాన్‌లు లైఫ్ కవరేజీపై మాత్రమే ఫోకస్ పెడతాయి, వీటి ప్రీమియంలు కట్టుకునేటట్టు ఉంటాయి. చాలా టర్మ్ ప్లాన్‌లు తీవ్రమైన అనారోగ్య కవరేజ్, ప్రమాదవశాత్తు డెత్ బెనిఫిట్స్ లేదా ప్రీమియం మినహాయింపులు వంటి అప్షన్స్ అందిస్తాయి.
టర్మ్ ఇన్సూరెన్స్ పరిమితులు
మెచ్యూరిటీ బెనిఫిట్ ఉండదు: పాలసీ మెచ్యూరిటీ వరకు పాలసీదారుడు జీవించి ఉంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉండదు. ఇది కొంతమందికి అనుకూలంగా ఉండదు.
లిమిటెడ్ టైం: సాధారణంగా టర్మ్ ప్లాన్‌లు 40 సంవత్సరాల వరకు లేదా పాలసీదారుడికి 75 సంవత్సరాలు వచ్చే వరకు కవరేజీని అందిస్తాయి. దీని తర్వాత కవరేజ్ ముగుస్తుంది. తరువాత మళ్ళీ రెన్యూవల్ చేసుకోవాలి.
లైఫ్ ఇన్సూరెన్స్
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు మనీ-బ్యాక్ ప్లాన్స్, ఇన్సూరెన్స్ కవరేజీతో వస్తాయి. అంటే పాలసీదారుడు పాలసీ టైం వరకు జీవించి ఉంటే అతను మెచ్యూరిటీ బెనిఫిట్స్ పొందుతాడు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు హామీతో కూడిన మొత్తాన్ని అందిస్తాయి.
లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు
మెచ్యూరిటీ బెనిఫిట్: మీరు పాలసీ వ్యవధిలో జీవించి ఉంటే మీరు మీ మొత్తాన్ని పొందుతారు.
పన్ను ప్రయోజనాలు ఇంకా లోన్స్: అవసరాన్ని బట్టి లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ పాలసీలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా ఉంది.
లైఫ్ ఇన్సూరెన్స్ లిమిట్స్
ఎక్కువ ప్రీమియం, తక్కువ కవరేజీ : లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల ప్రీమియంలు టర్మ్ ఇన్సూరెన్స్ కంటే ఎక్కువగా ఉంటాయి. పోల్చి చూస్తే, అదే ప్రీమియం మొత్తానికి హామీ మొత్తం తక్కువగా ఉంటుంది.
ఉదాహరణకు రూ. 1 కోటి టర్మ్ కవర్‌ను అందించే ప్రీమియం కోసం రూ. 10-20 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రమే అందుబాటులో ఉండవచ్చు.తక్కువ రాబడి: లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇతర పెట్టుబడితో పోలిస్తే రాబడి తక్కువగా ఉంటుంది.
ఏది ఎక్కువ లాభం?
మీరు మీ ఫ్యామిలీ భవిష్యత్తు ఆర్థిక భద్రత కోసం తక్కువ ధర, ఎక్కువ కవరేజీ కోసం చూస్తున్నట్లయితే టర్మ్ ఇన్సూరెన్స్ చాలా బెటర్.మీరు చిన్న వయస్సు వారైతే మీకు పిల్లలు లేదా వృద్ధులైన తల్లిదండ్రులు లేదా హోమ్ లోన్ బాధ్యతలు ఉన్నట్లయితే మీకు టర్మ్ ప్లాన్ సరైనది. మీరు హై ప్రీమియంలు కట్టగలిగితే, ఇన్సూరెన్స్ ప్రయోజనాలు కాకుండా సేవింగ్స్ చేయాలనుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ మీకు సరైనది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications