ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) డిసెంబర్ 18వ తేదీ నుండి బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. జనవరి 1వ తేదీన ఇది ముగియనుంది. ఆఫర్ వ్యాల్యూ దాదాపు రూ.16వేలకోట్లుగా భావిస్తున్నారు. గత నెలలో 5,33,33,333 వాటాలను (1.4 శాతం) బైబ్యాక్ చేసేందుకు టీసీఎస్ వాటాదారులు అనుమతిని ఇచ్చారు. ఒక్కో షేర్ రూ.3000 వద్ద కొనుగోలు చేసేందుకు అంగీకరించారు. టీసీఎస్ బైబ్యాక్ ఆఫర్‌ను రెండు మూడు నెలల క్రితమే ప్రకటించారు.సెబి బైబ్యాక్ నిబంధనలు 2018 ప్రకారం ఆఫర్ లెటర్‌ను అర్హులైన వాటాదారులకు పంపిస్తామని, ఈ ప్రక్రియ డిసెంబర్ 15వ తేదీ కంటే ముందు పూర్తవుతుందని గతవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టీసీఎస్ తెలిపింది.

బైబ్యాక్‌ను పరిగణలోకి తీసుకోవచ్చు
టీసీఎస్ బైబ్యాక్ నేపథ్యంలో మీ షేర్లను విక్రయించవచ్చునా? కరోనా నేపథ్యంలో మార్చి చివరి వారంలో అన్నింటితో పాటు టీసీఎస్ స్టాక్ కూడా కుప్పకూలింది. అదే సమయంలో ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఎగిసింది. ఐటీ స్టాక్స్ అన్నీ కరోనా కాలంలో జంప్ చేశాయి. అయితే మరింత భారీగా పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి షేర్ల బైబ్యాక్‌ను పరిగణలోకి తీసుకోవచ్చునని చెబుతున్నారు. మార్చి కనిష్టం నుండి టీసీఎస్ స్టాక్ 85 శాతం ర్యాలీ చేసింది. బెంచ్‌మార్క్ ఎస్ అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్ 80 శాతం లాభపడింది. అంటే స్టాక్ ధర సూచీతో పోల్చుకుంటే ఎక్కువగా వృద్ధిని నమోదు చేసింది.

ధరల్లో తేడా..
ప్రస్తుతం టీసీఎస్ షేర్ ధర, బైబ్యాక్ ధరల్లో చాలా తేడా ఉందని, కాబట్టి ఈ ఆఫర్‌కు ఎక్కువ మంది మొగ్గు చూపవచ్చునని అంటున్నారు. కాబట్టి అన్ని ఆఫర్లు అంగీకరించకపోవచ్చు. టీసీఎస్ పైన బుల్లిష్‌గా ఉంటే వాటాదారులు బైబ్యాక్‌కు దూరం ఉన్నప్పటికీ, బుల్లిష్‌గా లేని వాటాదారులు అమ్మవచ్చునని చెబుతున్నారు. స్టాక్ వ్యాల్యుయేషన్ ఎక్కువకాలం ఇలా ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చునని, పెరుగుదల మెల్లింగా ఉండే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

టీసీఎస్ స్టాక్ మంచి పెట్టుబడియే
సమీప భవిష్యత్తులో ఈ స్టాక్ రూ.3000ను దాటి వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే లాంగ్ టర్మ్‌లో టీసీఎస్‌లో పెట్టుబడి మంచిదని సూచిస్తున్నారు. మీరు దీర్ఘకాలిక పెట్టుబడిదారు అయితే ఫ్రంట్‌లైన్ ఐటీ స్టాక్స్ వైపు మొగ్గు చూడటం మంచిదని, గ్లోబలైజేషన్, టెక్నాలజీ వంటి అంశాలను అవగతం చేసుకుంటే టీసీఎస్‌లో పెట్టుబడి సమంజసంగా కనిపించవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం బైబ్యాక్ మంచి ఆఫర్ అంటున్నారు.
More From GoodReturns

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

TCS Q4 FY26 Results: టీసీఎస్ క్యూ4 ఎఫ్వై26 ఫలితాలు ఇవిగో.. భారీగా పెరిగిన లాభాలు..డివిడెండ్ ఎంతంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications