For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ స్టాక్స్ కొంటే కొద్ది రోజుల్లోనే మంచి రిటర్న్స్! మరింతగా పెరిగే ఛాన్స్

|

స్టాక్ మార్కెట్లు గత రెండు నెలలుగా సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి. నవంబర్ నెలలో 42,000 మార్కు దాటిన సెన్సెక్స్ ఆ తర్వాత వేగంగా 46,000ను దాటి, 47,000ను కూడా టచ్ చేసింది. అయితే బ్రిటన్‌లో కొత్త వైరస్ కారణంగా రెండు రోజుల క్రితం సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లు నష్టపోయింది. ఇది కరెక్షన్‌గా కూడా కనిపించింది. చాలా రోజులుగా పైపైకి చేరుతున్న మార్కెట్లు దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావించారు. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. మరోసారి కరెక్షన్‌కు లోనయ్యే అవకాశాలు కొట్టి పారేయలేమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ప్రాపర్టీ కొనుగోలు చేసేవారికి డిసెంబర్ 30న SBI బంపరాఫర్! ఈ వివరాలు తెలుసుకోండిప్రాపర్టీ కొనుగోలు చేసేవారికి డిసెంబర్ 30న SBI బంపరాఫర్! ఈ వివరాలు తెలుసుకోండి

ఈ 4 స్టాక్స్‌తో మంచి రిటర్న్స్ ఉండొచ్చు

ఈ 4 స్టాక్స్‌తో మంచి రిటర్న్స్ ఉండొచ్చు

బుధవారం (డిసెంబర్ 23) ఐటీ స్టాక్స్ దూకుడు కనిపించింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి షేర్లు సరికొత్త శిఖరాలను తాకాయి. ఈ స్టాక్స్ మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో షేర్లు మంచి రిటర్న్స్ ఇవ్వవచ్చునని చెబుతున్నారు. ఇన్ఫోసిస్ షేర్ ధర నేడు ఏకంగా 2.58 శాతం లాభపడి రూ.1252 వద్ద ముగిసింది. టీసీఎస్ స్టాక్ 1.21 శాతం ఎగిసి రూ.2907 వద్ద ముగిసింది.

ఇన్ఫోసిస్, టీసీఎస్

ఇన్ఫోసిస్, టీసీఎస్

ఇన్ఫోసిస్ స్టాక్ ఇప్పటికే రూ.1200 దాటినప్పటికీ, రూ.1000 నుండి రూ.1050 స్థాయిలకు తగ్గే అవకాశాలు తక్కువే అంటున్నారు. గత నెలలోను ఇన్ఫోసిస్ భారీగా ఎగిసింది. 1080 స్టాప్ లాస్‌తో రూ.1250 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

ఇక, టీసీఎస్ స్టాక్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త శిఖరాలను తాకుతోంది. 2800 వద్ద స్టాప్ లాస్‌తో 3000 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

HCL, విప్రో

HCL, విప్రో

హెచ్‌సీఎల్ టెక్, విప్రో సహా వివిధ ఐటీ సంస్థలు మంచి పనితీరును కనబరుస్తున్నాయి. హెచ్‌సీఎల్ షేర్ ధర నేడు 0.89 శాతం పెరిగి రూ.922 వద్ద క్లోజ్ అయింది. గత కొద్ది వారాలుగా 900 పైన ఎక్కువగా ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ ధర త్వరలో 1070-1100 స్థాయికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. స్టాప్ లాస్ 795గా పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

విప్రో స్టాక్ నేడు 5.70 శాతం లాభపడి 385 వద్ద ముగిసింది. నిరోధకస్థాయి 290 కాగా, మూడు నాలుగు వారాల్లోనే 370-380 స్థాయికి చేరుకుంది. 310 వద్ద స్టాప్ లాస్‌తో 420 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

English summary

ఈ స్టాక్స్ కొంటే కొద్ది రోజుల్లోనే మంచి రిటర్న్స్! మరింతగా పెరిగే ఛాన్స్ | TCS, Infosys share hits new high, analysts see further upside

The Nifty has been moving from strength to greater strength and continues to project a strong momentum going forward. While short term corrections and profit booking phases cannot be ruled out, the overall trend remains bullish.
Story first published: Wednesday, December 23, 2020, 22:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X