ప్రతి ఒక్కరూ డబ్బును ఏదైనా సురక్షితమైన వాటిలో ఇన్వెస్ట్ చేసి ఆదాయం పొందాలని చూస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బులు వేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందనే ఆశతో ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టే వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఏ బ్యాంకు ఎక్కువగా వడ్డీని ఇస్తుందో తెలియదు. ఇందుకు సంబంధించి దేశంలోనే నమ్మకమైనా ప్రముఖ కంపెనీ టాటా ఫిక్స్‌డ్ డిపాజిట్ సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
టాటా అనగానే మనకు దివంగత వ్యాపారవేత్త రతన్ టాటా గుర్తుకొస్తారు. అతని వల్ల భారతదేశం ఎన్నో రకాలుగా లబ్ది పొందింది. మనము ఉపయోగించే అన్ని ఉత్పత్తులలో టాటా ఖచ్చితంగా ఎక్కడో ఒకచోట ఉంటుంది. వాటన్నింటినీ మనకు అందించిన వ్యక్తి రతన్ టాటా. ప్రజలందరినీ సమానం చేయాలనే ఉద్దేశ్యంతో అతను అన్ని వ్యాపారంలో తక్కువ ధర ఉత్పత్తులను ప్రవేశపెట్టాడు.

అదే విధంగా టాటా న్యూ పేరుతో ఓ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో అన్ని టాటా వ్యాపారాలు ఉంటాయి. అయితే తాజాగా మరొక సర్వీస్ ఇప్పుడు పరిచయం చేసింది. దీని ప్రకారం ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో రూ.1000 పెట్టుబడిని ప్రారంభిస్తే 9.1% వరకు వడ్డీ ఇవ్వనున్నట్లు సమాచారం. టాటా మ్యూచువల్ ఫండ్‌లు ఇప్పటికే మార్కెట్‌లో ఉండగా, టాటా రిటైల్ కంపెనీ 9.1% వడ్డీ రేటుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు అఫీషియల్ ప్రకటన చేసింది.
డిజిటల్ మార్కెట్‌లో బలమైన పట్టుతో టాటా న్యూ కస్టమర్లకు క్యాష్ సేవింగ్ అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలకు సంబంధించిన చాల రకాల ఆర్థిక ఉత్పత్తులు, రిటైల్ పేమెంట్ సౌకర్యాలను అందిస్తుంది. దీని ప్రకారం, మీరు సేవింగ్స్ అకౌంట్ తెరవకుండానే టాటా న్యూ ద్వారా వివిధ బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్ చేయవచ్చు. డిపాజిట్ చేసిన డబ్బుపై 9.1 శాతం వడ్డీ రేటుతో ప్రముఖ ఆర్థిక సంస్థల ఎఫ్‌డి పథకాల్లో కస్టమర్లు పెట్టుబడి పెట్టవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
టాటా డిజిటల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ (ఫైనాన్షియల్ సర్వీసెస్) గౌరవ్ హజ్రతీ మాట్లాడుతూ మేము చాల నమ్మకమైన బ్యాంకుల ద్వారా పెట్టుబడిదారులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించాము. మీరు కేవలం 1,000 రూపాయలతో కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు అని చెప్పారు. అదే విధంగా కస్టమర్లు వివిధ పెట్టుబడి అప్షన్లతో బ్యాంకులు ఇంకా చిన్న ఫైనాన్స్ బ్యాంకింగ్ పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. దీని ప్రకారం, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ వంటి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ (NBFCలు)లో సెలక్షన్ చేసుకోవచ్చు.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు: ముందుగా యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1001 రోజుల FD పథకంపై 9.00% వడ్డీని అందిస్తుంది. అదేవిధంగా నార్త్ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 566 రోజుల నుండి 1111 రోజుల కాలవ్యవధికి 9.00% వడ్డీని అందిస్తుంది.
ఈక్విటాస్ స్మాల్ బినాన్స్ బ్యాంక్ 888 రోజుల FT పథకంపై 8.25% వడ్డీని అందిస్తుంది. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల FD పథకంపై 8.25% వడ్డీని అందిస్తుంది. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల FD పథకంపై 8.60% వడ్డీని అందిస్తుంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 12 నెలల వరకు FD పథకంపై 8.25% వడ్డీ రేటును అందిస్తుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులే కాకుండా, ప్రముఖ బ్యాంకులు, ప్రైవేట్ & ప్రభుత్వ సంస్థలు కూడా 8% కంటే ఎక్కువగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని అందిస్తాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications