Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 8.7 శాతం వడ్డీ ఇస్తున్న బ్యాంక్ ఇదే..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 0.25 శాతం పెంచి 5.50 శాతానికి పెంచిన తర్వాత పలు ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచాయి. అయితే చాలా బ్యాంకులు దీనికి అనుగుణంగా తమ డిపాజిట్ రేట్లను ఇంకా సవరించలేదు. బ్యాంకులు రెపో రేటు పెరిగిన అదే శాతంలో తమ వడ్డీ రేట్లను పెంచడం తప్పనిసరి కాకపోయినప్పటికీ, రెపో రేటు ఏ దిశలో మారితే, బ్యాంకుల వడ్డీ రేట్లు కూడా అదే దిశలో మారతాయని ఆశించడం సహజం. ఈసారి బ్యాంకుల వారీగా ఈ మార్పులు క్రమంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అక్టోబర్ 18, 2026తో ముగిసిన వారంలో కేవలం సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SFB) మాత్రమే తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) రేట్లను సవరించింది.
ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SFB) అక్టోబర్ 16, 2026న తన FD రేట్లను సవరించింది. సీనియర్ సిటిజన్ల (60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు) కోసం గరిష్ట డిపాజిట్ రేటు 8.50 శాతంగానే కొనసాగుతోంది. ఒకవేళ ఈ డిపాజిట్‌ను మెచ్యూరిటీ కాలం వరకు అంటే ఐదేళ్ల పాటు ఉంచితే, వార్షిక ప్రాతిపదికన ఇది 8.77 శాతానికి సమానం అవుతుంది. సీనియర్ సిటిజన్ల కోసం సవరించిన FD రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

7-14 రోజుల కాలపరిమితికి 4.15 శాతం, 15-45 రోజుల కాలపరిమితికి 4.40 శాతం, 46-90 రోజుల కాలపరిమితికి 4.65 శాతం ఆఫర్ చేస్తోంది. 91 రోజుల నుండి ఆరు నెలల కాలపరిమితికి 5.15 శాతం చెల్లిస్తోంది. ఆరు నెలల ఒక రోజు కాలపరిమితికి 6.65 శాతం, ఆరు నెలల ఒక రోజు నుండి తొమ్మిది నెలల కాలపరిమితికి 5.65 శాతం, తొమ్మిది నెలల కంటే ఎక్కువ నుండి ఒక సంవత్సరం లోపు కాలపరిమితికి 6.15 శాతం వడ్డీ అందిస్తోంది. ఒక సంవత్సరం కాలపరిమితికి 7.40 శాతం, ఒక సంవత్సరం ఒక రోజు కాలపరిమితికి 7.66 శాతం, ఒక సంవత్సరం ఒక రోజు నుండి 18 నెలల లోపు కాలపరిమితికి 7.40 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
18 నెలల కాలపరిమితికి 8.16 శాతం వడ్డీ ఇస్తుండగా.. 18 నెలల కంటే ఎక్కువ నుండి రెండు సంవత్సరాల కాలపరిమితికి 7.40 శాతం వడ్డీ చెల్లిస్తోంది. రెండు సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి 30 నెలల లోపు కాలపరిమితికి 7.40 శాతం వడ్డీ అందిస్తోంది. 30 నెలల కాలపరిమితికి 8.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. 30 నెలల నుంచి మూడు సంవత్సరాల కాలపరిమితికి 7.40 శాతం వడ్డీ చెలిస్తుండగా..
మూడు సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి ఐదు సంవత్సరాల లోపు కాలపరిమితికి 6.90 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఐదు సంవత్సరాల కాలపరిమితికి 8.50 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి 7.40 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
బ్యాంకు రెండు కొత్త కాలపరిమితులను ప్రవేశపెట్టింది. ఒక సంవత్సరం ఒక రోజు, ఒక సంవత్సరం ఒక రోజు నుంచి 18 నెలల లోపు, ఒక సంవత్సరం, అంతకంటే ఎక్కువ కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై బ్యాంకు 7.60 శాతం నుంచి 8.77 శాతం వరకు వార్షిక రాబడిని అందిస్తోంది. సాధారణ ప్రజల కోసం, ఇదే కాలపరిమితులకు వార్షిక రాబడి 7.45 శాతం నుండి 8.51 శాతం వరకు ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications