Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకు ఇదే..!
చాలా మంది ఉద్యోగులకు రిటైర్డ్ కాగా కొంత మొత్తంలో డబ్బులు వస్తుంటాయి. కొందరికి ఆ డబ్బుతోనే జీవితాంతం కాపాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే సీనియర్ సిటిజన్లు సురక్షితమైన ఫిక్స్ డ్ డిపాజిట్లలో డిపాజిట్ చేస్తుంటారు. అయితే అయితే అధిక వడ్డీ రేట్లు ఉన్న బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం వల్ల వారికి కాస్త ఎక్కువ వడ్డీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు పలు స్మాల్ ఫైనాన్స్, ప్రైవేట్, ప్రభుత్వం బ్యాంకులు మంచి వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఇందులో సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా వడ్డీ రేట్లు చెల్లిస్తోంది.
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ.3 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై పండుగ సీజన్ కోసం ప్రత్యేక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ కింద సాధారణ డిపాజిటర్లు 8.25 శాతం వరకు, సీనియర్ సిటిజన్లు ఐదేళ్ల డిపాజిట్లపై 8.60 శాతం వరకు వడ్డీని పొందవచ్చు. ఈ ప్రత్యేక రేట్లు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16, 2026 వరకు వర్తిస్తాయి. బ్యాంక్, 18 నెలలు, 30 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లతో సహా ఎంపిక చేసిన తక్కువ కాలపరిమితులపై కూడా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. సాధారణ డిపాజిటర్లు ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.25% వడ్డీ రేటును పొందవచ్చు. వర్తించే నిబంధనలు, షరతులకు లోబడి, ఈ డిపాజిట్లపై వార్షిక రాబడి 8.51 శాతంగాగా ఉంటుందని బ్యాంక్ పేర్కొంది.

30 నెలల కాలపరిమితి గల డిపాజిట్లపై బ్యాంక్ 8.10 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుండగా... 18 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 8.01 శాతం వడ్డీ అందిస్తోంది. ఆఫర్ కాలంలో రూ.3 కోట్ల లోపు అర్హత గల డిపాజిట్లపై ఈ ప్రత్యేక రేట్లు వర్తిస్తాయి. డిపాజిట్ బుక్ చేసే ముందు కస్టమర్లు వర్తించే కాలపరిమితి, నిబంధనలను పరిశీలించాల్సి ఉంటుంది. ప్రత్యేక పండుగ ఆఫర్ కింద సీనియర్ సిటిజన్లు ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.60 శాతం వరకు సంపాదించవచ్చు. వర్తించే నిబంధనలు, షరతులకు లోబడి, ఈ డిపాజిట్లపై వార్షిక రాబడి 8.88 శాతం వరకు కూడా ఉంటుందని బ్యాంక్ వివరించింది. 30 నెలల కాలపరిమితికి, సీనియర్ సిటిజన్లు 8.25% సంపాదించవచ్చు, కాగా 18 నెలల డిపాజిట్లపై వడ్డీ రేటు 8.16 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే ముందు కస్టమర్లు వివిధ కాలపరిమితులలో వడ్డీ రేట్లను పోల్చి చూసుకోవాలి.
5 ఏళ్ల కాలపరిమితి గల రూ.5 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ పై సీనియర్ సిటిజన్లకు 8.60 శాతం వడ్డీతో రూ.7,65,134 వస్తాయి. ఇందులో వడ్డీ రూ.2,65,134 ఉంటుంది. ఎఫ్డీలు చేసే ముందు బ్యాంకుల గురించి తెలుసుకోవాలి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. అయిత ఏ బ్యాంకులో అయిన రూ.5 లక్షల వరకు బీమా ఉంటుంది. అందుకే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో భారీ మొత్తంలో ఎఫ్డీ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications