FD: సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకు ఇదే..!
కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ మంచి వడ్డీ రేటును అందిస్తున్నాయి. తాజాగా సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించింది. పెంచిన వడ్డీ రేట్లు ఆగస్టు 15, 2026 నుంచి అమలులోకి వస్తాయి. రూ.3 కోట్ల లోపు డిపాజిట్లపై ఎంపిక చేసిన కాలపరిమితులకు పెట్టుబడిదారులకు అధిక రాబడిని అందిస్తోంది. సాధారణ వినియోగదారులకు బ్యాంక్ ఏడాదికి గరిష్టంగా 8.25 శాతం వడ్డీ రేటును అందిస్తుండగా, సీనియర్ సిటిజన్లు ఏడాదికి 8.50 శాతం వరకు వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ విషయంలో సాధారణ వినియోగదారులకు 8.51 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.77 శాతం వార్షిక రాబడి లభిస్తుందని బ్యాంక్ పేర్కొంది.
సీనియర్ సిటిజన్ల కోసం 30 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏడాదికి 8.25 వడ్డీ రేటు ఆఫర్ చేస్తుండగా.. సాధారణ వినియోగదారుల కోసం 30 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏడాదికి 8.10 శాతం వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్ల కోసం 18 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏడాదికి 7.95 శాతం వడ్డీ చెల్లిస్తుండగా.. సాధారణ వినియోగదారులకు 18 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.03 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. తమ డబ్బును ఐదేళ్లపాటు లాక్ చేయకూడదనుకునే పెట్టుబడిదారులు 30 నెలల ఎంపికను పరిశీలించవచ్చు.

జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం ఐదేళ్ల కాలపరిమితి గల ఎఫ్డీలపై 8 శాతం వడ్డీని అందిస్తోంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.25 శాతం, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.50, ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 6.25, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.00, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 6.75, స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.25, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.05, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.70, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.50 శాతం వడ్డీ అందిస్తున్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఎఫ్డీ చేసేటప్పుడు భద్రత కూడా చూసుకోవాలి. ఇలాంటి బ్యాంకుల్లో రూ.5 లక్షల లోపు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
బ్యాంకుల్లో మనం చేసే ఫిక్స్ డ్ డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) ద్వారా రూ. 5 లక్షల వరకు బీమా ఉంటుంది. అందుకే స్మాల్ ఫైనాన్స్ FDలలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు ఒకే బ్యాంకులో రూ.20 లక్షల ఎఫ్డీ చేస్తే.. ఆ బ్యాంక్ డిఫాల్ట్ అయితే డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ మీకు రూ. 5 లక్షలు మాత్రమే వస్తాయి. అందుకే రూ.5 లక్షల లోపు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసుకుంటే మంచిదని చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications